ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధాన్ని బాస్మతి రైస్ ముందే చెప్పిందా...?

ప్రపంచవ్యాప్తంగా అత్యంత రుచికరమైన, క్వాలిటీ బాస్మతి బియ్యానికి భారత్‌ పెట్టింది పేరు. ఈ రకం బియ్యం ఎగుమతుల్లో భారత్ ముందంజలో ఉంది.;

Update: 2025-06-17 15:03 GMT

ప్రపంచవ్యాప్తంగా అత్యంత రుచికరమైన, క్వాలిటీ బాస్మతి బియ్యానికి భారత్‌ పెట్టింది పేరు. ఈ రకం బియ్యం ఎగుమతుల్లో భారత్ ముందంజలో ఉంది. ప్రధానంగా ముస్లిం కట్రీస్ లో బిర్యానీకి ఈ బాస్మతి రైస్‌ నే వాడతారు. అందుకే ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా గల్ఫ్‌ కంట్రీస్‌ లో వీటికి ఫుల్ డిమాండ్‌ ఉంటుంది. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ఈ బియ్యం ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి.

అవును... భారత్‌ నుంచి బాస్మతి కొనుగోలు చేస్తున్న దేశాల్లో సౌదీ అరేబియా, ఇరాక్ దేశాలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. ఇరాన్‌ మూడో స్థానంలో ఉంది. 2024-25లో ఇరాన్‌ కు రూ.6,374 కోట్ల విలువైన బియ్యం ఎగుమతి అయింది. అయితే.. తాజా ఘర్షణల వల్ల ఒక టన్ను బియ్యం ధర 950 - 1,000 డాలర్ల నుంచి 900 - 950 డాలర్లకు పడిపోయిందని అంటున్నారు.

వాస్తవానికి గత రెండు నెలల్లో బాస్మతి ధరలు 15 - 20% పెరిగాయి. అయితే.. ఏప్రిల్‌ లో ఒక కేజీ ధర రూ.75 - 90కి పడిపోయినప్పుడు మాత్రం గల్ఫ్‌ దేశాలు భారీగా కొనుగోలు చేశాయి. ఈ నేపథ్యంలో.. మే నెలలో డిమాండ్ పెరగడంతో ధరలు మళ్లీ రికవర్‌ అయ్యాయి. అయితే ప్రస్తుత ఘర్షణల ప్రభావంతో ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

దీంతో రైతులతో పాటు ఎగుమతుల వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్పందించిన మహారాష్ట్రకు చెందిన ట్రేడర్‌ ధవల్ షా.. ఇరాన్‌ - ఇజ్రాయెల్‌ ఘర్షణల భయంతో మే నెలలో కొనుగోళ్లు పెరిగాయని.. ఇప్పుడు పరిస్థితి తీవ్రం కావడంతో అక్కడ కొనుగోళ్లు తగ్గాయని.. ఫలితంగా ఎగుమతులు తగ్గి ధరలపై ప్రభావం పడుతోందని అన్నారు.

దీంతో... నేడు జరుగుతున్న ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధాన్ని మే నెలలో కొనుగోళ్లు పెరుగుదలతో భారత్ బాస్మతి రైస్ చెప్పకనే చెప్పిందనే చర్చ నెట్టింట మొదలైంది. ప్రస్తుతం ఆ ఉద్రిక్తతలు తగ్గితే.. ఎగుమతులు పెరుగుతాయి. అలాకానిపక్షంలో.. భారత్ లో బాస్మతి రైస్ నిల్వలు పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు!

Tags:    

Similar News