అంతా తల రాత అంటున్న డీకే...మ్యాటర్ ఏంటో ?
కర్ణాటకలో సీఎం సీటు కోసం కుర్చీలాట మొదలైందా అంటే అది చాలా పాత వార్త కదా అని అనుకునేరు.;
కర్ణాటకలో సీఎం సీటు కోసం కుర్చీలాట మొదలైందా అంటే అది చాలా పాత వార్త కదా అని అనుకునేరు. ఇది ఎప్పటికీ కొత్త వార్తే. ఎందుకు అంటే రాజకీయం అలాంటిది మరి. కర్ణాటకలో సీఎం సీటుని చెరి రెండున్నరేళ్ళ పాటు ఇద్దరు అగ్ర నాయకులు పంచుకోవాలని హై కమాండ్ 2023 ఎన్నికల తర్వాత ఒక సర్దుబాటు చేసింది అన్నది ప్రచారంలో ఉన్న మాట. ఆ విధంగా డీకే శివకుమార్ తగ్గి సిద్ధ రామయ్యకు సీఎం రాజయోగానికి మార్గాన్ని సుగమం చెశారు. అయితే అలా అనుకున్న అనధికార గడువు రెండున్నరేళ్ళు అక్టోబర్ తో పూర్తి అవుతుంది అని అంటున్నారు. దాంతో అనేక రకాలైన పొలిటికల్ స్పెక్యులేషన్స్ చాలా స్పీడ్ గా దీని మీద సర్క్యులేట్ అవున్నాయి.
సిద్ధ రామయ్య ఫుల్ టెర్మ్ :
రాజకీయంగా ఎన్నో ఢక్కా మెక్కీలు తిన్న నాయకుడు సిద్ధ రామయ్య. ఆయన దాదాపుగా ఎనిమిది పదుల వయసు చేరువలో ఉన్నారు. ఆయన 2013 నుంచి 2018 మధ్య పూర్తి కాలం కర్ణాటక సీఎం గా ఉన్నారు. తిరిగి 2023లో మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఈసారి కూడా ఆయనే పూర్తి కాలం సీఎం అయి ఆయన అనుచరులు అంటున్నారు. ఇందులో ఎలాంటి డౌట్లూ అవసరం లేదని కూడా చెబుతున్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన సిద్ధ రామయ్య రాజకీయంగా పాలనా పరంగా అనుభవం ఉన్న నాయకుడు.
కాచుకున్న కమలం :
పైగా కర్ణాటక రాజకీయం చూస్తే బీజేపీ కి ఏ విధంగానూ చాన్స్ ఇవ్వకూడదని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు అక్కడ బీజేపీ జేడీఎస్ పొత్తులో ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కలిస్తే కూడా బలం సరిపోదు కానీ కాంగ్రెస్ లో ఏమైనా కదలిక వచ్చిన మార్పు చేర్పులు భారీ స్థాయిలో అగ్ర పీఠం దిశగా సాగినా కూడా ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు అని అంటున్నారు. అటువంటపుడు దానికి పొలిటికల్ అడ్వాంటేజ్ గా తీసుకోవడానికి కమలం పార్టీ కాచుకుని కూర్చుంది. అందుకే కాంగ్రెస్ హై కమాండ్ ఈ విషయంలో ఏ మాత్రం తొందర పడటం లేదు అని అంటున్నారు. ఈ రకమైన రాజకీయ సమీకరణలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్న సిద్ధ రామయ్య కూడా తన సీటు విషయంలో పూర్తి ధీమాతో ఉన్నారు అని అంటున్నారు.
డీకే వర్గంలో అసహనం :
ఇదిలా ఉంటే కర్ణాటకలో 2023 ఎన్నికల్లో డీకే ఫేస్ వాల్యూతోనే భారీ విజయం కాంగ్రెస్ కి దక్కింది అని అంటున్నారు. అంతే కాదు డీకే తప్పనిసరిగా సీఎం అయి తీరుతారు అని కూడా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన డిప్యూటీ చెయిర్ కే పరిమితం అయ్యారు. మరి అనధికార ఒప్పందం కోసం రెండున్నరేళ్ళ పాటు ఆయన వెయిట్ చేశారు అని అంటున్నారు. అయితే ఆ ఒప్పందం ఇపుడు అమలు అవుతుందా లేదా అన్నదే డీకే వర్గానికి పట్టుకున్న పెద్ద టెన్షన్ గా మారింది అని అంటున్నారు.
వేదాంతమా లేక :
ఇదిలా ఉంటే డీకీ దీని మీద మీడియాతో మాట్లాడుతూ సీఎం సీటు విషయంలో తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు అంటే తనకు దక్కాలి అనుకుంటే దక్కి తీరుతుందని అందులో అర్ధం ఉంది అని అంటున్నారు అదే సమయంలో రాజకీయాల్లో తల రాతలు కర్మ సిద్ధాంతాలను నమ్ముకుని ఎవరూ చేతులు ముడుచుకోరు కదా అన్నది కూడా ఉంది. మరి డీకే చేసిన వ్యాఖ్యల వెనక అసహనమా లేక వ్యూహాత్మకమా ఏమి ఉంది అన్నది తర్కిస్తున్నారు.
నవంబర్ లోనేనట :
మరో వైపు చూస్తే నవంబర్ లో కర్ణాటక రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని ప్రచారం అయితే సాగుతోంది. అంటే సీఎం సీటు మార్పు మీద కచ్చితంగా డీకేకు అనుకూల నిర్ణయం జరిగి తీరుతుంది అని ఆయన వర్గం ఆశభావంతో ఉంది. కానీ కాంగ్రెస్ పెద్దలు ఇపుడు మొత్తం కదిపి కొరివితో తలగోక్కుంటారా అన్నది కూడా ఉంది అయితే డీకే వర్గం సర్దుకోకపోతే మాత్రం కర్ణాటక మాత్రం రాజకీయ ప్రకంపనలకు కేంద్ర బిందువు అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.