1500 గజాల స్థలాన్ని కాజేశారు.. కరాటే కళ్యాణి ఆరోపణలు!
తాజాగా కరాటే కళ్యాణి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సంచలన వీడియో పోస్ట్ చేసింది. అది కూడా తన చేతిలో ప్రూఫ్ పేపర్లు పట్టుకొని మరీ అన్ని విషయాలు బయట పెట్టింది.;
సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కరాటే కళ్యాణి.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాదు బయట ఏవైనా సమస్యలు ఉంటే వాటి మీద స్పందించడానికి కూడా కరాటే కళ్యాణి ముందుంటుంది. అయితే అలాంటి కరాటే కళ్యాణి తాజాగా ఒక సంచలన విషయాన్ని బయట పెట్టింది. బంజారా హిల్స్ లో ఉండే కోట్ల విలువ చేసే 1500 గజాల స్థలాన్ని ఓ మేయర్ కాజేసింది అంటూ సంచలన ఆరోపణలు చేస్తోంది..మరి ఇంతకీ ఈ 1500 గజాల స్థలం కాజేయడం ఏంటి..? దాని వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా కరాటే కళ్యాణి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సంచలన వీడియో పోస్ట్ చేసింది. అది కూడా తన చేతిలో ప్రూఫ్ పేపర్లు పట్టుకొని మరీ అన్ని విషయాలు బయట పెట్టింది. ఇందులో భాగంగా బంజారాహిల్స్ లో ఉండే కోట్ల విలువ చేసే 1500 గజాల స్థలాన్ని మేయర్ గద్వాల విజయలక్ష్మి కాజేసిందంటూ ఆరోపించింది. కరాటే కళ్యాణి మాట్లాడుతూ... 2023లో ఈ స్థలాన్ని మేయర్ విజయలక్ష్మికి రెగ్యులరైజ్ చేశారు..అది కూడా బిఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతోనే జరిగింది. మేము పెద్దమ్మ గుడి కోసం స్థలాన్ని ఇవ్వమంటే గజానికి 2 లక్షలు చెప్పారు. అలాంటిది గజానికి 350 చొప్పున మేయర్ విజయలక్ష్మి పేరిట ఆ స్థలాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు?
మేయర్ విజయలక్ష్మికి సంబంధించిన అక్రమాలు ఇప్పటికే జర్నలిస్టు మిత్రులు ఎన్నో బయటకు తీసి రాశారు. కానీ ఇప్పటివరకు ఆమెపై యాక్షన్ తీసుకున్నదే లేదు. అలాగే ఆ మేయర్ అంత పేద బ్రతుకు బ్రతుకుతోందా..? పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అని, ఆమె చాలా సంవత్సరాల నుండి అక్కడే నివాసం ఏర్పర్చుకుందని 350 రూపాయల చొప్పున 1500 గజాలని రిజిస్ట్రేషన్ చేశారా..? అయితే పెద్దమ్మ గుడి కూడా అక్కడ దాదాపు 70,80 సంవత్సరాలు నుండి ఉంటుంది. అలాంటిది పెద్దమ్మ గుడికి స్థలాన్ని ఎందుకు కేటాయించరు.. ఆ పేద కుటుంబానికి చెందిన మేయర్ విజయలక్ష్మికి ఎలా కేటాయిస్తారు.. ఇదంతా బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ అండదండలు చూసుకుని రిజిస్ట్రేషన్ చేశారు. పెద్దమ్మ గుడికి స్థలాన్ని కేటాయించమంటే మా మీద రాళ్లు రువ్వుతారు. ఇంట్లో నుండి రానివ్వకుండా హౌస్ అరెస్టు చేస్తారు. మరి ఆమెకి ఎలా స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారు..
తక్షణమే ఈ విషయం గురించి రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలి. 1000 గజాల స్థలాన్ని పెద్దమ్మ గుడికి ఇవ్వమంటే ఇవ్వలేదు. కానీ 2023లో మేయర్ విజయలక్ష్మి తన పేరు మీద ఆ స్థలాన్ని రెగ్యులరైజ్ చేసుకుంది" అంటూ ఆధారాలతో సహా బయటపెట్టింది. అంతేకాదు ఏ అర్హత ఉందని గద్వాల్ విజయలక్ష్మికి 1500 గజాల స్థలాన్ని కేటాయిస్తారు. ఆమె ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా.. లేక ఆమె తండ్రి ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా.. లేక ఆమె తాత ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా..ఏ ఉద్దేశంతో ఆమెకు స్థలాన్ని కేటాయించారు అంటూ మేయర్ గద్వాల విజయలక్ష్మి చేసిన భూ దందాని బయటపెట్టింది నటి,హిందూ సంఘ నేత అయినటువంటి కరాటే కళ్యాణి.. ప్రస్తుతం కరాటే కళ్యాణి ఆధారాలతో సహా ఈ భూ దందా ఇష్యూ ని బయటికి తీయడంతో ఈ విషయం కాస్త మీడియాలో వైరల్ గా మారింది.మరి కరాటే కళ్యాణి చేసిన ఆరోపణలపై మేయర్ ఏ విధంగా క్లారిటీ ఇస్తుంది.? ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ?అనేది చూడాలి.