వైసీపీ మేయర్ అభ్యర్థిగా మాజీ ఎంపీ ?

వైసీపీ మళ్ళీ రాజకీయ సామాజిక ప్రయోగాలు చేయడానికి సిద్ధం అవుతోంది అంటున్నారు. పైగా ఇంకోసారి విశాఖ వంటి ప్రతిష్టాత్మకమైన మేయర్ సీటుకు మహిళా అభ్యర్థిని ప్రతిపాదిస్తోంది అని ఊహాగానాలు సాగుతున్నాయి.

Update: 2026-10-02 03:41 GMT

వైసీపీ మళ్ళీ రాజకీయ సామాజిక ప్రయోగాలు చేయడానికి సిద్ధం అవుతోంది అంటున్నారు. పైగా ఇంకోసారి విశాఖ వంటి ప్రతిష్టాత్మకమైన మేయర్ సీటుకు మహిళా అభ్యర్థిని ప్రతిపాదిస్తోంది అని ఊహాగానాలు సాగుతున్నాయి. 2021లో అప్పటిదాకా ప్రచారంలో ఉన్న పేరు ఆ పార్టీ సీనియర్ నేత వంశీ క్రిష్ణ శ్రీనివాస్ అయితే లాస్ట్ మినిట్ లో అనూహ్యంగా మహిళా మేయర్ గా హరి వెంకటకుమారిని చేసి వైసీపీ అధినాయకత్వం షాక్ తినిపించింది. ఆ దెబ్బతోనే వంశీకృష్ణ తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా వైసీపీకి 2024 ఎన్నికల కంటే ముందు రాజీనామా చేసి రిటార్ట్ ఇచ్చారు. ఇదంతా ఫ్లాష్ బ్యాక్ అయితే ఇపుడు మరోసారి మహిళా అభ్యర్థిని మేయర్ సీటు కోసం పోటీ పెట్టాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.

రెండు విధాలుగా :

అనకాపల్లికి చెందిన మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి పేరుని విశాఖ మేయర్ అభ్యర్ధిగా వైసీపీ అధినాయకత్వం సీరియస్ గా పరిశీలిస్తోంది అని అంటున్నారు. ఆమె 2021లో అనకాపల్లి నుంచి ఎంపీ అయ్యారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారుగా ఉన్న ఆమె డాక్టర్ గా కూడా జనానికి దగ్గరగా ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అని పేరు ఉంది. ఆమెకి కనుక మేయర్ అభ్యర్థిగా అవకాశం ఇస్తే అటు బీసీ వర్గాలు ఇటు మహిళా వర్గాల నుంచి ఆదరణ దక్కుతుందని వైసీపీ వ్యూహ రచన చేస్తోంది అని అంటున్నారు. పైగా గవర సామాజిక వర్గం మేయర్ రేసులో ఉంది. కూటమిలో టికెట్ కోసం ఆశావహులు చూస్తున్నారు. అక్కడ ఆ సామాజిక వర్గానికి చాన్స్ రాకపోతే తమ వైపు ఆ కులం ఓట్లు చాలా వరకూ టర్న్ అవుతాయన్న అంచనాలతో వైసీపీ ఈ పేరు పరిశీలన చేస్తోంది అని అంటున్నారు.

మాజీ ఎమ్మెల్యేలు సైతం :

ఇక ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల పేర్లు కూడా వైసీపీ షార్ట్ లిస్ట్ లో ఉన్నాయి. వాసుపల్లి గణేష్ కుమార్ మాజీ ఎమ్మెల్యేలలో ముందు వరసలో ఉన్నారు. అలాగే మరో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ కుమార్ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే వైసీపీ అధినాయకత్వం ఈ మూడు పేర్లతో పాటు మాజీ ఎంపీ పేరుని తాను స్వయంగా పరిశీలించడంతో భీశెట్టి సత్యవతికి చాన్స్ ఇస్తారని అంటున్నారు. జీవీఎంసీ 120 వార్డుగా విస్తరించి ఉంది. అనకాపల్లి దాకా కార్పోరేషన్ పరిధి ఉంది. అక్కడ కూడా ఎక్కువ వార్డులు ఉన్నాయి. దాంతో అనకాపల్లికి చెందిన సత్యవతికి టికెట్ ఇస్తే ఆ వైపు నుంచి కూడా రాజకీయంగా లాభం చేకూరుతుందని వైసీపీ భావిస్తోంది అంటున్నారు.

మూడు చోట్ల ప్రభావం :

ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో బలమైన సామాజిక వర్గంగా గవరలు ఉన్నారు. వారి ప్రభావం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉంటుంది. అనకాపల్లి, పెందుర్తి, విశాఖ పశ్చిమలో వారి సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. దాంతో గట్టి పోటీ ఇవ్వడానికి వీలు అవుతుందని వైసీపీ లెక్క వేసుకుంటోంది అంటున్నారు. అయితే కూటమి నుంచి మేయర్ అభ్యర్ధిని ప్రకటించాకే వైసీపీ తన వైపు నుంచి ట్రంప్ కార్డుని తీస్తుందని అంటున్నారు. అభ్యర్ధి ఎవరు అయినా బీసీ కార్డుతోనే రంగంలోకి దిగాలన్నది వైసీపీ రాజకీయ వ్యూహంగా ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News