నవంబర్ 5 నుంచి 15 మధ్యలో బీహార్ ఎన్నికలు

దేశంలో ఇపుడు అందరినీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఆకర్షిస్తున్నాయి. రెండు ప్రధాన జాతీయ కూటములు భారీ ఎత్తున మోహరించే ఎన్నికలుగా వీటిని చూస్తున్నారు.;

Update: 2025-09-22 08:30 GMT

దేశంలో ఇపుడు అందరినీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఆకర్షిస్తున్నాయి. రెండు ప్రధాన జాతీయ కూటములు భారీ ఎత్తున మోహరించే ఎన్నికలుగా వీటిని చూస్తున్నారు. దేశంలో రాజకీయం వేడెక్కి ఉన్న నేపథ్యంలో ఏ ఎన్నిక అయినా భారీ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తోంది. రాజ్యాంగబద్ధ పదవి అయిన ఉప రాష్ట్రపతి ఎన్నికలను సైతం హోరా హోరీ పోటీగా మార్చిన రాజకీయం ఇపుడు దేశవ్యాప్తంగా సాగుతోంది. అలాంటిది ఉత్తరాదిన హార్ట్ లాంటి ఒక రాష్ట్రంలో హిందీ బెల్ట్ లో కీలకమైన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అంటే ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు.

అక్టోబర్ లో షెడ్యూల్ :

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. పది రోజుల పాటు ఇవి ఉత్సాహంగా సాగుతాయి. అదే సమయంలో జీఎస్టీ రెండవ తరం సంస్కరణలు మీద బీజేపీ భారీ కాంపెయిన్ కూడా 22 నుంచే స్టార్ట్ అయింది. ఇది నెల్లాళ్ళ ప్రోగ్రాం. అయితే తొలి పదిహేను రోజులూ పీక్స్ కి దీనిని చేర్చే విధంగా డిజైన్ చేశారు. దాంతో బీహార్ లో ఎన్నికల షెడ్యూల్ ని అక్టోబర్ మొదటి వారంలో ప్రకటిస్తారు అని అంటున్నారు. అంటే ఎన్నికలకు నెల రోజుల ముందు అన్న మాట.

నవంబర్ లో సమరం :

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ లో ఉండొచ్చు అన్నది ఒక అంచనా. ఎలా అంటే ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22 తో పూర్తి అవుతుంది. దాంతో అంతకు ముందే ఎన్నికలు జరిపించి కొత్త శాసన సభను కులువు తీరేలా చేయాలి. దాంతో నవంబర్ మొదటి వారం నుంచి మూడో వారం లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి. దాంతో సరైన తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. అలా నవంబర్ 5 నుంచి 15 మధ్యలో మూడు దశలుగా బీహార్ లో ఎన్నికలు జరుగుతాయని ప్రచారం సాగుతోంది. ఆ మీదట 20 లోగా ఫలితాలు ప్రకటించి మొత్తం ప్రక్రియను ముగిస్తారు. వెనక్కి వెళ్తే 2020 లో బీహార్ ఎన్నికలు అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 ఇలా మూడు దశలలో నిర్వహించి ఫలితాలను నవంబర్ 10న ప్రకటించారు.

హోరా హోరీ పోరుగా :

ఇదిలా ఉంటే బీహార్ ఎన్నికల కోసం ఇండియా కూటమి చాలా కాలంగా ఫోకస్ పెట్టింది. ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. రాహుల్ గాంధీ ఓట్ అధికార్ యాత్ర అయినా ప్రియాంక గాంధీ త్వరలో చేయబోయే హర్ ఘర్ అధికార్ యాత్ర అయినా బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే అని అంటున్నారు. బీహార్ లో వరసబెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శ్రీకారం చుడుతున్నారు. ఆయన గత పదిహేను రోజుల వ్యవధిలోనే రెండు సార్లు రాష్ట్రానికి వెళ్ళారు. రానున్న రోజులలో మరిన్ని పర్యటనలు ఉంటాయని అంటున్నారు. బీహార్ ని ఎట్టి పరిస్థితిల్లోనూ వదిలేది లేదని మరో మారు అధికారం తమదే అని ఎన్డీయే అంటోంది. మొత్తానికి చలి కాలం ప్రవేశించిన తరువాత బీహార్ రూపంలో దేశ రాజకీయం వేడెక్కిపోయేలా ఎన్నికలు జరగనున్నాయి అని అంటున్నారు.

Tags:    

Similar News