రాత్రి పాములా మారుతున్న భార్య..

ఆమె ప్రవర్తనలో లోపాలున్నాయని, మానసికమైన ఇబ్బందులతో ఆమె బాధపడుతుందని తెలుసో.. తెలియకనో.. ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేశారని బాధితుడు న్యాయస్థానం ఎదుట ఆరోపించాడు.;

Update: 2025-10-07 11:30 GMT

రాత్రయితే ఆ భర్తకు నరకం కనిపిస్తుందట. పడకగదిలోకి వెళ్తే తాను బతికి బయటకు వస్తానా..? అన్న సందేహం కలుగుతుందట.. తాను ఎవరి పక్కన పడుకుంటున్నానో కూడా చెప్పులేపోతున్నానంటూ.. ఓ భర్త రోధించడం కొందరిని ఆశ్చర్చపరిస్తే.. మరికొందరిని హాస్యానికి గురి చేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ (యూపీ)లో జరిగింది. ఈ స్టోరీ విన్న న్యాయమూర్తి కూడా ఏం చేయాలో పాలుపోలేదు.

ఆశ్చర్యానికి గురైన మేజిస్ట్రేట్.

ప్రస్తుత జనరేషన్ లో కుటుంబ సంబంధాలు, వివాహ జీవితం సవాళ్లతో కూడుకున్నది. ఉత్తరప్రదేశ్ సీతాపూర్‌లోని మహ్మదాబాద్ తహసీల్‌లోని ఒక వింత ఫిర్యాదు షాక్‌కు గురిచేసింది. యువజంటలో భర్త మెరాజ్ తన భార్య రాజ్‌పూర్ నివాసి నసీమున్‌ రాత్రయితే పాములా మారి తనను భయపెడుతుందని, నిద్రపోనివ్వడం లేదని వాపోయాడు. ఈ ఘటన వెనుక మానసిక ఆరోగ్య సమస్యలూ, కుటుంబ వైఫల్యాలు ప్రధాన కారణం కావచ్చని అధికారులు సైతం భావిస్తున్నారు. శనివారం భర్త ఆరోపణలు విన్న జిల్లా మేజిస్ట్రేట్ అభిషేక్ ఇవన్నీ వినోదంగా, ఊహాజనితంగా అనిపించినా.. మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తుల ప్రవర్తనను తట్టుకోవడంలో ఎదుర్కొనే ఇబ్బందులను ఇది చూపిస్తుందని వ్యాఖ్యానించారు.

తనకు కట్టబెట్టి గొంతు గోశారన్న భర్త.. 

ఆమె ప్రవర్తనలో లోపాలున్నాయని, మానసికమైన ఇబ్బందులతో ఆమె బాధపడుతుందని తెలుసో.. తెలియకనో.. ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేశారని బాధితుడు న్యాయస్థానం ఎదుట ఆరోపించాడు. వారు తన జీవితాన్ని నాశనం చేశారని భర్త మెరాజ్ బాధపడుతున్నాడు. దీనిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా మేజిస్ట్రేట్ అభిషేక్ ఎదుట ఈ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు మొదలు పెట్టారు.

పెరుగుతున్న భార్యా బాధితులు..

భర్తల చేతిలో భార్యలు ఇబ్బందులు పడతారని ఫిర్యాదులు ఎక్కువగా ఫిర్యాదులు వస్తాయి. కానీ ఇటీవల ఇందులో మార్పు వచ్చింది. భార్యల చేతిలోనే భర్తలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. అయితే బాధితుడు తనకు తన భార్య నుంచి ప్రొటెక్షన్ కావాలని కోరడం కొందరికి వింతగా కనిపించడం కొసమెరుపు..

Tags:    

Similar News