కొత్త మంత్రులు వస్తారట...టెన్షన్ నింపిన కేబినెట్ మీట్
ఇక పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత కూడా మంత్రుల మీద ఉంది. జిల్లా ఇంచార్జీలుగా ఉన్న మంత్రులు ఆయా జిల్లాలను అన్ని విధాలుగా పరుగులు పెట్టించాలి.;
ఉన్న మంత్రులు సరిగ్గా వ్యవహరించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా ఆయన మంత్రుల నుంచి ఏమి ఆశిస్తున్నారు. ఆయన ఆలోచనలకు తగిన విధంగా వ్యవహరించే వారు ఎవరు, కాని వారు ఎవరు అన్న చర్చ సాగుతోంది. చంద్రబాబు అయితే రోజులో అత్యధిక గంటలు పనిచేస్తారు. ఆయన ప్రతీ రోజూ ప్రతిపక్ష వైసీపీని కట్టడి చేయడానికి తనదైన శైలిలో ప్రయత్నిస్తూంటారు.
పరోక్షంగా అయినా విమర్శలు చేస్తారు. కొన్ని సందర్భాలలో ప్రత్యక్షంగా కూడా ధాటీగానే విమర్శలు ఎక్కుపెడతారు. అలా డైనమిక్ గా ఉంటూ ఎప్పటికప్పుడు విపక్షానికి కౌంటర్ ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు అని అంటున్నారు. అంతే కాదు ప్రభుత్వం చేస్తున్న మంచిని జనాలకు చెప్పాలని ఆయన కోరుతున్నారు.
ఇక పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత కూడా మంత్రుల మీద ఉంది. జిల్లా ఇంచార్జీలుగా ఉన్న మంత్రులు ఆయా జిల్లాలను అన్ని విధాలుగా పరుగులు పెట్టించాలి. రాజకీయంగా కూడా వ్యూహాలు రచించాలి. ఇలా మంత్రి పదవి అంటే ఎన్నో బాధ్యతలతో కూడుకున్నది, బరువైనదిగా బాబు మార్క్ ఆలోచనలలో ఉంది.
కానీ చాలా మంది మంత్రులు ఇంకా ఆ సీరియస్ నెస్ ని చూపించలేకపోతున్నారు అని అంటున్నారు. అయితే ఇవే కారణాలు కావని ఇంకా అనేకం ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు మంత్రులను తప్పించడం తధ్యమని అంటున్నారు. కొందరి మీద ఆరోపణలు కూడా వస్తున్నాయని చెబుతున్నారు. దాంతో కూడా ఈసారి హెచ్చరికల కంటే వేరే విధంగానే ఆలోచించాలని భావిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.
మీరు సరిగ్గా పనిచేయకపోతే కొత్త వారు వస్తారు అంటూ బాబు మంత్రులకు హెచ్చరించారు అని ప్రచారం సాగుతోంది. మరి కొత్త వారు వస్తారు అన్నది తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదని అంటున్నారు అలా బాబు అన్నారు అంటే దానికి సంబంధించి గ్రౌండ్ ప్రిపేర్ అవుతుందా అన్న సంశయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎపుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా మొదట మంత్రి అయ్యేది జనసేన నుంచి నాగబాబు అని చెబుతున్నారు. ఆయనకు చాలా కాలం క్రితమే ప్రామిస్ ఉంది. దానిని నిలబెట్టుకోవాలని అనుకుంటున్నారు. పనిలో పనిగా ఏడాది కాలంలో తమ గ్రాఫ్ పెంచుకోని వారిని పక్కన పెట్టి కొత్త వారికి చాన్స్ ఇస్తారని అంటున్నారు. దాంతో బాబు నాయకత్వంలో జరిగిన ఈసారి కేబినెట్ సమావేశం చాలా మంది మంత్రులలో టెన్షన్ ని పెంచింది అని అంటున్నారు.
ఉత్తరాంధ్రాలో రాయలసీమలో కోస్తాలో గోదావరి జిల్లాలో కలిపి కనీసంగా నలుగురైదుగురు మంత్రులను తప్పిస్తారు అన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. వీరిలో ఒక మహిళా మంత్రి కూడా ఉంటారని చెబుతున్నారు. కీలకమైన శాఖను అప్పగించినా నిభాయించలేకపోతున్నారు అన్నదే ఆ మహిళా మంత్రి మీద విమర్శగా ఉందని చెబుతున్నారు.
మరో వైపు కొందరు మంత్రులు ఇంకా లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తున్నారుట. అంతే కాదు ఇంకొందరు మంత్రుల విషయం తీసుకుంటే సబ్జెక్ట్ లో మెరుగుపరచుకోలేదని అంటున్నారు. ఇక నాగబాబుతో పాటు మరో నలుగురు ఐదుగురుకీ ఈసారి చాన్స్ ఉండొచ్చు అంటున్నారు. ఆ నలుగురైదుగురు లో టీడీపీ నుంచి ఎవరు ఉన్నారు అన్నదే చర్చ. కొత్త వారు వస్తారు అని బాబు అన్నట్లుగా వస్తున్న వార్తలతో మంత్రి పదవుల మీద మక్కువ పెంచుకుని ఆశగా ఎదురుచూస్తున్న వారు ఇపుడు తెగ ఉత్సాహపడుతున్నారుట. చూడాలి మరి ఏమి జరుగుతుందో.