• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Photo Story >  ప్రాజెక్ట్ కె.. రంగంలోకి...

ప్రాజెక్ట్ కె.. రంగంలోకి దిగిన రానా!

| ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ చేస్తున్న అతి పెద్ద చిత్రం ప్రాజెక్ట్ కె. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

By - Tupaki Desk
Update: 2023-07-18 12:44 GMT

ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ చేస్తున్న అతి పెద్ద చిత్రం ప్రాజెక్ట్ కె. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దాదాపు రూ.500కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వైజయంతి బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఫ్యాన్స్ ఆశలన్నీ ఇప్పుడు ఈ సినిమా పై ఉన్నాయి. ఈ మూవీపై చలా అంచనాలు ఉన్నాయి.

కాగా, ప్రాజెక్ట్ కె సినిమా అంత‌ర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మ‌క‌మైన `శాన్ డియాగో కామిక్ కాన్‌` ఈవెంట్లో పాల్గొన‌నున్న‌ట్లుగా చిత్ర బృదం ప్ర‌క‌టించిన విషయం మనకు తెలిసిందే. అమెరికాలో జ‌ర‌గ‌నున్న `శాన్ డియాగో కామిక్ కాన్‌` ఈవెంట్లో `ప్రాజెక్ట్ కె` టీమ్ అంతా పాల్గొన‌నుంది. ఈ ఈవెంట్‌కు హాజ‌రు కానున్న తొలి భార‌తీయ సినిమాగా ప్రాజెక్ట్ కె రికార్డు సృష్టించింది.


ఈ ఈవెంట్ జులై 20వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ అమెరికా చేరుకుంటోంది. ఇప్పటికే, ప్రభాస్ అమెరికాలోనే ఉన్నారు. ఆయన ఆదిపురుష్ రిలీజ్ కి ముందే అమెరికా వెళ్లారు. ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇండియా వస్తారని చెప్పారు. కానీ, ఇప్పుడు ఈ ఈవెంట్ కోసం ఆయన అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాతే ప్రభాస్ మళ్లీ స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది.

అయితే, ఇప్పుడు ఈ ఈవెంట్ కోసం ప్రభాస్ తో పాటు, రానా కూడా అక్కడికి వెళ్లడం విశేషం. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోని తాజాగా వైజయంతి మూవీస్ షేర్ చేసింది. అమెరికాలో ల్యాండ్ అయ్యారు అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇప్పుడు ఈ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా, ప్రభాస్ హాలీవుడ్ స్టార్ లా ఉన్నారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండటం విశేషం.

కాగా, ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ , దిశా పటానీ లాంటి వారు నటిస్తుండటం విశేషం. ఇదిలా ఉండగా, ఈ ఈవెంట్ కి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో పాటు ప్ర‌భాస్, దీపిక ప‌దుకునే, క‌మ‌ల్ హాస‌న్ దీనికి హాజ‌రు కానున్నారు. ఇదే వేదిక‌పై ఈ సినిమా టైటిల్‌, టీజ‌ర్‌ని విడుద‌ల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ మూవీతో అయినా ప్రభాస్ హిట్టు కొడతాడో లేదో చూడాలి.

Tags:    
  • Prabhas 
  • RanaDagubati 
  • Projectk 
  • PhotoStory 
  • Tollywood 
  • MovieNews 

Similar News

జారిపోతున్న షోల్డర్ తో పరువాల విందు వడ్డిస్తున్న నభా నటేష్!

2026-11-17 00:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

కుర్రకారుకు కొత్త క్రష్.. ఆకట్టుకునే అందంతో!

2026-11-09 08:17 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

ఫెస్టివ్ వైబ్.. ఎలిగెంట్ లుక్ లో మృణాల్ సోయగాలు..

2026-11-07 05:16 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

Copyright @2026

Powered by Blink CMS