మొబైల్ యూజర్స్ ఈ ఫార్ములా పాటించకుంటే మీకు మూడినట్లే

నియంత్రణ కోసం నిపుణులు 20-20-20 అనే ఫార్ములాను పాటించమని చెబుతున్నారు నిపుణులు.. ఇది కాస్త ఉపశమన కలిగించేదే తప్ప శాశ్వత పరిష్కారమైతే కాదు.;

Update: 2025-09-10 06:13 GMT

మొబైల్ ఫోన్ ప్రస్తుతం ఇది ప్రతి ఒక్కరికి అత్యవసర వస్తువుగా మారిపోయింది. మొబైల్ వినియోగించే యువతీయువకులతో పాటు పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత ఖరీదైన ఫోన్ ఉంటే అంత స్టేటస్ ఎక్కువనే భావనలో ఉన్నారు. తెల్లారి నిద్రలేవడము మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్ తోనే పూర్తవుతుంది. ఉదయం లేస్తూనే స్క్రీన్ ఆన్ చేయడం, రాత్రి పడుకునే వరకూ రీల్స్ స్క్రోల్ చేయడం ఒక వ్యసనంగా మారిపోయింది. టెక్నాలజీ అందించిన ఈ సౌకర్యం ఒకవైపు వినోదాన్ని ఇచ్చినా, మరోవైపు ఆరోగ్యానికి, సామాజిక జీవనానికి ముప్పు తెస్తోందని వైద్యులు, మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్యంపై ప్రభావం

గంటల తరబడి రీల్స్, షార్ట్స్ చూడటం వలన కంటి చూపుపై తీవ్రమైన ప్రభావం పడుతోందని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. కళ్లు పొడిబారడం, తలనొప్పులు, అస్పష్ట దృష్టి, మయోపియా లాంటి సమస్యలు చిన్న వయస్సులోనే ఎక్కువవుతున్నాయి. పెద్దల్లోనూ బ్లూ లైట్ కారణంగా నిద్రలేమి, మైగ్రేన్ వంటి సమస్యలు విస్తరిస్తున్నాయి. శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా దీని ప్రభావం తీవ్రమే. నిరంతరం వర్చువల్ ప్రపంచంలో మునిగిపోవడం వాస్తవిక సంబంధాలను దెబ్బతీస్తోంది.

సమాజంపైనా ప్రభావం

వినోదం కోసం రూపుదిద్దుకున్న ఈ చిన్న వీడియోలు, సమాజపు విలువలను సైతం మెల్లగా మింగేస్తున్నాయి. చదువు, వృత్తి, కుటుంబ బంధాలు అన్నీ తరువాత స్థానాల్లోకి వెళ్ళిపోతున్నాయి. పిల్లలలో క్రీడా ఆసక్తి తగ్గిపోవడం, పుస్తకాలపై దృష్టి తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశాలు. ఈ అలవాటు భవిష్యత్ తరాన్ని బలహీనంగా మార్చే అవకాశముంది.

చిన్న సూత్రం-పరిష్కార మార్గం

నియంత్రణ కోసం నిపుణులు 20-20-20 అనే ఫార్ములాను పాటించమని చెబుతున్నారు నిపుణులు.. ఇది కాస్త ఉపశమన కలిగించేదే తప్ప శాశ్వత పరిష్కారమైతే కాదు. ప్రతి 20 నిమిషాలకోసారి స్క్రీన్‌ నుంచి దృష్టి తిప్పి, కళ్లకు విశ్రాంతి ఇవ్వడం ప్రయోజనాన్ని చేకూర్చుతుంది. కానీ దీనితో పాటు డిజిటల్‌ పరిధి విధించుకోవడం, సమయపాలన పాటించడం తప్పనిసరి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల స్క్రీన్ టైమ్‌ను గమనించి, వారిని వాస్తవిక ప్రపంచంలోనూ చురుకుగా పాల్గొనేటట్లు ప్రోత్సహించాలి.

నియంత్రణ ఆరోగ్యానికే కాదు...

టెక్నాలజీని నిరాకరించడం సాధ్యం కాదు. కానీ దానిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవడం అత్యవసరం. వినోదం కోసం మొదలైన అలవాటు, ఆరోగ్యాన్ని, జీవన విలువలను కూల్చివేయకూడదు. రీల్స్ చూసే అలవాటును నియంత్రించడం ఒక్క వ్యక్తి ఆరోగ్యానికే కాదు, మొత్తం సమాజ భవిష్యత్తుకీ అవసరం.

స్నేహమే తప్ప.. వ్యసనం వద్దు..

మనం ఇప్పుడు తీసుకునే జాగ్రత్తలు రేపటి తరానికి దారితీస్తాయి. టెక్నాలజీతో స్నేహంగా మెలగడమే తప్ప.. వ్యసనంగా మారకూడదు. చేసుకోవడమే నిజమైన జ్ఞానం.

Tags:    

Similar News