'ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా'.. ఫస్ట్ నైట్ గదిలో కత్తితో భార్య..!

ఈ క్రమంలో... ఓ నవ వధువు మొదటి రాత్రి గదిలోకి పాల గ్లాసు బదులు కత్తి తీసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.;

Update: 2025-06-25 15:30 GMT

ఇటీవల దంపతుల మధ్య జరుగుతున్న ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా, మరింత ఆందోళనగా మారుతున్న సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు వరుస ఘటనలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా పెళ్ళిన మొదటి రాత్రి గదిలోకి కత్తి తీసుకెళ్లి 35 ముక్కలుగా నరికేస్తా అంటూ భర్తను బెదిరించిన ఓ నవ వధువు వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... హనీమూన్‌ లో భర్తను చంపించిన ఇండోర్‌ యువతి సోనమ్‌ రఘువంశీ ఉదంతం ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనను మరువకముందే దాదాపు ఈ తరహాలోనే పలు ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో... ఓ నవ వధువు మొదటి రాత్రి గదిలోకి పాల గ్లాసు బదులు కత్తి తీసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌ రాజ్‌ కు చెందిన నిషాద్‌ అనే వ్యక్తికి ఇటీవల సితార అనే యువతితో వివాహమైంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లిలో... వధువు ఎంతో ఆనందంగా కనిపించింది. అంతవరకూ బాగానే ఉంది కానీ... మొదటి రాత్రి మాత్రం వింతగా ప్రవర్తించింది. గదిలోకి కత్తి తీసుకుని వెళ్లింది.

మొదటిరాత్రి పాల గ్లాసుతో సిగ్గుపడుతూ రావాల్సిన భార్య.. కత్తితో ఎంట్రీ ఇచ్చేసరికి నవ వరుడు షాక్ తిన్నాడు. ఈ సందర్భంగా.. ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చిన ఆ వధువు... తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను అమన్‌ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పి.. ఈ సమయంలో 'నన్ను తాకితే.. 35 ముక్కలు చేస్తా' అంటూ బెదిరించింది.

అక్కడితో ఆగలేదు ఆమె దూకుడు! తాను ఇలా బెదిరించానన్న విషయం బయటకు చెబితే తప్పుడు కేసు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడింది. దీంతో ఈ విషయం సదరు భర్త కుటుంబ సభ్యులకు చెప్పుకోవడంతో మరుసటిరోజు గ్రామంలో పంచాయతీ పెట్టించారు. ఈ పంచాయతీలో.. సితారకు ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో నిషాద్‌ ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.

అయినప్పటికీ ఆమె తగ్గేదేలే అంటూ భర్తను వేధించడం మొదలుపెట్టింది. ఇక చేసేది లేక వరుడి కుటుంబం నేరుగా పోలీసులను ఆశ్రయించింది. దీంతో... కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. సరిగ్గా ఈ సమయంలో.. తన ప్రియుడు అమన్‌ తో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది సితార. దీంతో.. ప్రస్తుతం పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

Tags:    

Similar News