రఘురామకు సునీల్ కుమార్ ఓపెన్ చాలెంజ్ !
అయితే ఈ పోటీలో తాను రఘురామ మీద వేయి కోట్లు ఎక్కువగా తెచ్చుకోకపోతే ఇక మీదట రాజకీయాలు మాట్లాడను అని సునీల్ కుమార్ అన్నారు.
ఏపీలో ఉప సభాపతి రఘురామ క్రిష్ణంరాజు, అలాగే ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ల మధ్య డైలాగ్ వార్ ఒక రేంజిలో సాగుతున్న సంగతి తెలిసిందే. రఘురామ ఒకటి అంటే పీవీ సునీల్ రెండు అంటున్నారు. ఈ ఇద్దరి మధ్యన డైలాగ్ వార్ కాస్తా కేసులు సామాజిక అంశాలు దాటి ఇపుడు రాజకీయ సమరానికి వేదికగా మారబోతోందా అన్న కొత్త చర్చ మొదలైంది. రఘురామ క్రిష్ణంరాజుకి తాజాగా పీవీ సునీల్ కుమార్ ఓపెన్ చాలెంజ్ విసిరారు. మీరు మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి, ఉప ఎన్నికల్లో మీరు వైసీపీతో సహా అన్ని పార్టీల మద్దతుని తీసుకుని మరీ బరిలో నిలవండి, నేను ఒంటరిగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను, మీ మీద కనీసం వేయి కోట్లు అయినా ఎక్కువగా నేను సాధించి గెలిచి నిలవకపోతే నో పాలిటిక్స్ అంటూ ఒక పవర్ ఫుల్ సవాల్ నే విసిరారు.
సత్తా తేల్చాల్సిందే :
ఈ మధ్యన రఘురామ ఒక టీవీ చానెల్ లో మాట్లాడుతూ జడ శ్రావణ్ కుమార్, అలాగే విజయ్ కుమార్ పోటీ చేస్తే పెద్దగా ఓట్లు రాలేదని సునీల్ కుమార్ కూడా పోటీ చేస్తే ఒక అయిదారు వందల ఓట్ల దాకా వస్తాయా అని కామెంట్ చేస్తారని సునీల్ కుమార్ అన్నారు. అందుకే ఆయన మాట మీద నిలబడాలని రాజీనామా చేసి ఉప ఎన్నికలు ఉండి నియోజకవర్గంలఒ తెస్తే ఎవరేమిటో తేలిపోతుందని అన్నారు. తనకు జన బలం లేదని నిరూపించేందుకు ఇది మంచి అవకాశంగా రఘురామ తీసుకోవచ్చు అన్నారు. అలాగే నూటికి 80 శాతం తమ వైపు ఇరవై శాతమే అవతల వైపు ఉన్నారని చెబుతున్న రఘురామ సిద్ధాంతం కూడా ఏమిటో తెలుస్తుందని కూడా అన్నారు.
కండిషన్స్ అప్లై :
అయితే ఈ పోటీలో తాను రఘురామ మీద వేయి కోట్లు ఎక్కువగా తెచ్చుకోకపోతే ఇక మీదట రాజకీయాలు మాట్లాడను అని సునీల్ కుమార్ అన్నారు. అదే రఘురామ ఓటమి చెందితే రాజకీయాల గురించి మాట్లాడకుండా ఉంటారా అని ప్రశ్నించారు. ఈ కండిషన్లకు కూడా రెడీ అయి పోటీకి సిద్ధపడాలని ఆయన కోరారు.
మీకు తెలియదేమో అంటూ :
ఇక సునీల్ కుమార్ తన బలాన్ని కూడా పరోక్షంగా తాను విడుదల చేసిన తాజా వీడియో బైట్ లో తెలియచేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఒకాయన తన పేరు చెప్పుకుని ఓపెన్ సీట్లో ఇండిపెండెంట్ గా నిలబడి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిచారని చెప్పారు. అలాగే నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఒకాయన తన ఫోటో పెట్టుకుని ఇండిపెండెంట్ గా పోటీ చేసి అయిదు వేల ఓట్లను సాధించారు అని పీవీ సునీల్ కుమార్ గుర్తు చేశారు. బహుశా ఇవేమీ రఘురామ క్రిష్ణంరాజుకు తెలియవేమో అని సెటైర్లు వేశారు. మొత్తానికి చూస్తే పీవీ సునీల్ కుమార్ తనకు రాజకీయంగా సత్తా ఉందని చెప్పకనే చెబుతున్నారు. అంతే కాదు రఘురామతో పోటీ చేసి ఢీ కొట్టాలని కూడా చూస్తున్నారు. మరి ఈ ఓపెన్ చాలెంజ్ కి రఘురామ క్రిష్ణంరాజు రెడీనా కాదా అన్నది చూడాల్సి ఉంది. సో వెయిట్ అండ్ సీ.