ఏఐ దెబ్బ.. విల్లాలు కాదు.. వ్యవసాయ భూములే నిజమైన ఆస్తి!

ప్రస్తుతం ఏఐ వేగంగా అన్ని రంగాల్లోనూ విస్తరిస్తోంది. దీంతో అనేక రంగాల్లో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.;

Update: 2025-04-19 05:54 GMT

ప్రస్తుతం ఏఐ వేగంగా అన్ని రంగాల్లోనూ విస్తరిస్తోంది. దీంతో అనేక రంగాల్లో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఎన్ని ఏఐలు వచ్చినా దెబ్బతినని ఒకే ఒక్క రంగం వ్యవసాయ రంగం. ఏఐ మన ఉద్యోగాలను మింగేసినా, ప్రతి ఒక్కరికీ తిండి కావాల్సిందే కదా. వ్యవసాయం చేసే వాళ్లకు త్వరలోనే బాగా డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) అనేక రంగాల్లో దూసుకుపోతున్న తీరు చూస్తే, ఇక ఉద్యోగాల సంగతి అంతే అని చాలా మంది అనుకుంటున్నారు.కానీ చాలా మంది దీనిని మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏం కాదు.. అంత సీన్ ఏం ఉండదు లే అని లైట్ తీసుకుంటున్నారు. ఆందోళన చెందుతున్న వాళ్లంతా పిరికి వాళ్లని కొట్టి పారేస్తున్నారు.

కానీ వాస్తవం మాత్రం చాలా సీరియస్ గా ఉంది. ఇవాళ చాలా మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, బాగా సంపాదించే వాళ్లు కోట్లు పెట్టి లగ్జరీ విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో భారీగా పెట్టుబడుతు పెడుతున్నారు. కానీ ఏఐ బాగా పెరిగిపోతే ఇవన్నీ వేస్ట్ పెట్టుబడులుగా మారే ప్రమాదం ఉంది. చాలా మందికి ఉద్యోగాలు ఊడిపోతే అంతంత అద్దెలు కట్టడానికి లేదా ఆ ఇళ్లు కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు.

ఏఐ చాలా ఉద్యోగాలను తీసుకున్నా ఎప్పటికీ విలువ తగ్గనిది ఒక్కటే.. అదే వ్యవసాయం. ప్రతి మనిషికీ తిండి ఎప్పుడూ ముఖ్యమే కదా. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే..చివరికి ఏఐ చాలా పరిశ్రమలను ఆక్రమించినా బతికేది వ్యవసాయ రంగం మీదనే. అందుకే ఇప్పుడు చాలా మంది ఎకనామిస్టులు లగ్జరీ ఇళ్లకు బదులు మంచి భూమిలో లేదా ఫామ్‌హౌస్‌లలో పెట్టుబడి పెట్టాలని సలహా ఇస్తున్నారు. రేపు ఉద్యోగాలు ఊడిపోతే మనంతట మనమే పండించుకుని బతకగలిగితే అదే పెద్ద ఆస్తి అవుతుంది.

ఆహారానికి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఒకవేళ అందరికీ ఉద్యోగాలు పోతే, కనీసం తిండి పెట్టడానికి అయినా గవర్నమెంట్లు కదలాల్సి ఉంటుంది. అందుకే వ్యవసాయ భూమి కొనడం చాలా తెలివైన పని. రాబోయే రోజుల్లో ఈ భూముల ధర గేటెడ్ విల్లాల కంటే కూడా భారీగా పెరిగిపోవచ్చు. వ్యవసాయం ఒక్కటే అందరినీ నిలబెట్టే బిజినెస్ కావచ్చు. అందుకే ఈ తరంలోని వాళ్లు వీలైనంత ఎక్కువ వ్యవసాయంలో పెట్టుబడి పెడితే, ఏఐ రాజ్యం వచ్చినా మన పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి అదే అవుతుంది.

Tags:    

Similar News