ఆ మాజీ ప్రధాని మనవడి జీవితం.. పొలిటీషియన్లకు ఓ హెచ్చరిక

ఎంత పెద్ద రాజకీయ నేత అయినా తప్పు చేసి దొరికిపోతే చిప్పకూడు తప్పదు అని చెప్పడానికి ఈ పొలిటిటిషన్ ఒక ఉదాహరణ.;

Update: 2025-09-08 09:30 GMT

ఎంత పెద్ద రాజకీయ నేత అయినా తప్పు చేసి దొరికిపోతే చిప్పకూడు తప్పదు అని చెప్పడానికి ఈ పొలిటిటిషన్ ఒక ఉదాహరణ. వివిధ స్కామ్ లలో కూరుకుపోయిన ఎంతో మంది రాజకీయ నేతల జీవితాలు తలకిందులయ్యాయి. అలాంటి వారు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. అయితే కేసులు నిర్ధారణ అయ్యి జైలు జీవితం గడిపిన వారు మాత్రం చాలా తక్కువ మందే. అలా కేసు నిర్ధారణ అయ్యి జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ మాజీ ఎమ్మెల్య పరిస్థితి ఎంత దారుణంగా ఈ సంఘటనే ఉదాహరణ.

లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని మనవడు..

దేశ రాజకీయాల్లో పేరొందిన మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ మనవడు, ప్రజ్వల్ దేవెగౌడ. 2019లో కర్ణాటక హాసన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రజ్వల్, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇంటి పని మనిషిని బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. వ్యక్తిగత సాక్ష్యాలు, వీడియో రికార్డులు బయటకు రావడంతో దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది.

వేగంగా విచారణ.. శిక్ష

కర్ణాటక ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా తీవ్రవంగా పరిగణించి విచారణను ప్రారంభించింది. అంతేకాదు, ఈ కేసు సంచలనాత్మకంగా పబ్లిక్ డోమెన్లోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ వర్గాల్లో, సామాన్య ప్రజల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. విచారణ ప్రక్రియలో ప్రజ్వల్ అఘాయిత్యాన్ని నిరూపించే ఆధారాలు కోర్టుకు చేరాయి. దీంతో కోర్టు ప్రజ్వల్‌కు జీవిత ఖైదు విధించింది.

లైబ్రరీ నిర్వహణ బాధ్యతలు

ప్రస్తుతం ప్రజ్వల్ పరప్పణ అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అతని శిక్షలో భాగంగా జైలు నిబంధనల మేరకు రోజు వారీ పని అప్పగించారు. ప్రత్యేకంగా వారానికి మూడు రోజులపాటు ప్రజ్వల్‌ క్లర్క్‌గా పని చేయాలని జైలు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జైలులో పెద్ద లైబ్రరీ నిర్వహణ బాధ్యతలు ప్రజ్వల్ కు అప్పగించారు. జైల్లో ఖైదీలకు కావలసిన పుస్తకాలను సమకూర్చడం, వాటిని వారి వివరాలతో నమోదు చేయడం, పుస్తకాలను తిరిగి అందుకున్న వివరాలు కూడా నమోదు చేయడం రోజు వారి విధి. అదేవిధంగా, పుస్తకాలను సక్రమంగా నిల్వ చేయడం, పుస్తకాల జాగ్రత్తగా కాపాడడం, పనులు కూడా రోజు వారీ బాధ్యతలు. క్లర్క్ బాధ్యతలు నిర్వర్తించినందుకు గాను రూ.522 వేతనంగా నిర్ణయించారు. ఇది నేరుగా అతని ఖాతాకు జమఅవుతుంది. దేశంలో ప్రముఖ రాజకీయ వంశానికి చెందిన వారసుడు ఇలా ఇప్పుడు నిర్బంధ జీవితంలో సాధారణ జైలు పనులు నిర్వహిస్తున్న పరిస్థితి ఎంతో విచారకరం.

రాజకీయ నేతలకు హెచ్చరిక.

ఈ సంఘటన దేశంలోని రాజకీయ నాయకులను హెచ్చరిస్తున్నది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యుల నైతిక బాధ్యతలు, సామాజిక బాధ్యతలను గుర్తు చేస్తున్నది. ప్రజ్వల్ దేవెగౌడకు పడిన ఈ శిక్ష, ఇతర రాజకీయ నాయకులకు ఓ హెచ్చరిక లాంటిదే.

Tags:    

Similar News