800 డాలర్ల షేర్స్ ఈరోజు 300 బిలియన్లు.. లాస్ అయిన రోనాల్డ్ వెయిన్ కథ

స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ పేర్లు చరిత్రలో నిలిచిపోయాయి. కానీ ఈ విజయం వెనుక పెద్దగా తెలియని, అత్యంత బాధాకరమైన త్యాగం చేసిన మూడో సహ వ్యవస్థాపకుడు రోనాల్డ్ వెయిన్ కథ చాలా మందికి తెలియదు.;

Update: 2025-05-21 05:40 GMT

ప్రపంచంలోని అత్యంత విలువైన టెక్ దిగ్గజాలలో ఒకటైన ఆపిల్ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ పేర్లు చరిత్రలో నిలిచిపోయాయి. కానీ ఈ విజయం వెనుక పెద్దగా తెలియని, అత్యంత బాధాకరమైన త్యాగం చేసిన మూడో సహ వ్యవస్థాపకుడు రోనాల్డ్ వెయిన్ కథ చాలా మందికి తెలియదు. కేవలం 800 డాలర్లకు తన వాటాను వదులుకున్న ఆయన, ఈరోజు 300 బిలియన్ డాలర్ల విలువైన సంపదను కోల్పోయారు. ఆ ఆసక్తికరమైన కథేంటో చూద్దాం.

- ఆపిల్ ఆవిర్భావం

ఏప్రిల్ 1, 1976న స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్, , రోనాల్డ్ వెయిన్ కలిసి "Apple Computer, Inc." అనే పేరుతో ఆపిల్‌ కంపెనీని స్థాపించారు. కేవలం ఇద్దరు యువకుల కలలను నిజం చేయడానికి, వారికి వ్యాపారపరమైన మార్గదర్శకత్వం అవసరమైంది. అక్కడ రంగంలోకి దిగారు రోనాల్డ్ వెయిన్.

- రోనాల్డ్ వెయిన్ ఎవరు?

1934లో జన్మించిన రోనాల్డ్ వెయిన్, జాబ్స్, వోజ్నియాక్ కంటే సుమారు 21 ఏళ్లు పెద్దవారు. ఆయనకు వ్యాపార అనుభవం ఉంది. ఆయనే ఆపిల్ మొదటి లోగోను డిజైన్ చేసింది ఈయనే.., Apple I యూజర్ మాన్యువల్‌ను రూపొందించారు. అంతేకాదు, కంపెనీ ప్రారంభ భాగస్వామ్య ఒప్పందాన్ని కూడా స్వయంగా రాసింది ఆయనే. ఆపిల్‌లో ఆయనకు 10% వాటా ఉండేది.

-ఎందుకు వదులుకున్నారు?

ఆపిల్ స్థాపించిన సరిగ్గా 12 రోజులకే రోనాల్డ్ వెయిన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన 10% వాటాను కేవలం 800 డాలర్లకు విక్రయించారు. భవిష్యత్తులో ఎలాంటి హక్కులు లేకుండా చేయడానికి ఆయనకు అదనంగా 1,500 డాలర్లు చెల్లించారు. ఈ నిర్ణయం వెనుక బలమైన కారణాలున్నాయి. అంతకుముందు ఆయన ఒక వ్యాపారంలో నష్టపోయి, ఆ భయాన్ని ఎదుర్కోలేకపోయారు. జాబ్స్, వోజ్నియాక్ ఎలాంటి ఆస్తులు లేకుండా రిస్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, వెయిన్‌కు ఆస్తులు ఉన్నాయి. కంపెనీ నష్టపోతే, బాధ్యత తన మీదే పడుతుందని ఆయన భయపడ్డారు. భవిష్యత్తులో ఆపిల్ ఎంత పెద్ద విజయం సాధించినా, ఆ నష్టభయాన్ని తీసుకోలేక ఆయన వెనకడుగు వేశారు.

- ఈరోజు దాని విలువ ఎంత ఉండేది?

రోనాల్డ్ వెయిన్ వదులుకున్న ఆ 10% వాటా విలువ ఈరోజు కనీసం 200 నుంచి 300 బిలియన్ డాలర్లు ఉండేది! ప్రపంచ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన స్టార్టప్ తప్పిదాలలో ఒకటిగా నిలిచింది.

- ఆపిల్ IPO

డిసెంబర్ 12, 1980న ఆపిల్ తన IPO చేసింది. ఒక్కో షేర్ ధర 22 డాలర్లు. 4.6 మిలియన్ షేర్లను విక్రయించి 100 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఆ సమయంలో సుమారు 300 మంది ఉద్యోగులు క్షణాల్లో కోటీశ్వరులు అయ్యారు. రోనాల్డ్ వెయిన్ కనుక తన వాటాను అట్టిపెట్టుకుని ఉంటే, వారిలో మొదటి స్థానంలో ఉండేవాడేమో!

రోనాల్డ్ వెయిన్ పేరును ఎక్కువమంది గుర్తుంచుకోకపోవచ్చు. కానీ, ఆయన లేకపోతే ఆపిల్ అనే దిగ్గజం ఈ రూపంలో ఉండేది కాదేమో! కొన్ని నిర్ణయాలు జీవితాన్ని మార్చివేస్తాయి. 800 డాలర్లకు వదులుకున్న వాటా, వందల బిలియన్ల డాలర్ల విలువ దాటిందంటే, అదృష్టం, దూరదృష్టి ఎంత విలువైనవో చెప్పనక్కర్లేదు.

పాటు పడేవాళ్లే కాదు, సరైన నిర్ణయాలు తీసుకుని ఓపికగా పాటించేవాళ్లు కూడా విజయాన్ని చూస్తారు. రోనాల్డ్ వెయిన్ కథ ఒక గుణపాఠం, ఒక అపురూప జీవిత చరిత్ర.

Tags:    

Similar News