బీహార్ లో కూడా బుల్డోజర్ దిగుతుందా ?

అయితే ఈ పరిణామం మీద అగ్గి రాజేసి ఎన్డీయే కూటమిలో చిచ్చు పెట్టేందుకు విపక్షం అపుడే చూస్తోంది అని అంటున్నారు.;

Update: 2025-11-23 03:43 GMT

బీహార్ లో నితీష్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తాజాగా కొలువు తీరింది. ఈ ప్రభుత్వంలో కీలకమైన హోం శాఖను నితీష్ కుమార్ వదులుకుని బీజేపీకి చెందిన ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి అప్పగించారు. దీంతో ఇపుడు ఇదే అంశం మీద బీహార్ రాజకీయం హీటెక్కుతోంది నితీష్ ని డమ్మీ చేయడానికి బీజేపీ చూస్తోంది అని కాంగ్రెస్ ఆర్జేడీ అపుడే కామెంట్స్ మొదలెట్టాయి. అంతే కాదు నితీష్ కుమార్ ని సొంత ప్రభుత్వంలోనే క్రియాశీలకంగా లేకుండా చేసే ప్రయత్నం ఇది అని కూడా చెబుతున్నారు.

పవర్ ఫుల్ గానే :

నిజానికి చూస్తే సామ్రాట్ చౌదరి ఈసారి సీఎం కావాల్సిన వారు అని చెబుతున్నారు. ఆయన గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరోసారి ఎన్డీయే సర్కార్ వస్తే కనుక సామ్రాట్ చౌదరిని సీఎం గా చేస్తారు అని కూడా ప్రచారం సాగింది. కానీ బీజేపీ పెద్దలు జాతీయ రాజకీయాలను అలాగే వచ్చే ఏడాది జరిగే మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నితీష్ కుమార్ ని కదపకుండా అదే పదవిని అప్పగించారు. నితీష్ సైతం ముఖ్యమంత్రిగానే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఆయన కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ ఉత్సాహంలో ఆయన రెండు దశాబ్దాలుగా తాను చూస్తున్న హోంశాఖని బీజేపీకి అప్పగించారు.

తప్పేముందన్న జేడీయూ నేతలు :

అయితే ఈ పరిణామం మీద అగ్గి రాజేసి ఎన్డీయే కూటమిలో చిచ్చు పెట్టేందుకు విపక్షం అపుడే చూస్తోంది అని అంటున్నారు. అనుభవం కలిగిన నేతగా ఉన్న సామ్రాట్ చౌదరికి హోం శాఖను ఇస్తే తప్పేంటి అని జేడీయూ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని అంతా ఒక్కటే అని వారు అంటున్నారు. అయితే ఇది జేడీయూని అణిచివేసేందుకే అని విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. అంతే కాదు ఏకంగా బీహార్ ని కేంద్రం తన కనుసన్నలలో నడుపుతుందని కూడా కాంగ్రెస్ ఆర్జేడీ నేతలు ఆరోపిస్తున్నారు.

పాలన ఆయనదే :

పేరుగే నితీష్ కుమార్ సీఎం అని పాలన అంతా సామ్రాట్ చౌదరి చూస్తారని కూడా కాంగ్రెస్ ఆర్జేడీ విమర్శలు గుప్పిస్తున్నారు. హోం శాఖ పవర్ ఫుల్ అని అందుకే సామ్రాట్ చౌదరి పాలన చేస్తారు అని అంటున్నారు. కేవలం సీటు మాత్రమే నితీష్ ది తప్ప మిగిలినది అంతా బీజేపీదే అని కూడా వారు సెటైర్లు వేస్తున్నారు. జేడీయూ ఇక మీదట వీక్ కావడం ఖాయమని జోస్యం చెబుతున్నారు.

బుల్డోజర్ పాలన :

ఇదిలా ఉంటే యూపీలో బీజేపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాలిస్తున్నారు. ఆయన బుల్డొజర్ ని దింపి మరీ నేరాలను అదుపు చేస్తున్నారు. బీహార్ లో కూడా లా అండ్ ఆర్డర్ మరింత కఠినంగా అమలు చేయాల్సి ఉందని జనాల నుంచి వినిపిస్తున్న మాట ఈ నేపథ్యంలో బీజేపీ చేతిలో హోం శాఖ ఉంది కాబట్టి బీహార్ లో సైతం బుల్డోజర్ పాలన వస్తే బాగుంటుందని కొందరు అంటూంటే అది ప్రత్యర్ధుల మీదకే ప్రయోగిస్తారని మరి కొందరు అంటున్నారు. ఏది ఏమైనా రెండు పెద్ద రాష్ట్రాలు హిందీ బెల్ట్ లో ఉన్నాయి. యూపీలో యోగీ మాదిరిగా బీహార్ లో లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ లో పెట్టడానికి బీజేపీ హోం శాఖ తీసుకుందా అన్న చర్చకు అయితే తెర లేస్తోంది.

Tags:    

Similar News