కూటమి సర్దుబాటు సక్సెస్...రెండు రోజులలో లిస్ట్ !

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చింది అని అంటున్నారు.

Update: 2026-10-14 15:29 GMT

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చింది అని అంటున్నారు. మిత్రులు ఎక్కువగా సీట్లు డిమాండ్ చేస్తున్నారు అని పీటముడి పడింది అని ప్రచారం సాగుతున్న నేపధ్యంలో చర్చలు అంతా సానుకూలం అని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రకటించడం విశేషం. ఎంతో ఉత్కంఠగా కూటమిలోని మూడు పార్టీల నేతలు క్యాడర్ అంతా ఎదురుచూస్తున్న నేపద్యంలో బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు అయితే ఇపుడు వైరల్ అవుతున్నాయి. చర్చలు సఫలం అయ్యాయని ఆయన చెప్పడంతో ఇక కూటమిగానే పోటీకి దిగుతారు అని అంటున్నారు.

విభేదాలు లేవంటూ :

కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సీట్లు కాదు, గెలుపు ప్రధానం అన్నారు. అదే సమయంలో కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పోటీ చేస్తామని చెప్పారు. ఎవరికి బలం ఎక్కడ ఉంటే అక్కడ బరిలోకి దిగుతారని ఆయన స్పష్టం చెశారు ఇక ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది అన్నది రెండు రోజులలో ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన సమన్వయ సమావేశం సాఫీగా ముగిసింది అని అంటున్నారు.

మెజారిటీ సీట్లలో గెలుపు :

తామంతా కలిసి చర్చించింది గెలుపు కోసమే అని బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. ఎలాంటి పర్సంటేజీల కోసం చర్చించలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. కలిసి పోటీచేస్తామని మెజారిటీ సీట్లు గెలుస్తామని ఆయన చెప్పడంతో కూటమి వర్గాలలో హర్షం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే కూటమి 40 శాతం సీట్లు కోరుతోందని అలాగే ఆరేడు మేయర్ పదవులు జెడ్పీ పీఠాలు కూడా అధికంగా తమ వాటా కోసం కోరుతోంది అని ప్రచారం సాగుతూ వచ్చింది. దానికి బొలిశెట్టి శ్రీనివాస్ తాజా వ్యాఖ్యలతో ఫుల్ స్టాప్ పెట్టేశారు అని అంటున్నారు.

సింగిల్ లిస్ట్ తోనే :

కూటమిగా సింగిల్ లిస్ట్ తోనే వస్తామని నేతలు చెబుతున్నారు. టీడీపీ పెద్దన్నగా ఉన్న కూటమిలో సహజంగా ఎక్కువ సీట్లు పోటీ చేస్తుంది అని అంటున్నారు. జనసేనకు కూటమి సర్దుబాటుని గౌరవిస్తూనే క్యాడర్ మనోభావాలను దృష్టిలో ఉంచుకుని సముచితమైన స్థానాన్ని ఇస్తుందని చెబుతున్నారు. అలాగే బీజేపీ బలాన్ని కూడా గుర్తించి వారికి ఇవ్వాల్సిన వాటా ఇస్తారని చెబుతున్నారు. దాంతో కూటమిగా సింగిల్ లిస్ట్ రిలీజ్ చేయడం ద్వారా 2024 సార్వత్రిక ఎన్నికల్లో చేసినట్లుగా కూటమి ఐక్యతను కాపాడుకుంటూ ఈసారి ఎన్నికల్లోనూ సెంట్ పర్సెంట్ స్టైక్ రేట్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అని అంటున్నారు.

పట్టు విడుపులతోనే :

కూటమిగా పార్టీలు ఉండడం అన్నదే ప్రధానం. పొరపొచ్చాలు అన్నవి కనుక వస్తే అది పొత్తుల స్నేహాలను బీటలు వార్చి గ్రౌండ్ లెవెల్ లో ఇబ్బందులు తెస్తుంది. అందుకే అలాంటి ప్రతికూల వాతావరణం అసలు రాకుండా చూసుకోవాలని కూటమి పార్టీలు నిర్ణయించాయని అంటున్నారు. మూడు పార్టీలు వివేచనతో ఆలోచించడమే కూటమి ఐక్యతకు అసలైన బలం అని అంటున్నారు. ఇక స్థానిక ఎన్నికల్లో కూటమి కలసికట్టుగా వస్తే మరోసారి 2024 సక్సెస్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని అంటున్నారు.

Tags:    

Similar News