ఆ పాఠశాల చేసిన పనికి రోడ్డు మీద పడ్డ విద్యార్థుల జీవితాలు.. ప్రత్యామ్నాయం చూపించరా..?

సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లిలో ఒక పాఠశాలలో కల్లులో వాడే అల్ర్పాజోలం మాత్రలు తయారు చేస్తూ దొరికిపోయింది.;

Update: 2025-09-15 10:48 GMT

‘ప్రపంచాన్ని మార్చాలంటే పాఠశాల గదిలోనే సాధ్యం’ ఇది ఒక కొటేషన్ కాదు.. అక్షరం.. అక్షరం.. సత్యం. ప్రపంచం మార్చాలంటే కేవలం చదువుతోనే సాధ్యం. ఆ చదువు అందించే ఏకైక ఒక స్థలం పాఠశాల మాత్రమే. అందుకే ప్రపంచంలో చాలా దేశాలు విద్యను వ్యాపారం నుంచి తొలగించాయి. భారతదేశంలో కూడా విద్యను ప్రాఫిటైజ్ చేస్తే కఠిన శిక్షలు ఈ విషయం అందరికీ తెలిసిందే.. కానీ యాజమాన్యాలు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. వందలాది.. వేలాది.. పాఠశాలలు, కాలేజీలు కేవలం ప్రాఫిట్ మాత్రమే చూసుకుంటూ నిర్వహిస్తున్నారు యాజమాన్యాలు. ఇప్పటికీ ఎన్నో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం కేవలం ప్రాఫిట్ మాత్రమే చూసుకుంటున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాము కూలి చేసుకుంటున్నా.. పిల్లల భవిష్యత్ బాగుండాలని వేల నుంచి లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ చిన్నారులను ప్రైవేట్ స్కూల్స్ లో చేర్పిస్తుంటారు తల్లిదండ్రులు. కానీ ఆయా పాఠశాలలు కేవలం సంపాదనపై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తూ విద్యార్థుల జీవితాలను పాతాళంలో పడేస్తున్నాయి. మనం చూస్తున్న చాలా పేరున్న పెద్ద పెద్ద గుర్తింపు ఉన్న కాలేజీల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా ఉండవు. కనీసం సూర్యరశ్మి కూడా పడని గదుల్లో ఉంచుతూ వారి జీవితాలను ఆగమాగం చేస్తున్నాయి యాజమాన్యాలు.

ఒక కొన్నింటిలో కనీస అర్హతలేని ఉపాధ్యాయులతో పాఠాలు చెప్పిస్తూ.. ర్యాంకుల కోసం వారిపై విపరీతమైన ప్రెషర్ పెడుతుంటారు. దీని వల్ల విద్యార్థులకు జీవితంపై విరక్తి చెంది మరణించిన ఘటనలు లేకపోలేదు. అసలు యాజమాన్యాలు ఈ ధోరణి అవలంభిస్తుంటే విద్యాధికారులు మాత్రం పట్టించుకోకపోవడం తల్లిదండ్రులను చాలా వరకు బాధిస్తోంది. కేవలం డబ్బులు పెట్టామా.. ర్యాంకులు రావడం లేదని పిల్లలపై ప్రెషల్ పెట్టామా అని చూసుకుంటున్న తల్లిదండ్రులు వారి చదువు ప్రదేశంలో ఇబ్బందులు, వారి కష్టనష్టాలు, ఇవన్నీ కూడా పట్టించుకుంటే బాగుండేదని వాపోతున్న ఘటనలు కోకొల్లలు.

పాఠశాలల్లో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్న ఘటనలు కూడా చాలా వరకు మనం వార్తల్లో వింటున్నాం.. అయితే బయటి నుంచి వచ్చిన వ్యక్తులు చేసేది ఒకటైతే పాఠశాలల్లో ఉండే యాజమాన్యం చేసేది మరో ఎత్తు. ఇటీవల ఒక పాఠశాల మత్తు పదార్థాలను తయారు చేస్తూ బడి అన్న పదానికే కలంకం తెచ్చింది. సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లిలో ఒక పాఠశాలలో కల్లులో వాడే అల్ర్పాజోలం మాత్రలు తయారు చేస్తూ దొరికిపోయింది. పాఠశాలలోని పై అంతస్తులో ఒక ఫ్లోర్ మొత్తం వీటి తాయారీకే ఉపయోగిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలియడంతో సీజ్ చేశారు.

ఆ పాఠశాలలో చదివే విద్యార్థుల భవిష్యత్ ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. స్కూల్ సీజ్ చేసిన అధికారులు విద్యార్థులను మరో స్కూల్ కు కేటాయించడం మరిచారు.. కాదు.. కాదు.. అలా సాధ్యం కాకపోవచ్చు. ప్రత్యమ్నాయం చూపించాలన్న కనీస బాధ్యత లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనలో ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలలు అంటేనే చేర్పించినప్పటి నుంచి ఫీజులు అంటూ మోత మోగిస్తుంటాయి. ఫీజులు కట్టడం రోజు ఆలస్యమైతే మెసేజ్ లు.. ఫోన్లు.. కట్టే వరకు విసిగించేస్తారు. అలా ఆ పాఠశాలలో ఇప్పటి వరకు 70 శాతం ఫీజులు కట్టినట్లు పోషకులు చెప్తున్నారు.

Tags:    

Similar News