నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు.. ట్రంప్ ప్లాష్ బ్యాక్ వైరల్!

ఈ సమయంలో... ఎప్‌ స్టీన్‌ వ్యవహారంపై కొన్ని దశాబ్దాల క్రితమే దర్యాప్తు కోరిన మారియా ఫార్మర్‌ అనే అమెరికన్‌ కళాకారిణి.. తాజాగా ట్రంప్ పై సంచలన ఆరోపణలు చేశారు.;

Update: 2025-07-22 10:05 GMT

ఇప్పుడు అమెరికాలో ఎఫ్ స్టీన్ ఫైల్స్ వ్యవహారం అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కత్తి ట్రంప్ మెడపై వేలాడుతుందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ప్రధానంగా గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జెఫ్రీ ఎప్‌ స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం ఫైల్స్ విడుదల చేస్తానంటూ ఇచ్చిన హామీ.. తిరిగి ఆయన మెడకే చుట్టుకుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఆగడం లేదు. ఈ సందర్భంగా తెరపైకి వస్తున్న ఆరోపణలు.. ఆయనను గతం వెంటాడుతూనే ఉందనే కామెంట్లకు ఆస్కారం కల్పిస్తోంది. ఈ సమయంలో... ఎప్‌ స్టీన్‌ వ్యవహారంపై కొన్ని దశాబ్దాల క్రితమే దర్యాప్తు కోరిన మారియా ఫార్మర్‌ అనే అమెరికన్‌ కళాకారిణి.. తాజాగా ట్రంప్ పై సంచలన ఆరోపణలు చేశారు.

వివరాళ్లోకి వెళ్తే... 1995లో తాను ఎప్‌ స్టీన్‌ కోసం పనిచేయడానికి సిద్ధమవుతున్నానని చెప్పిన మారియా ఫార్మర్... ఒక రోజు బాగా పొద్దుపోయాక ఎప్‌ స్టీన్‌ తనకు ఫోన్‌ చేసి, మాన్‌ హట్టన్‌ లోని ఆఫీసులో కలవాలని చెప్పగా... తాను రన్నింగ్‌ షార్ట్స్‌ ధరించే ఆఫీస్‌ కు వెళ్లినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో బిజినెస్‌ సూట్‌ ధరించి ట్రంప్ అక్కడికి వచ్చారని ఆమె గుర్తు చేసుకొన్నారు.

ఈ సందర్భంగా తనకు దగ్గరగా నిలబడిన ట్రంప్‌ ఎవరి కోసమో వేచి చూస్తున్నారని ఆమె చెప్పారు. ఈ క్రమంలో ట్రంప్ తన కాళ్ల వైపు అదేపనిగా చూడటాన్ని గమనించినట్లు మారియా వెల్లడించారు. ఆ సమయంలో తనకు భయం వేసినట్లు పేర్కొన్న మారియ... సరిగ్గా అప్పుడు అక్కడికి ఎప్ స్టీన్ వచ్చినట్లు తెలిపారు.

ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఎప్ స్టీన్.. 'నో.. నో.. ఆమె నీకోసం కాదు' అంటూ ట్రంప్‌ తో చెప్పి, అక్కడి నుంచి తీసుకెళ్లారన్నారని అన్నారు. అప్పుడు ఎప్ స్టీన్ తో వెళ్తోన్న ట్రంప్... తనకు 16 ఏళ్లు ఉంటాయని అనుకొన్నట్లు వ్యాఖ్యానించారని.. అయితే, తన వయసు 20ల్లో ఉందని చెబుతూ.. నాటి (చేదు) జ్ఞాపకాలను మారియా ఫార్మార్ న్యూయార్క్ టైమ్స్ తో పంచుకున్నారు.

ఈ వ్యాఖ్యలపై వైట్ హౌస్ స్పదించింది. ఈ మేరకు వైట్ హౌస్ కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ స్టీవెన్‌ స్పందిస్తూ... ఎప్‌ స్టీన్‌ తో స్నేహాన్ని ట్రంప్‌ వదిలేసి చాలాకాలం అవుతోందని, అయినా.. ట్రంప్ ఏనాడు ఎప్‌ స్టీన్‌ ఆఫీస్‌ కు వెళ్లలేదని పేర్కొన్నారు. వాస్తవానికి ఎప్‌ స్టీన్‌ చెత్త ప్రవర్తనతో విసిగిపోయిన ట్రంప్‌ అతడిని తన క్లబ్‌ నుంచి వెళ్లగొట్టారని తెలిపారు.

Tags:    

Similar News