భారత కరెన్సీపై బోస్...పటేల్...భగత్ సింగ్ ?

భారత జాతికి ఎంతో సేవ చేసిన జాతి నిర్మాతల బొమ్మలు ఇండియన్ కరెన్సీ మీద ముద్రించాలని కోరే వారు అంతా కొంత మంది ప్రముఖుల పేర్లను సూచిస్తున్నారు.

Update: 2026-06-06 13:30 GMT

రూపాయితోనే ఈ లోకం నడుస్తోంది. పైసాలో పరమాత్మ ఉన్నాడు. అందువల్ల ప్రతీ వారి చేతిలో రిజర్వ్ బ్యాంక్ ముద్రించిన కరెన్సీ కరకరలాడాల్సిందే. అందుకే కరెన్సీ అంటే అంత మోజు. ఆ కరెన్సీ మీద కేవలం ఎంత విలువ అన్నది అంకెల రూపంలో అక్షరాల రూపంలో ఉండడమే కాదు గాంధీ తాత బోసి నవ్వుతో అచ్చంగా స్వచ్చంగా కనిపిస్తాడు. ఇప్పటిదాకా చూస్తే భారతీయ కరెన్సీ మీద ఉన్న ఏకైన బొమ్మ గాంధీ తాతదే. కానీ ఇపుడు కొత్తగా ముద్రించబోయే కరెన్సీ నోట్ల మీద చాలా మంది జాతీయ నాయకుల బొమ్మలు ముద్రించాలని డిమాండ్ వస్తోంది. అంతే కాదు కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. బీజేపీకి కొంతమంది జాతీయ వాదుల మీద భక్తి ఉంది. మరి కొత్త నోట్ల మీద వారు బొమ్మలు చేరుస్తారా అన్న చర్చ సాగుతోంది.

బిగ్ డిబేట్ గా :

ఇదిలా ఉంటే భారత కరెన్సీ మీద జాతీయ నేతల బొమ్మలను ముద్రించాలా వద్దా అన్న దాని మీద అయితే బిగ్ డిబేట్ సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా అవును అని కానీ కాదు అని కానీ ఏకాభిప్రాయం లేకపోవడం విశేషం. అదే సమయంలో ఉండాలని అంటున్న వారు వద్దు అంటున్న వారి వాదనలు బలంగానే కాదు సరి సమానంగా ఉన్నాయి. ఇక జాతీయ నేతల బొమ్మలు ఉండాలని వాదించే వారు ఎవరి బొమ్మలను కోరుకుంటున్నారో కూడా ఆసక్తికరమే అని అంటున్నారు.

జాతి నిర్మాతల బొమ్మలు :

భారత జాతికి ఎంతో సేవ చేసిన జాతి నిర్మాతల బొమ్మలు ఇండియన్ కరెన్సీ మీద ముద్రించాలని కోరే వారు అంతా కొంత మంది ప్రముఖుల పేర్లను సూచిస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి ర కీలక స్వాతంత్ర్య సమరయోధులు అలాగే చారిత్రక యోధులు జాతి నిర్మాతల జాబితాను వారు ముందు పెడుతున్నారు. వీరిలొ భారతదేశ చరిత్రలో ప్రముఖ స్థానం ఉన్నందువల్ల వీరి బొమ్మలను ముద్రించడం ద్వారా జాతీయ గర్వం పెంచగలమని అంటున్నారు. అంతే కాదు దేశ ప్రజలకు ఈ రకంగా ఉత్తేజం కలిగించడం కూడా అవుతుందని అంటున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలు వివిధ కాలాలకు చెందిన ప్రముఖులు చరిత్ర పురుషులు దేశానికి చేసిన సేవలు అలాగే వారి చేసిన త్యాగాలను కూడా భారత కరెన్సీ మీద వారు బొమ్మలను చూసినపుడు గుర్తు చేసుకోవడం జరుగుతుందని వాదించే వారు ఉన్నారు.

అవసరం లేదంటూ :

అయితే అదే సమయంలో జాతీయ నేతలు కానీ ప్రముఖులు కానీ భారత కరెన్సీ పైన వారి బొమ్మలు అసలు అవసరం లేదని వాదించే వారు కూడా తమ లాజిక్ తో కూడిన విధంగా మాట్లాడుతున్నారు. మహాత్మా గాంధీ బొమ్మ ఒక్కటి చాలు అని అంటున్న వారూ ఉన్నారు భారత దేశం అంటేనే విభిన్న మతాలు అలాగే భిన్న ప్రాంతాలు వివిధ రకాలైన రాజకీయ భావజాలాలతో కూడి ఉందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో లౌకిక గుర్తింపు కలిగిన మహాత్ముడి వంటి వారి బొమ్మ అయితేనే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని అంటున్నారు. ఆయన అహింస అనే మూల తత్వానికి ప్రతీక అని అలాగే భారత దేశం స్వేచ్చా భావనకు స్ఫూర్తి అని కూడా అంటున్నారు. అంతే కాదు గాంధీ ముఖ చిత్రం అంటే జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ సుపరిచితమైనదిగా చెబుతున్నారు. అందువల్ల గాంధీ బొమ్మ ఉండడం సబబు తప్ప మరే మార్పులూ అవసరం లేదని అంటున్నారు. మరి చాలా మంది జాతీయ నాయకుల బొమ్మలని భారత కరెన్సీ మీద ముద్రించాలన్న డిమాండ్ అయితే పెరుగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏ వాదన నెగ్గుతుందో.



Tags:    

Similar News