తాను విఫ‌ల‌మై.. పార్టీకి భార‌మై.. ష‌ర్మిల ప్ర‌స్థానం.. !

ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న వైఎస్ షర్మిల అడ్రస్ లేకుండా వ్యవహరిస్తున్నారు. అసలు ఏపీలో పర్యటించి దాదాపు రెండు నెలలు అయిపోయింది.;

Update: 2026-01-15 03:30 GMT

ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న వైఎస్ షర్మిల అడ్రస్ లేకుండా వ్యవహరిస్తున్నారు. అసలు ఏపీలో పర్యటించి దాదాపు రెండు నెలలు అయిపోయింది. నిజానికి కీలకమైన పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల పార్టీని డెవలప్ చేయడంతో పాటు స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా అడుగులు వేయాలని పార్టీ అధిష్టానం నుంచి కూడా ఆమెకు గత ఏడాది అక్టోబర్ లోనే ఆదేశాలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో కమిటీలను వేసే ప్రక్రియ ప్రారంభం కాలేదు. మరోవైపు రాష్ట్రంలో అసలు షర్మిల ఎక్కడ కనిపించడం లేదు.

తరచుగా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నప్పటికీ అది హైదరాబాదు నుంచి చేస్తుండడం విశేషం. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేర్చనీయాంశంగా మారింది. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. ప్రస్తుతం జరుగుతున్న చర్చలను బట్టి త్వరలోనే షర్మిలను మారుస్తారు అన్న వాదన వినిపిస్తోంది. ఆమెపై తరచుగా అసంతృప్తి నెలకొన‌డం, రాజకీయంగా ఆమె వ్యవహార శైలి పై సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్న నేపద్యంలో షర్మిల మార్పు ఖాయం అన్న వాదన కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఈ దిశగానే ఇప్పుడు మరింత జోరుగా పార్టీ అధిష్టానం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

సీనియర్ నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతోందని సమాచారం .అయితే ఇప్పటికిప్పుడు మారుస్తారా లేక ఎలానో ఇంకో 6 మాసాలు ఉంటే రెండు సంవత్సరాలు పూర్తవుతాయి కాబట్టి అప్పుడు షర్మిలను మారుస్తూ చేస్తారా అనేది చూడాలి. ఏది ఏమైనా భారీ అంచనాలు, ఆశలతో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించినప్పటికీ షర్మిల తనను తాను నిరూపించుకోలేకపోయారు అన్నది వాస్తవమ‌ని పరిశీలకులు చెబుతున్నారు. తనను తాను గెలిపించుకోలేకపోవడంతో పాటు పార్టీ నాయకులను కూడా గెలిపించలేకపోయారు. ముఖ్యంగా సంస్థగతంగా పార్టీని బలవపేతం చేసే విషయంలో కూడా షర్మిల చాలా వెనుకబడ్డారు.

వాస్త‌వానికి ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ గ్యాప్ అయితే ఉంది. వైసీపీ ఒక‌వైపు పూర్తిగా విఫ‌ల‌మ‌వుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఆ పార్టీ గ్రాఫ్ నానాటికీ త‌గ్గుముఖం ప‌డుతోంది. అదేవిధంగా టిడిపి, జనసేన లకు దూరంగా ఉంటున్న వారిని ఆకర్షించేందుకు కాంగ్రెస్‌కు భారీ అవకాశమే ఉంది. అయినప్పటికీ షర్మిల దీనిని సద్వినియోగం చేసుకోవడం లేదన్న వాద‌న‌ వినిపిస్తోంది. మ‌రోవైపు గ‌త రెండు మూడు మాసాలుగా షర్మిల కనిపించకపోవడం, ఆమె వాయిస్ వినిపించకపోవడం వంటివి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మొత్తంగా మార్పు దిశగా అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News