కిలో మీటర్ కు వందల్లో వసూలు.. బెంగళూర్ ఆటో ఛార్జిల మోత..
ఇటీవల బెంగళూర్ వాసి రెడిట్ ఆర్/బెంగళూర్ వెబ్ సైట్ లో ఒక పోస్ట్ వేశాడు. ఇది చాలా వైరల్ గా మారింది. భారీ వర్షాలు కురుస్తున్నందున ఒక ఉద్యోగి క్యాబ్ లో ఆటోను బుక్ చేసుకున్నాడు.;
కిలో మీటర్ కు ప్రయాణానికి ఎంత అవుతుంది. చాలా వరకు పదుల్లోనే ఉంటుంది. రూ. 10 కావచ్చు.. లేదంటే మినిమన్ చార్జి కింద రూ. 30 లేదంటే ఎక్కువ, తక్కువ కావచ్చు. కానీ వందల్లో మాత్రం అవదు.. సరే ప్లేస్ ను బట్టి చార్జి అనుకుందామా అంటే.. భారత్ లో ఏ ప్లేస్ లో కిలో మీటర్ ప్రయాణికి వందల్లో ఉంటుంది? ఉండలేదుగా.. అయితే ఇప్పుడు మరో విధంగా చూద్దాం. ఒక ఆటోలో ఒక్కరే ఎక్కితే (లేదంటే బుక్ చేసుకుంటే) కిలో మీటరుకు ఎంతవుతుంది? అది కూడా తక్కువనే కదా.. ఒకరి కంటే ఎక్కువ మంది కూర్చుండడం వేరు. ఇక క్యాబ్ కు సంబంధించి తెలుసుకుంటే కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. కానీ ఇక్కడ ఒక కిలో మీటరు ప్రయాణికి ఎంత తీసుకున్నారో తెలిస్తే షాక్ కావాల్సిందే..
రెడిట్ ఆర్ లో పోస్ట్ వైరల్..
ఇటీవల బెంగళూర్ వాసి రెడిట్ ఆర్/బెంగళూర్ వెబ్ సైట్ లో ఒక పోస్ట్ వేశాడు. ఇది చాలా వైరల్ గా మారింది. భారీ వర్షాలు కురుస్తున్నందున ఒక ఉద్యోగి క్యాబ్ లో ఆటోను బుక్ చేసుకున్నాడు. అతను వెళ్లాల్సిన డెస్టినేషన్ కేవలం కిలో మీటర్ దూరం మాత్రమే ఉంది. దీనికి ఆటో రూ. 425 కోట్ చేసింది. ఇదే దూరానికి కారును బుక్ చేసుకుంటే ప్రయాణ ఛార్జీలు రూ. 364 గా ఉంది. ఆయన ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ఆటో కంటే కారేనయం కదా.. మరి ఆటోకే ఎక్కువ ఛార్జిలు ఎందుకు వసూలు చేస్తున్నారంటూ పోస్ట్ లో ప్రశ్నించాడు.
ఆసక్తి రేపుతున్న నెటిజన్ల కామెంట్స్..
ఆయన పోస్ట్ ను చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘నా స్నేహితుడు స్వగ్రామానికి వెళ్లేందుకు బస్టాండ్ వరకు వెళ్తానని చెప్పగా.. కొద్దిగా వర్షం పడుతుండడతో ఆటో బుక్ చేయాలని అనుకున్నాను. ఛార్జీలు చూసి బిత్తరపోయాను. ఇక సెల్ పక్కన పడేసి గొడుగు పట్టుకొని నడవడం మొదలు పెట్టాం’ అని సమాధానం ఇచ్చాడు. ఛార్జీల గురించి ఆన్ లైన్ లో ఒక దుమారమే రేగింది. కొంత మంది నెటిజన్లు బెంగళూరు ధరలను ‘మొదటి ప్రపంచ దేశాలతో’ పోల్చారు, జర్మనీలో టాక్సీ రైడ్లకు దాదాపు సమానంగా ఖర్చవుతుందని ఎత్తి చూపారు. ఇంకొందరు ‘ఆటో కొనేందుకు ఇదే సరైన సమయం’ అని చమత్కారంగా పోస్ట్ పెట్టారు. ‘ఈ ఛార్జీలు అమెరికాలో నేను చెల్లించే ఛార్జీలతో సమానంగా ఉన్నాయి’ అని మరొకరు చెప్పారు. 13 మిలియన్లకు పైగా నివాసితులు, లక్షలాది వాహనాలు ఇరుకైన రోడ్లపైకి రావడంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.