ట్రంప్ వ్యాఖ్యలను పట్టించుకోని యూఎస్ కంపెనీలు.. వర్చువల్ గా నైనా భారతీయులే కావాలట..
ప్రపంచం ఇప్పుడు స్క్రీన్‌లపై నడుస్తోంది. బ్యాంకింగ్, షాపింగ్, క్లాసులు అన్నీ ఆన్‌లైన్ అవుతుంటే.. ఇప్పుడు హోటల్ రిసెప్షన్ కూడా వర్చువల్‌గా మారింది.;
ఓ వైపు ట్రంప్ ‘అమెరికా నుంచి భారతీయులు వెళ్లిపోవాలి.. అమెరికన్ల ఉద్యోగాలను ఇండియన్స్ చోరీ చేస్తున్నారు..’ వంటి కఠినమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ మరో వైపు ఇండియన్స్ ను వర్చువల్ గా ఉపయోగించుకోవాలని అమెరికన్ కంపెనీలు ఆలోచిస్తున్నాయి. అక్కడ ఉండకున్నా.. ఇక్కడి నుంచి కూడా అక్కడ ఉద్యోగం చేసే అవకాశాలను అక్కడి ఆఫీసులే కల్పిస్తు్న్నాయి. ఇండియన్స్ అంటే మృధు భాషణ కలవారు.. చక్కటి వ్యాఖ్యలు.. మంచి రెస్పాన్స్ ఇచ్చేవారు. వారితో పని చేయించుకోవాలంటే దేశాలు పెట్టి పుట్టాలి. ఇన్నాళ్లు అమెరికా డెవలప్ లో ఇండియన్స్ లేరని అమెరికన్లు గుండెలపై చేయి వేసుకొని చెప్పగలరా.. లేరు.. ఎందుకంటే భారతీయులే అమెరికాను డెవలప్ చేశాయి. దానికి లక్షా 90 కారణాలు.
వర్చువల్ గా ఉపయోగిస్తున్న యూఎస్..
ప్రపంచం ఇప్పుడు స్క్రీన్‌లపై నడుస్తోంది. బ్యాంకింగ్, షాపింగ్, క్లాసులు అన్నీ ఆన్‌లైన్ అవుతుంటే.. ఇప్పుడు హోటల్ రిసెప్షన్ కూడా వర్చువల్‌గా మారింది. అమెరికాలోని మియామిలో ఒక హోటల్‌లో ‘చెక్ ఇన్ & చెక్ అవుట్’ కోసం మనిషి ఎదురుగా ఉండనవసరం లేదు. బదులుగా ఒక పెద్ద స్క్రీన్, దానిపై కనిపిస్తున్నది మరో దేశంలో కూర్చున్న సిబ్బంది. ఈ స్క్రీన్‌పై కనిపిస్తున్న యువకుడు ఒక భారతీయ ఉద్యోగి. అతను అమెరికన్ హోటల్ గెస్టులను వర్చువల్‌గా ఆహ్వానిస్తున్నాడు. ఒక బటన్ నొక్కగానే గెస్ట్ సిస్టమ్‌లో లాగిన్ అవుతాడు.. మరో వైపు కూర్చున్న సిబ్బంది అతని రూమ్ డిటైల్స్, పేమెంట్, కార్డు యాక్సెస్ అన్నీ ఆన్‌లైన్‌లో పూర్తి చేస్తారు. ఇదే ‘వర్చువల్ హాస్పిటాలిటీ’ అనే కొత్త ధోరణి.
సాంకేతికత కొత్త ఆతిథ్యం తెచ్చింది
ఇది కేవలం సాంకేతిక అద్భుతం కాదు.. ఆర్థిక లెక్క కూడా. అమెరికాలో హోటల్ రంగంలో పని చేయాలంటే అధికంగా వేతనం చెల్లించాలి. దీంతో అనేక కంపెనీలు ఇప్పుడు రిమోట్ సిబ్బందిని ఉపయోగిస్తున్నాయి. భారతదేశం, ఫిలిప్పీన్స్, దక్షిణ ఆసియా దేశాల నుంచి శిక్షణ పొందిన సిబ్బంది ఈ వర్చువల్ రిసెప్షన్‌లుగా పనిచేస్తున్నారు. గెస్ట్ మాట్లాడే భాష, బుకింగ్ ప్రాసెస్, కస్టమర్ సపోర్ట్ ఇవన్నీ సాంకేతిక ప్లాట్‌ఫారమ్ ద్వారా జరుగుతాయి. ఈ మోడల్‌తో హోటల్ యజమానులకు మానవ రిసోర్స్ ఖర్చు తగ్గుతుంది, గెస్ట్‌లకు 24 గంటల సపోర్ట్ అందుతుంది. ఒకే సమయంలో అనేక హోటళ్లను మానిటర్ చేయడం కూడా దీనితో సాధ్యం అవుతోంది.
మానవ స్పర్శ తగ్గుతోందా?
ఈ మార్పు సౌలభ్యాన్ని పెంచడం.. వేతనాలను తగ్గించడం లాంటి మేలు చేస్తున్నా.. కీడు కూడా ఉంది.. అదే మానవ సంబంధాలను తగ్గిస్తోంది. రిసెప్షన్ వద్ద ఉన్న స్మైల్, ‘హావ్ ఎ నైస్ డే’ అన్న స్నేహపూర్వక మాట. టచ్‌స్క్రీన్‌పై కనిపించవు. వర్చువల్ రిసెప్షనిస్ట్ వీడియో కాల్‌లో మాట్లాడగలడు. కానీ ఆహ్లాదం పంచలేడు. హాస్పిటాలిటీ రంగం ప్రాణం ‘హ్యూమన్ కనెక్ట్’ అది క్రమంగా మాయమవుతోందన్న ఆందోళన ఉంది. సాంకేతికతతో పనులు వేగంగా జరుగుతున్నా.. మనుషుల మధ్య ఉన్న సంభాషణలు తగ్గుతున్నాయి. కొన్ని హోటల్ అతిథులు ఈ పద్ధతిని స్వాగతిస్తుండగా, మరికొన్ని ‘హోటల్‌లో మనిషి ఎదురుగా ఉండకపోవడం అసహజం’ అంటున్నారు.
మనిషి & యంత్రం మధ్య కొత్త సహకారం
ఇది వృత్తుల మార్పు ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో మరిన్ని రంగాల్లో ‘వర్చువల్ వర్క్‌ఫోర్స్’ సాధారణంగా మారవచ్చు. భారత యువతకు ఇది కొత్త అవకాశాలను తెస్తోంది. మియామి హోటల్‌లో రిసెప్షన్ నిర్వహిస్తున్న సదరు యువకుడు.. తను ఉన్న చోటే అంతర్జాతీయ స్థాయి గెస్ట్‌లతో పని చేస్తున్నాడు. ఇది గర్వకారణం కూడా. అయితే టెక్నాలజీ పెరుగుతున్న వేళ మనిషి పాత్రను పూర్తిగా తొలగించకూడదు. సేవల వెనుక ఉన్న మనసు, ఆతిథ్యంలోని ఆప్యాయత ఇవే హాస్పిటాలిటీ రంగానికి ప్రాణం. యంత్రం మానవుడి సహాయకుడిగా ఉండాలి, ప్రత్యామ్నాయం కాకూడదు.