కాక్రోచ్ జనతా పార్టీకి బీజేపీ ఫస్ట్ వార్నింగ్! విదేశీ కుట్రలపై నితిన్ నబిన్ నిప్పులు.. అసలేం జరుగుతోంది?

భారత రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్.

Update: 2026-06-07 13:00 GMT

భారత రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా జార్ఖండ్‌లో పర్యటిస్తున్న ఆయన, రాంచీలో జరిగిన మేధావుల సదస్సులో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. విపక్షాలను, దేశ వ్యతిరేక శక్తులను ఉద్దేశించి ఆయన ఉచ్ఛరించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అనే పదం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

యువతపై విదేశీ శక్తుల కన్ను

రాంచీ వేదికగా నితిన్ నబిన్ దేశ యువతను అలర్ట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. ‘దేశానికి లభించిన అతిపెద్ద బలం ఇక్కడి యువశక్తి. కానీ, కొందరు విదేశాల్లో కూర్చుని డిజిటల్ మాధ్యమాల ద్వారా మన యువతను బ్రెయిన్ వాష్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి తలల్లోకి దేశ వ్యతిరేక భావజాలాన్ని నూరిపోస్తూ, ప్రతికూల రాజకీయాల వైపు మళ్లించేందుకు కుట్రలు పన్నుతున్నారు’ అని నబిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే భారత యువత అంత అమాయకులేం కాదని, తమ భవిష్యత్తును తామే నిర్మించుకునే దిశగా సానుకూల రాజకీయాల వైపే మొగ్గు చూపుతారని ఆయన స్పష్టం చేశారు. యువత ఎవరి చేతుల్లోనూ చెప్పుచేతల్లో ఉండే బొమ్మలు కాదని హెచ్చరిస్తూ, విదేశీ శక్తుల కుట్రలను ప్రజాస్వామ్యబద్ధంగానే తిప్పికొడతామని తేల్చి చెప్పారు.

రైతులకు రెట్టింపు భరోసా

కేవలం రాజకీయాలే కాకుండా దేశాభివృద్ధిలో రైతుల పాత్రను నబిన్ ప్రత్యేకంగా కొనియాడారు. రైతు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అన్నదాతలను కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా చూడటం మా పద్ధతి కాదు. వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడమే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెబుతూ వ్యవసాయ రంగానికి బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యతను పునరుద్ఘాటించారు.

Tags:    

Similar News