రోబోలు మేలే కాదు ప్రమాదం కూడా? వీడియో చూస్తే హడల్!

సైన్స్ ఫిక్షన్ 'టెర్మినేటర్' సినిమా దృశ్యాలను తలపిస్తున్న ఈ వీడియో చూసిన వారంతా భయంతో హడలిపోతున్నారు.

Update: 2026-09-03 10:38 GMT

సాంకేతికత ఎంత వేగంగా పెరుగుతుందో, అశాంతి కూడా అంతే పెరుగుతోంది. రష్యాలోని ఒక ఎలక్ట్రానిక్స్ షోరూంలో మానవరూపం లో వున్నా రోబో (హ్యూమనాయిడ్) ఒక వినియోగదారుడిపై దాడి చేయడానికి ప్రయత్నించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ 'టెర్మినేటర్' సినిమా దృశ్యాలను తలపిస్తున్న ఈ వీడియో చూసిన వారంతా భయంతో హడలిపోతున్నారు. భవిష్యత్తులో సాంకేతికత పెరిగి రోబోలు మనుషులపై తిరగబడితే పరిస్థితి ఏంటనే తీవ్రమైన చర్చకు ఇది దారితీసింది.

రష్యా షోరూంలో అసలేం జరిగింది?:

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక ఎలక్ట్రానిక్స్ దుకాణంలో వ్యక్తి రోబో వద్దకు వెళ్లి దానిని చేతులతో నెట్టాడు. ఆ వెంటనే ఆ రోబో కోపంతో రగిలిపోయినట్లు తన కాలును కదిలించి ఆ వ్యక్తిని తన్నడానికి ముందుకు వాచినట్టు అనిపించింది ..అక్కడున్న వారంతా ఏం జరుగుతుందో అర్థం కాక ఆశ్చర్యపోయారు. ఆ యంత్రం కదలికలు మరింత వింతగా మారడంతో, ఫైటింగ్ కు దారి తీసినట్టు అనిపించి చివరకు దాని పవర్ ఆఫ్ చేసి స్విచ్ఛాఫ్ చేయాల్సి వచ్చింది.

హాలీవుడ్ 'టెర్మినేటర్' సీన్ గుర్తుకొస్తోంది:

ఈ సంఘటన చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మనుషులకు లాగే రోబోలకు కూడా ఆత్మాభిమానం ఉంటుందని, మితిమీరి కెలికితే ఇలాగే ఎదురుదాడి చేస్తాయని కామెంట్లు చేస్తున్నారు. "మనిషి అహంకారం చివరకు యంత్రాలకు కూడా కోపం తెప్పించింది" అని ఒకరు రాస్తే, భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోయి యంత్రాలు మనుషులపై ప్రతీకారం తీర్చుకుంటాయేమోనని మరికొందరు భయం వ్యక్తం చేస్తున్నారు.

నిజమైన కోపమా.. వెనుక ఏమైనా రిమోట్ ఉందా?:

ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తున్నప్పటికీ, దీని విశ్వసనీయతపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ రోబో నిజంగానే తన సొంత ఆలోచనతో ఆ వ్యక్తిపైకి దాడికి దిగిందా? లేక వెనుక నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ ద్వారా దానిని ఆపరేట్ చేస్తూ నాటకమాడారా? అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా, ప్రచారంలో ఉన్న ఈ దృశ్యాలు మాత్రం వీక్షకులను తీవ్రంగా ఆలోచింపజేస్తున్నాయి.

మానవాళికి రోబోల వల్ల భవిష్యత్తులో ప్రమాదమా?:

ఇటీవలి కాలంలో ఏఐ ఆధారిత రోబోల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఇల్లు, ఆఫీసుల నుంచి వైద్య రంగం వరకు రోబోలు మన జీవితంలో భాగమవుతున్నాయి. అయితే, మానవ నియంత్రణ తప్పి యంత్రాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తే, అది మానవాళి మనుగడకే పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉందని సాంకేతిక నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.

సాంకేతికత అనేది మన అవసరాలకు, సౌకర్యాలకు సహాయపడే ఒక సాధనంగా మాత్రమే ఉండాలి. కానీ అది మనుషులపైనే ఆధిపత్యం చెలాయించే స్థాయికి చేరితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ఇక రష్యా ఘటన నిజమైనా లేక పబ్లిసిటీ స్టంట్ అయినా.. భవిష్యత్తులో యంత్రాల పట్ల మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో చెప్పడానికి ఇదొక హెచ్చరిక లాంటిదే.



Tags:    

Similar News