రాపిడ్ ఫైర్ విత్ పవన్... తెరపైకి ఆసక్తికర విషయాలు!

సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో పవన్ కల్యాణ్ రాజకీయంగా ఫుల్ బిజీ అయిపోయారు

Update: 2024-05-02 03:50 GMT

సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో పవన్ కల్యాణ్ రాజకీయంగా ఫుల్ బిజీ అయిపోయారు. కూటమి అభ్యర్థిగా పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న జనసేన అధినేత.. ప్రచారాలతో హోరెత్తించేస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ సమయంలో... ఒక జాతీయ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ఇంట్రస్టింగ్ విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రాపిడ్ ఫైర్ ని ఎదుర్కొన్నారు!

అవును... ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి, అసెంబ్లీలో తన వాయిస్ వినిపించాలని బలంగా భావిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అందుకు పిఠాపురమే అనుకూలమైనదని ఎంపిక చేసుకున్నారు! నామినేషన్స్ పర్వం కూడా ముగియడం, పోలింగ్ తేదీకి మరో 10 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తున్నారు. ఈ సమయంలో ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ గతంలో వెల్లడించని విషయాలను తెలిపారు!

ఇందులో భాగంగా... తనకు నచ్చిన రాజకీయ నాయకుడు, సినిమా హీరో ఎవరు అనే విషయాలను పవన్ వెల్లడించారు. వాస్తవానికి మొదటి నుంచి పవన్ ఫేవరేట్ హీరో చిరంజీవి అని అందరికి తెలుసు. అయితే.. తన అన్న చిరంజీవి కన్నా పవన్ కు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఆయనకు తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా బిగ్ బీ సినిమాలోని ఒక పాటను పవన్ హమ్ చేసి వినిపించారు. ఇదే క్రమంలో... రాజకీయాల్లో మీ మోడల్ ఎవరు అంటే.. స్పందించిన పవన్.. నానాభోయ్ నాని అర్దేషిర్ పాల్ఖివాలా.. జయప్రకాశ్ నారాయణ్ అని చెప్పుకొచ్చారు. మరి.. నందమూరి తారకరామారావు ఇష్టం లేదా అంటే.. ఆయన అంటే తనకెంతో గౌరవమని, రెండు తెలుగు రాష్ట్రాలు ఆయను గౌరవిస్తాయని అన్నారు.

Read more!

ఇక ఈ సమయంలో మీరు ఒక సినిమా చూడాలంటే ఏది చూస్తారు అంటే.. హర్రర్ సినిమా అని చెప్పిన పవన్.. అవి తన మైండ్ ను కొంచెం కామ్ చేస్తాయని వెల్లడించారు. ఇదే సమయంలో... బయట దెయ్యాలను చూసి భయపడకుండా ముందు సినిమాల్లోని దెయ్యాలతో ప్రాక్టీస్ చేస్తానని సరదాగా చెప్పుకొచ్చాడు! ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Tags:    

Similar News