జగన్ మీద బీజేపీ ఎటాక్...అదిరిపోయే సీన్ కదా !

ఏపీలో బీజేపీ రాజకీయ పాత్ర ఎంత ఓట్ల సీట్ల వాటా ఎంత అన్నది ఒక చర్చ. దానిని పక్కన పెడితే ఏపీ రాజకీయాల్లో బీజేపీ అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తోంది అన్నది మాత్రం వాస్తవం;

Update: 2025-12-20 07:30 GMT

ఏపీలో బీజేపీ రాజకీయ పాత్ర ఎంత ఓట్ల సీట్ల వాటా ఎంత అన్నది ఒక చర్చ. దానిని పక్కన పెడితే ఏపీ రాజకీయాల్లో బీజేపీ అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తోంది అన్నది మాత్రం వాస్తవం. అది 2014 నుంచి కొనసాగుతోంది. బీజేపీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఏపీ రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేస్తోంది. ఇక 2014లో టీడీపీ జనసేనతో బీజేపీకి పొత్తు ఉంది. అయినా 2014 నుంచి 2019 మధ్యలో వైసీపీని పెద్దగా ఎటాక్ చేసింది లేదు, వైసీపీ సైతం బీజేపీని పల్లెత్తు మాట అన్నదీ లేదు. ఇది ఒక రాజకీయ చిత్రంగా సాగింది. అలా చూస్తే మూడు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నా కూడా బీజేపీదే కీ రోల్ అన్నది అర్ధం అవుతోంది అని చెబుతారు.

వైసీపీ రాజ్యంలో :

ఇక 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ రాజ్యం ఏపీలో సాగింది. ఆ సమయంలో కూడా ఎంతో దోస్తులుగా ఈ రెండు పార్టీలు ఉన్నాయని ప్రచారం అయితే సాగింది. 2024లో కూటమితో కలిసి బీజేపీ తిరిగి పొత్తు పెట్టుకుని గెలిచించి. ఇపుడు ఏపీలో ఎన్ డీయే ఉంది, కేంద్రంలో ఎన్డీయే ఉంది. ఈ రెండు ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కార్ గా కూడా చెప్పుకుంటున్నారు. అయినా సీన్ అయితే ఏపీలో పెద్దగా మారింది లేదని అంటున్నారు. ఏపీలో వైసీపీని టీడీపీ జనసేన ఎక్కువగా విమర్శిస్తూంటాయి. కానీ బీజేపీ నుంచి అయితే పెద్దగా విమర్శలు అయితే రావడం లేదని ఒక చర్చ అయితే ఉంది.

మోడీ చెప్పారంటూ :

ఈ క్రమంలో తాజాగా చూస్తే కనుక ఢిల్లీలో జరిగిన ఏపీ బీజేపీ ఎంపీల మీట్ లో సాక్షాత్తూ ప్రధాని మోడీ కూడా దిశా నిర్దేశం చేశారు అన్న మాట బయటకు వచ్చింది. ఏపీలో వైసీపీ మీద ఎటాక్ స్టార్ట్ చేయమని కోరారని కూడా చెప్పుకున్నారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం తో పాటు బయట కూడా వైసీపీ మీద విమర్శలు చేయాలని సూచించారు అని కూడా చెప్పుకున్నారు. మరి ఈ ప్రచారం జరిగినా కూడా ఏపీ నుంచి అయితే ఏ బీజేపీ నేత కూడా వైసీపీ మీద విమర్శలు అయితే చేసింది లేదని అంటున్నారు.

నాడూ నేడూ ఆయనే :

ఇక జగన్ మీద విమర్శలు చేయాలి అంటే నాడూ నేడూ బీజేపీలో ఒక ఒక్క ఫైర్ బ్రాండ్ లీడర్ గా సత్యకుమార్ యాదవ్ ని చెబుతారు. ఆయన పార్టీ నేతగా ఉన్నపుడు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు తీవ్రమైన విమర్శలు చేశారు. ఇపుడు చూస్తే ఆయన కూటమిలో మంత్రిగా ఉన్నారు. దాంతో ఇపుడు కూడా ఆయన పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ధాటీగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా చూస్తే కనుక ఆయన జగన్ కి బిగ్ సవాల్ నే చేశారు. మెడికల్ కాలేజీల ఇష్యూలో నన్ను ముందు అరెస్ట్ చేసి జైలులో వేయించగలవా జగన్ అంటూ చాలెంజ్ చేస్తూ మాట్లాడారు. పీపీపీ మోడల్ అన్నది చాలా మంచిది అంటూ కూడా ఆయన గట్టిగానే వాదించారు.

వైసీపీ ఫేవర్స్ ఎవరూ లేరని :

మరి బీజేపీలో అయితే ఆయన స్థాయిలో ఇతర నాయకులు ఎందుకు రెస్పాండ్ అవడం లేదు అన్నది చర్చగా ఉంది. అయితే ఏపీలో వైసీపీ ఫేవర్స్ ఎవరూ లేరని అంటున్నారు. కానీ ఎవరి ఆలోచనలు వారివని, అలాగే పదవులు రాని వారు కొందరు ఉంటే వచ్చినా సరైన ప్లేస్ మెంట్ లేదని ఆలోచించేవారు మరి కొందరు అని, ఇంకొందరు అయితే తమ పార్టీ ప్రభుత్వంలో జూనియర్ పార్టనర్ కదా తాము ఎందుకు అన్నింటికీ ముందుడి మాట్లాడాలన్న నిర్లిప్తత లో ఉంటున్నారు అని అంటున్నారు. మొత్తం మీద ఏపీ బీజేపీ నేతల ఈ వైఖరి కారణంగా బీజేపీకి వైసీపీకి మధ్యలో ఏదో ఉందన్న ప్రచారానికి మాత్రం బలం చేకూరుతోంది అని అంటున్నారు.

Tags:    

Similar News