ఎప్‌ స్టీన్‌ ఫైల్స్‌ పై మరోసారి స్పందించిన ట్రంప్.. ఈసారి హెచ్చరిక!

అవును... అమెరికా న్యాయ శాఖ ఇటీవల ఎప్‌ స్టీన్‌ కు చెందిన క్లయింట్ జాబితాను విడుదల చేసింది. అయితే ఆ నివేదికలో కొన్ని కీలక పేర్లు దాచారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి!;

Update: 2025-07-14 01:30 GMT

అమెరికాను ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణం కుదిపేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ పెట్టుబడిదారుడు జెఫ్రీ ఎప్ స్టీన్ పాల్పడిన ఈ దారుణాలు తీవ్ర సంచలనం సృష్టించాయి! పేద, మధ్యతరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశ చూపించి.. ఫ్లోరిడా, న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోలోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడనేది అతనిపై ప్రధాన ఆరోపణ.

ఈ క్రమంలో ఇటీవల మరోసారి ఈ వ్యవహారాన్ని ట్రంప్ సర్కార్ తెరపైకి తెచ్చింది. ఈ సమయంలో కీలక పత్రాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా... జెఫ్రీ ఎప్ స్టీన్ పాల్పడిన దారుణానికి సంబంధించి కీలక పత్రాలను అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. దీనికి "ది ఎప్ స్టీన్ ఫైల్స్:ఫేజ్ 1" అని పేరు పెట్టింది. అయితే ఈ విషయంపై ట్రంప్ తాజాగా మండిపడ్డారు!

అవును... అమెరికా న్యాయ శాఖ ఇటీవల ఎప్‌ స్టీన్‌ కు చెందిన క్లయింట్ జాబితాను విడుదల చేసింది. అయితే ఆ నివేదికలో కొన్ని కీలక పేర్లు దాచారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి! దీనిపై ట్రంప్ తాజాగా అసహనం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా.. ఎప్ స్టీన్ క్లయింట్ల జాబితాను దాచినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసినా కూడా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా... ఎప్‌ స్టీన్‌ ఫైల్స్‌ పేరుతో తన పరిపాలనా యంత్రాంగంపై దాడి చేయవద్దని హెచ్చరించారు. మరోవైపు... ఎప్‌ స్టీన్‌ జైలులో హత్యకు గురయ్యాడనే వాదన బలంగా తెరపైకి వచ్చిన వేళ.. ఆ వాదనను అమెరికా న్యాయశాఖ తోసిపుచ్చింది. 2019లో న్యూయార్క్ జైలులో అతడు ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించింది!

అయితే ఈ చర్యను ప్రతిపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి. ముఖ్యంగా వారు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌, అటార్నీ జనరల్ పామ్ బోండిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వారిరువురూ ట్రంప్‌ కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మండిపడ్డారు. ఎప్‌ స్టీన్‌ ఫైల్స్‌ పేరుతో తన పరిపాలనా యంత్రాంగంపై ఎలాంటి దాడి చేయవద్దని హెచ్చరించారు.

ఈ క్రమంలో దీనిపై స్పందించిన ట్రంప్... తాముంతా ఒక బృందంగా ఉన్నామని.. తమ పాలనపై వస్తున్న విమర్శలు అర్థరహితమైనవని.. కొందరు స్వార్థపరులు ఇతరులను బాధ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని.. ఈ విషయాన్ని డెమొక్రాటిక్ పార్టీ తన రాజకీయ ప్రయోజనం కోసం నాటకం ఆడుతోందని, వారు దీనితో ప్రయోజనాలను పొందాలని ఆశిస్తున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News