బీహార్ రిజల్ట్ కేంద్రానికి ఎఫెక్ట్ ....బీజేపీ లెక్కలేంటి ?
ఇక కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏపీ నుంచి చంద్రబాబు తెలుగుదేశం బీహార్ నుంచి నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ సపోర్టుతో బండి లాగిస్తోంది. ఈ రెండు పార్టీలకు కలసి 28 మంది ఎంపీల మద్దతు ఉంది.;
బీహార్ ఎన్నికలు ఇపుడు కేంద్రంలోని ఎన్డీయే కూటమికి నేరుగా ఎఫెక్ట్ అవుతాయా అంటే సాధారణంగా చూస్తే అలా జరగకూడదు. ఎందుకంటే 2024లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్ డీయే సర్కార్ ఏర్పడింది. ఇక 2020 నవంబర్ లో ప్రజలు ఎన్నుకున్న ఎన్డీయే ప్రభుత్వం బీహార్ లో అయిదేళ్ళు పాలించింది. అయితే ఈసారి ఎన్నికల్లో బొమ్మ తిరగబడుతుందా నితీష్ కుమార్ మీద యాంటీ ఇంకెంబెన్సీ తీవ్రంగా పెరిగిపోయిందా నరేంద్ర మోడీ ఇమేజ్ మ్యాజిక్ పనిచేస్తుందా ఇవన్నీ ప్రశ్నలు. అయితే బీహార్ ఎన్నికలతో ముండి పెట్టి కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఢీ కొడుతున్నదెవరు. అసలు జాతీయ మీడియాలో బీహార్ ఎన్నికల తరువాత మొత్తం కేంద్ర రాజకీయం మారుతుంది అన్న జోస్యాలు ఏమిటి అసలు ఏమి జరుగుతోంది. ఈ మొత్తం మీద పూర్తి అవగాహన ఉన్న బీజేపీ లెక్కలేంటి అన్నది వేడి వేడి చర్చగా ఇపుడు ముందుకు వస్తోంది.
అలాంటి సీన్ ఉందా :
బీహార్ లో ఎన్డీయే కూటమి ఓడే సీన్ ఉందా అన్నది ఇపుడు అసలైన చర్చ. నిజానికి చూస్తే హోరా హోరీ పోరు అక్కడ జరుగుతుందని ప్రీ పోల్ సర్వేలు అయితే స్పష్టంగా చెబుతున్నాయి. గతం కంటే మహా ఘట్ బంధన్ బాగా పుంజుకుంది అని సర్వేలు చెబుతున్నాయి. అంతే కాదు దాదాపుగా అరవై నుంచి డెబ్బై నియోజకవర్గాల పరిధిలో ప్రభావితం చేస్తే ముస్లిం సామాజిక వర్గం ఒక కీలక డెసిషన్ తీసుకున్నారు తీసుకుందని అది కూడా మహా ఘట్ బంధన్ కి అనుకూలిస్తుంది అని అంటున్నారు. రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర ప్రభావం కూడా కలసి వస్తుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో కొద్దో గొప్పో ఈ రోజుకు అయితే మహా ఘట్ బంధన్ కే మొగ్గు ఉందని అంటున్నారు.
ఓడితే సీన్ ఎలా :
ఇక ఈ ప్రీ పోల్ సర్వేల అంచనాలే నిజం అయి ఎన్డీయే కూటమి ఓటమి పాలు అయితే అపుడు పరిస్థితులు ఎలా ఉంటాయన్నది కూడా హాట్ హాట్ టాపిక్ గా ఉంది. ఇదే ఇపుడు జాతీయ మీడియాలో కూడా రకరకాలైన విశ్లేషణలతో ముందుకు వస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ లో ఎన్డీయే ఓటమి పాలు అయితే నితీష్ కుమార్ మాజీ సీఎం అవుతారు. ఆయన అధికారం కోల్పోయి ఖాళీ అవుతారు అని అంటున్నారు. 2005 నుంచి 2025 దాకా రెండు దశాబ్దాలకు రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగానే నితీష్ పనిచేశారు. ఇపుడు ఆయన ఖాళీగా ఉంటే ఎలా అన్నది చర్చ. ఆయన జేడీయూకి చెందిన ఎంపీలు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. వారు 12 మంది దాకా ఉన్నారు. దాంతో నితీష్ కి కేంద్రంలో చోటు కల్పిస్తారా అన్నది మరో చర్చ. అలా కల్పించిన చోటుతో నితీష్ సర్దుకుంటారా లేక నేరుగా ఉప ప్రధాని పొజిషన్ అడుగుతారా అన్నది మరో చర్చట. ఇవన్నీ ఊహాగానాలే కానీ ప్రచారంలో మాత్రం ఉంటున్నాయి.
ఊత కర్ర ఆసరాతో :
ఇక కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏపీ నుంచి చంద్రబాబు తెలుగుదేశం బీహార్ నుంచి నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ సపోర్టుతో బండి లాగిస్తోంది. ఈ రెండు పార్టీలకు కలసి 28 మంది ఎంపీల మద్దతు ఉంది. అయితే నితీష్ ప్రభుత్వం కనుక బీహార్ లో ఓడితే జేడీయూ తీరు వేరుగా ఉంటుందని ఊహాగానాలను అయితే ఒక వర్గం మీడియా జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తోంది. అంటే ఆయన కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి వైపు వెళ్ళినా వెళ్తారు అన్నది ఆ గాసిప్స్ లోని సారాంశం, మరి అదే ఏపీకి చెందిన చంద్రబాబు ఏమి చేస్తారు అన్న దాని మీద కూడా చర్చ సాగుతోంది. అయితే ఏపీలో టీడీపీ కచ్చితంగా ఎన్డీయేకు మద్దతు ఇస్తుంది అని అంటున్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కూడా బలంగా ఉండడం వల్ల కూటమి ప్రభుత్వం ఏపీ అభివృద్ధి అవసరాలు ఫ్యూచర్ పాలిటిక్స్ ఇవన్నీ కలిపి ఏపీ మీద ఎవరికీ డౌట్లు అయితే లేవు.
ఎన్డీయే కనుక గెలవకపోతేనే :
కానీ నితీష్ కనుక మాజీ సీఎం అయితే ఆ పన్నెండు ఎంపీ సీట్లు ఎన్డీయేకు కోత పడతాయని జాతీయ స్థాయిలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రచారం చేస్తోంది. ఇక బీహార్ లో కాంగ్రెస్ నేతలు అయితే బీహార్ లో ఎన్డీయేని ఓడిస్తే జాతీయ స్థాయిలో కూడా ఈ ఓటే బ్రహ్మాస్త్రం అవుతుంది, ప్రభావం చూపిస్తుంది అని గట్టిగా ప్రచారం చేస్తుంది. నిజానికి ఆ విధంగా అవుతుందా ఈ ఊహాగానాలు నిజమవుతాయా అన్నది చూడాలి. ఇక బీహార్ లో నితీష్ ని తెగ పొగుడుతూ తాజాగా మోడీ సభలు నిర్వహిస్తున్నారు. నితీష్ కూడా తన జీవితంలో ఎన్డీయేను వీడిపోను అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే బీజేపీ కూడా ఒకటి పది సార్లు లెక్కలు చూసుకుంటోంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే బీహార్ ఎన్నికలు నవంబర్ లో జరుగుతాయి, ఫలితాలు వచ్చిన తరువాతనే చూడాలి, ఎన్డీయే కనుక గెలవకపోతేనే ఈ ఊహాగానాలకు తెర లేస్తుంది అని అంటున్నారు.