ఆకాశాన్ని చూస్తున్న బంగారం ధరలు.. నిత్యం పెరగడానికి అసలు కారణం?

భారతదేశంలో అత్యంత ఖరీదైనటువంటి ఆభరణాల్లో బంగారం కూడా ఒకటి.. అయితే ఈ బంగారంపై మోజు ఇప్పుడు వచ్చింది కాదు..;

Update: 2025-10-18 11:30 GMT

భారతదేశంలో అత్యంత ఖరీదైనటువంటి ఆభరణాల్లో బంగారం కూడా ఒకటి.. అయితే ఈ బంగారంపై మోజు ఇప్పుడు వచ్చింది కాదు.. రాజులు పాలించిన కాలం నుంచే బంగారు ఆభరణాలకు ఎంతో విలువ ఉండేది. ముఖ్యంగా రాజులు బంగారు ఆభరణాలను, బంగారాన్ని వారి సంపదగా చూసుకునేవారు. ఆనాటి కాలం నుంచి ఈనాటి టెక్నాలజీ కాలంలో కూడా బంగారం వ్యాపారం విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. బంగారం ధర పెరుగుతూనే వస్తుంది తప్ప తగ్గిన దాఖలాలు అయితే కనిపించడం లేదు. అలాంటి బంగారం ప్రస్తుతం లక్షల రూపాయల్లో ధర పలుకుతోంది. అయినా దీన్ని కొనడంలో మాత్రం జనాలు అస్సలు తగ్గడం లేదు.

ముఖ్యంగా బంగారం అంటే ఆడవారికి ప్రీతిపాత్రం..వారు ఒంటినిండా ఆభరణాలు వేసుకొని ఎంతో మురిసిపోతారు. పెళ్లి జరిగినా.. పుట్టినరోజు వేడుక జరిగినా.. అసలు ఏ ఫంక్షన్ జరిగినా ..ఆడవారికి ఒంటినిండా బంగారం ఉండాల్సిందే.. ఇక బంగారాన్ని ఈ రోజుల్లో మగవారు కూడా ధరిస్తున్నారు కానీ ఆడవాళ్లు వేసుకున్నంత బంగారం మగవారు ధరించలేరు.. అందుకే బంగారం రేటు దినదినం పెరుగుతూ వస్తోంది. అయితే బంగారం ధర ఇంత పెరగడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి..1932 నుంచి మొదలు 2025 వరకు బంగారం ధర ఎప్పుడు తగ్గింది? ఎప్పుడు పెరిగింది? అనేది ఎప్పుడు చూద్దాం..

1932 కాలంలో గ్రేట్ డిప్రెషన్ వల్ల అమెరికా స్టాక్ మార్కెట్ లో బ్యాంకులు అన్ని కుప్పకూలిపోయాయి. ప్రపంచమంతా దీని ప్రభావం పడింది. దీంతో బంగారం ధరలు పెరిగాయి. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చాలా దేశాల్లో కరెన్సీ విలువలు పతనమయ్యాయి. దీంతో చాలా కేంద్ర బ్యాంకులు బంగారం నిలువలను పోగేయడం ప్రారంభించింది.

1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ బ్రేటన్ ఉడ్స్ సిస్టం రద్దు చేశారు. దీంతో డాలర్లను పసిడిలోకి మార్చబోతున్నారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో బంగారం రేటు విపరీతంగా పెరిగింది.

2008 నుంచి 2011 వరకు లేమ్యాన్ బ్రదర్స్ దివాలా తీయడంతో ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారాన్ని ఎంచుకోవడంతో దాని ధర అమాంతం పెరిగింది. ఆ తర్వాత 2020లో కోవిడ్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దీంతో చాలా దేశాలు ఆర్థికంగా కృంగిపోయాయి. ఆ సమయంలో కూడా బంగారం ధరలు పెరిగాయి.

అయితే ప్రస్తుతం 2025.. ఇప్పుడు కూడా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.. దీనికి ప్రధాన కారణం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల చాలా దేశాల కరెన్సీ విలువలు క్షీణించాయి. దీనికి తోడు అమెరికాకు అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన తర్వాత సుంకాలు భారీగా పెంచారు. దీంతో ఆర్థిక భద్రత కోసం వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేస్తూ నిలువలు పెంచుకుంటున్నాయి. దీనివల్ల బంగారం ధర విపరీతంగా పెరుగుతోందని చెప్పవచ్చు. ప్రస్తుతం బంగారం రేట్లు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1.20-1.30 లక్షల రూపాయలు ఉంది. రాబోవు రోజుల్లో 2 లక్షల రూపాయలకు చేరినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదని బంగారం వ్యాపార నిపుణులు అంటున్నారు.

Tags:    

Similar News