జగన్.. పోస్టుల వీరుడేనా ..!
జగన్ ఇక వాట్సాప్ విరుడేనా? పోస్టులకే పరిమితం అవుతారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మిన్ను విరిగి మీదపడుతున్నా.. జగన్ తాడేపల్లి పాలస్‌ను వదిలిపెట్టి రావడం లేదు.;
జగన్ ఇక వాట్సాప్ విరుడేనా? పోస్టులకే పరిమితం అవుతారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మిన్ను విరిగి మీదపడుతున్నా.. జగన్ తాడేపల్లి పాలస్‌ను వదిలిపెట్టి రావడం లేదు. కేవలం తన పార్టీకి చెందిన నాయకులు జైల్లో ఉన్నప్పుడు వారిని పరామర్శించడానికి మాత్రమే తాడేపల్లి నుంచి బయటికి వచ్చిన జగన్ ఆ తర్వాత ప్రజా సమస్యలపై ఇప్పటివరకు ఒక ఉద్యమాన్ని కూడా నిర్వహించలేకపో యారు. ప్రజాల తరఫున ఆయన ఒక్కసారి కూడా రోడ్డు మీదకు రాలేకపోయిన విషయం తెలిసిందే.
ఇంట్లో కూర్చుని అనేక విషయాల్లో ఆయన పోస్టులు పెడుతున్నారు. అయితే అవి ఎంతమందికి చేరుతున్నాయి అన్నది ప్రశ్న మారింది. సుదీర్ఘ పోస్టులు పేజీలకు పేజీలు పోస్ట్లు చేయడం వల్ల ఉపయోగం ఏంటి అన్నది సొంత పార్టీలోనే వినిపిస్తున్న మాట. తాజాగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటుపరం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైన నేపథ్యంలో మరో నాలుగు పేజీల పోస్టును సోషల్ మీడియాలో జగన్ పోస్ట్ చేశారు. ఆరోగ్యశ్రీ పేదల కోసం తీసుకువచ్చిన కీలక పథకమని, దీనిని ప్రైవేట్ కి ఎలా అప్పగిస్తారని ఆయన ప్రశ్నించారు.
అయితే వాస్తవానికి ఇలాంటి కీలకమైన సందర్భాల్లో కూడా ప్రజల మధ్యకు రాకపోతే ఇక ఆయనకి గ్రాఫ్ ఎలా పెరుగుతున్నది సీనియర్ నాయకులు చెబుతున్నారు. వాస్తవానికి గత ఏడాదిన్నర కాలంగా కూడా జగన్ తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమై, తన రాజకీయలకు కేవలం పోస్టులను మాత్రమే ఎంపిక చేసుకుని వాటి ద్వారా మాత్రమే స్పందిస్తున్నారు. అప్పుల విషయం నుంచి రైతుల విషయం దాకా, మద్దతు ధరల నుంచి గోదాముల సమస్య దాకా, యూరియా నుంచి మామిడి పండ్ల విషయం వరకు కూడా జగన్ కేవలం సోషల్ మీడియా ద్వారానే స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలోనే పోస్టులు పెడుతున్నారు. కానీ, తన పార్టీకి చెందిన వారిని ఎవరినైనా అరెస్టు చేసి జైల్లో పెడితే మాత్రం ఆయన నేరుగా జైల్లోకి వెళ్లి పరామర్శిస్తున్నారు. మరి ప్రజలకు ఆయన చెరువ కావాలి అనుకుంటున్నారా లేదా ఎన్నికలకు ముందు చేరువైతే సరిపోతుందిలే ప్రజలు మన వెంటే ఉంటారని భావిస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రస్తుతం అయితే జగన్ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆయనను అభిమానించే నాయకులు కూడా దూరమవుతున్నారు. ఆయనకు మద్దతు ఇచ్చేవారు కూడా మౌనం పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జగన్ బయటకు రాకుండా ఇంటికే పరిమితమై తాడేపల్లి ప్యాలెస్ నుంచి పోస్టులకే పరిమితం అవుతున్నారంటే ఇక ఆయన పోస్టుల వీరుడు గానే మిగిలిపోతారా వచ్చే రెండు మూడు సంవత్సరాల వరకు కూడా ఆయన ఇక ప్రజల మధ్యకు రారా అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటివరకు అయితే జగన్ ప్రజల మధ్యకు రావడం లేదు అనేది వాస్తవం. మరి ముందుముందు అయినా ఆయన ప్రజల మధ్యకు రాకపోతే ఆయన గ్రాఫ్ ఎలా పెరుగుతుంది ఏ విధంగా పార్టీ పుంజుకుంటుంది? అనేది చూడాలి.
మరీ ముఖ్యంగా వచ్చే ఎన్నికల నాటికైనా ఒంటరిగా ప్రయాణం చేసే పార్టీ పుంజుకోవాలంటే ఇప్పటినుంచి అడుగులు సక్రమంగా వేయాలి కదా అనేది సీనియర్ నాయకులు అడుగుతున్న ప్రశ్నలు. వీటికి కూడా జగన్ దగ్గర సమాధానం లేదు. అన్నిటికి కలిపి సోషల్ మీడియా మాత్రమే సమాధానం అన్నట్టుగా వైసిపి వ్యవహారం జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఉండడం మరింత చర్చనీయాంశంగా మారుతోంది.