100 రోజులు తెలంగాణ‌లో సంక్షేమ‌ పండ‌గే!

ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌లు సంక్షేమ కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల‌ను క్షేత్ర‌స్థాయిలో అంద‌రికీ అందించేలా ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను ప్రారం భించ‌నుంది.;

Update: 2026-02-27 07:10 GMT

తెలంగాణ‌లోని కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌లు సంక్షేమ కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల‌ను క్షేత్ర‌స్థాయిలో అంద‌రికీ అందించేలా ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను ప్రారం భించ‌నుంది. మార్చి 2వ తేదీ నుంచి సుమారు 100 రోజులు ఈ వ్య‌వ‌హారంపైనే ప్ర‌భుత్వం ప‌నిచేయ‌నుం ది. దీనిపై చ‌ర్చించేందుకు.. కార్య‌క్ర‌మాలు రూపొందించేందుకు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్ర‌వ‌ర్గ ఉప‌సంఘం కూడా ప‌నిచేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఎందుకు?

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. ప‌లు ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారు. అయితే.. ఇవి క్షేత్ర‌స్థాయిలో నిజ‌మైన ల‌బ్ధిదారుల‌కు అంద‌డం లేద‌న్న వాద‌న ఉంది. ఈ వ్య‌వ‌హారంపై ముఖ్య‌మం త్రి కార్యాల‌యానికి కూడా ఫిర్యాదులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి స‌రైన విధంగా ఇవి చేర‌క‌పోవ‌డం.. ల‌బ్ధిదారుల విష‌యంలో స‌రైన అంచ‌నాకు రాలేని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను చేప‌ట్టి ల‌బ్ధిదారుల‌కు మేలు చేయాల‌న్న‌ది ప్ర‌భుత్వ సంక‌ల్పం.

అంద‌రూ క‌లిసి!

ఈ 100 రోజుల కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌తి ఒక్క‌రూ పాల్గొంటారు. ముఖ్య‌మంత్రి నుంచి మంత్రి వ‌ర‌కు అంద‌రూ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. అంతేకాదు.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నుంచి క్షేత్ర‌స్థాయి సిబ్బంది వ‌ర‌కు కూడా పెద్ద ఎత్తున ఈ కార్య‌క్ర‌మంలో పార్టిసిపేట్ చేయ‌నున్నారు. ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డంతోపాటు.. నిజ‌మైన ల‌బ్ధిదారుల‌కు అన్యాయం జ‌ర‌గ‌కుండా చేసేందుకు ఈ వంద రోజుల కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు.

ఇక‌, ఈ 100 రోజుల కార్య‌క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించనున్నారు. నిజానికి అధికారుల నుంచి క్షేత్ర‌స్థాయి సిబ్బంది వ‌ర‌కు కూడా పెద్ద ఎత్తున సంక్షేమ కార్య‌క్రమాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల‌కు వివ‌రించేలా చేయ‌నున్నారు. ఇటీవ‌ల మునిసిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం ముఖ్య‌మంత్రి క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించిన‌ప్పుడు.. పథ‌కాల ప్ర‌చారంలో లోపాలు ఉన్న‌ట్టుగా గుర్తించారు. దీంతో వెనువెంట‌నే 100 రోజుల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌కు శ్రీకారం చుట్ట‌డం విశేషం.

Tags:    

Similar News