హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్... యూఎస్ కొత్త మార్గదర్శకాలివే!
ఈ సందర్భంగా స్పందించిన యూఎస్.సీఐఎస్... తమ తాజా నిర్ణయంతో ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులు.. నూతన ఉద్యోగ అవకాశాలను ఇబ్బంది లేకుండా పొందొచ్చని పేర్కొంది.
హెచ్-1బీ వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని తాజాగా అగ్రరాజ్యం అమెరికా తీసుకుంది. ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఇది అతిపెద్ద గుడ్ న్యూస్ అని అంటున్నారు. కాకపోతే కొన్ని కండిషన్స్ మాత్రం ఉన్నాయని చెబుతున్నారు. ఈ మేరకు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్.సీఐఎస్) నూతన నిబంధనలను విడుదల చేసింది.
అవును... ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది అమెరికా. దీని ప్రకారం... ఉద్యోగం కోల్పోయిన వారు మరికొంత కాలం అమెరికాలో ఉండేందుకు అవకాశాన్ని పొందనున్నారు. ఈ మేరకు నిబంధనలు తెరపైకి వచ్చాయి. వాస్తవానికి... ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు అమెరికాలో ఉండేందుకు రెండు నెలల గ్రేస్ పిరియడ్ ఉంది.
అయితే... కొత్త నిబంధనావళి ప్రకారం.. లేఆఫ్ కు గురైన వారు గ్రేస్ పిరియడ్ సమయంలో నాన్ ఇమ్మిగ్రంట్ స్టేటస్ ఛేంజ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఏడాది పాటు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) పొందేలా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో మరికొన్ని మార్పులు చేస్తూ అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నిబంధనలు విడుదల చేసింది.
ఈ సందర్భంగా స్పందించిన యూఎస్.సీఐఎస్... తమ తాజా నిర్ణయంతో ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులు.. నూతన ఉద్యోగ అవకాశాలను ఇబ్బంది లేకుండా పొందొచ్చని పేర్కొంది.
కాగా... ఇటీవల గూగుల్, టెస్లా, వాల్ మార్ట్ వంటి దిగ్గజ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. వీరిలో హెచ్-1బీ వీసాదారులు చాలా మంది ఉన్నారు. అయితే నిన్నటివరకూ... ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు కేవలం 60 రోజులు మాత్రమే ఉండేందుకు అవకాశం ఉంది. ఈ లోపే మరో ఉద్యోగం వస్తే అక్కడే ఉండొచ్చు లేకపోతే స్వదేశాలకు వెళ్లిపోవాల్సి వచ్చేది.
అయితే ఇంత తక్కువ సమయంలో మరో ఉద్యోగం చూసుకోవడం వారికి చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే... ఉద్యోగులు మరింత కాలం అక్కడే ఉండి, వారి అర్హతకు, ఆసక్తికి అనుగుణంగా కొత్త ఉద్యోగం చూసేందుకు వెసులుబాటు కల్పిస్తూ అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఈ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.