బిగ్ బ్రేకింగ్... చంద్రబాబు హెలీకాప్టర్ ప్రయాణంలో కలకలం!

అవును... టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ లో కలకలం రేగింది! ఇందులో భాగంగా ఆయన ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ దారితప్పిందని తెలుస్తుంది.

Update: 2024-01-20 09:17 GMT

రాజకీయ నాయకులు ప్రయాణిస్తున్న హెలీకాప్టర్లకు సంబంధించిన ఏ చిన్న విషయం తెరపైకి వచ్చినా వారి అభిమానులు, నేతలు, కార్యకర్తలు, ప్రజానికం ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివి కీలకంగా రెండు సంఘటనలు ఉండటంతో.. వాటిని తలచుకుని మరింత ఆందోళన చెందుతుంటారు. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ప్రయణంలో కలకలం రేగింది.

అవును... టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ లో కలకలం రేగింది! ఇందులో భాగంగా ఆయన ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ దారితప్పిందని తెలుస్తుంది. ఏటీసీతో సమన్వయ లోపమే దీనికి కారణం అని అంటున్నారు. దీంతో నిర్దేశించిన మార్గంలో కాకుండా మరొక మార్గంలో ఆ హెలీకాప్టర్ ప్రయాణించిందని సమాచారం. విశాఖ నుంచి అరకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.

చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఇలా రాంగ్ రూట్ లో వెళ్తుండటంతో.. ఈ విషయాన్ని ఏటీసీ హెచ్చరించిందని తెలుస్తుంది. ఈ హెచ్చరికలతో హెలీకాప్టర్ వెనుదిరిగిందని సమాచారం. ఈ సమయంలో తిరిగి సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతి ఇచ్చిందని అంటున్నారు. దీంతో... చంద్రబాబు క్షేమంగా అరకు చేరుకున్నారు!!

కాగా... ఎన్నికలు సమీపిస్తున్న వేళ "రా.. కదలిరా" సభలతో చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొన్న గుడివాడ, నిన్న వెంకటగిరిల్లో సభలు నిర్వహించిన ఆయన ఈరోజు అరకులో "రా.. కదలిరా" సభలో పాల్గొంటున్నారు!

Tags:    

Similar News