ఏపీ కొత్త సీఎం ఎవరు... బెట్టింగులు ఎన్ని వేల కోట్లో !?

ఇలా ఇంతటి కీలకమైన ప్రశ్న కాబటే దీని మీద బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు.

Update: 2024-05-13 11:59 GMT

ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు. ఇది అత్యంత కీలకమైన ప్రశ్న. రాజకీయ సంచలనం కలిగించే ప్రశ్న. అంతే కాదు అందరికీ ఆసక్తిని పెంచే ప్రశ్న. ఏపీకి సీఎం గా జగన్ రెండవసారి అవుతారా. ఆయన నాయకత్వంలోని వైసీపీ వరసగా రెండవసారి అధికారంలోకి వస్తుందా లేక చంద్రబాబు నాయుడు అయిదేళ్ళ సుదీర్ఘ కాలం తరువాత తన పట్టు పెంచుకుని సత్తా చాటి మరోసారి ఏపీకి సీఎం అవుతారా.

ఇలా ఇంతటి కీలకమైన ప్రశ్న కాబటే దీని మీద బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు. అంతే కాదు ఈ ప్రశ్నకు జవాబు ఎంత బరువో కూడా తెలుసుకోవాలి. ఏపీకి కొత్త సీఎం ఎవరు అన్న దాని మీద వందల వేల కోట్ల రూపాయలతో ఏకంగా భారీ ఎత్తున బెట్టింగులే నడుస్తున్నాయి.

ఏపీకి సీఎంగా జగన్ అంటూ ఒక వైపు అలాగే చంద్రబాబు అని మరొ వైపు బెట్టింగు రాయుళ్ళు మోహరించి కోట్ల రూపాయల బెట్టింగులు కాస్తున్నారు. ఈ మొత్తం బెట్టింగుల విలువ ఏకంగా అయిదు వేల కోట్ల రూపాయలు దాటి ఉంటుందని అంటున్నారు. దీంతో ఈ బెట్టింగులు సరికొత్త రికార్డులనే క్రియేట్ చేస్తున్నాయని అంటున్నారు.

ఏపీలో ఇంతటి హీట్ ని పెంచే ఎన్నిక ఎప్పుడూ జరగలేదు అని అంటున్నారు. అదే విధంగా భీకరమైన పోరుని కూడా ఎవరూ ఎపుడూ చూసి ఉండలేదు. దాంతో ఈసారి అధికారం ఎవరిది అన్నది అతి పెద్ద చర్చగా మారింది. ఎన్ని సర్వేలు వచ్చినా విషయం మాత్రం తెలియడంలెదు. దాంతో ఈసారి ఎవరిది గెలుపు అంటే భారీ ఎత్తున పందేలు కాస్తున్నారు.

తమ రాజకీయ మేధస్సుని ఉపయోగించి ఫలానా పార్టీ గెలుస్తుంది అని ధీమా పడుతూ బెట్టింగులకు సిద్ధపడుతున్నారు. అంతే కాదు వీటితో పాటు కుప్పం, మంగళగిరి, పిఠాపురం, ఉండి, విశాఖపట్నం, విశాఖ విజయవాడ ఎంపీ సీట్ల మీద పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతున్నాయి.

అంతే కాదు కడప ఎంపీ సీటు మీద కూడా బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. అక్కడ ఎంపీగా కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల పోటీలో ఉండగా వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీలో ఉన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు మెజారిటీల మీద యాభై లక్షల దాకా బెట్టింగులు జరుగుతున్నాయి. అలాగే పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న వైఎస్ జగన్ మెజారిటీ మీద కూడా భారీ ఎత్తున పందేలు కాస్తున్నారు.

వీటితో పాటుగా గుడివాడలో కొడాలి నాని గెలుపు అవకాశాల మీద అలాగే, విజయవాడ సెంట్రల్ నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు, టీడీపీ క్యాండిడేట్ బోండా ఉమాలలలో ఎవరు గెలుస్తారు అన్న దాని మీద కూడా పందేలు కాస్తున్నారు

విజయవాడ ఎంపీ సీటుకు సంబంధించి కేశినేని బ్రదర్స్ లో ఎవరి విన్ అవుతారు అన్న దాని మీద పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఈ బెట్టింగులు కట్టే వారిలో ఆక్వా ట్రేడర్స్, వ్యాపారులు ఎన్నారై బిగ్ షాట్స్ ఉన్నారని అంటున్నారు. వీరంతా గోదావరి జిల్లాలలోని భీమవరం, ఉండి, అమలాపురం, నర్సాపురం,కాకినాడ, ఆచంట, తాడేపల్లిగూడెం,తణుకు టెక్కలి, ఆచంట, రాజమంద్రవరం సీట్ల మీద భారీ ఎత్తున పందేలు కాస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఏపీలో సోమవారం పోలింగ్ పూర్తి అయ్యేనాటికి ఇంకా ఎంత పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతాయో భారీ మొత్తాలు ఏ వైపు నుంచి చేతులు మారే అవకాశాలు ఉంటాయో చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News