ఎమ్మెల్యేలకు భయపడి బార్ లకు బిడ్ వేయలేదా ?

ఏపీలో బార్ల లైసెన్స్ దరఖాస్తు గడువు చూస్తే సరిగ్గా శుక్రవారం రాత్రి పది గంటలతో ముగిసింది. అంటే ఆగస్ట్ 29తో అన్న మాట.;

Update: 2025-08-30 03:45 GMT

ఏపీలో ఏమి జరుగుతోంది. బార్లకు లైసెన్స్ అంటే తోసుకు వచ్చేసే వారు ఎంతో మంది ఉంటారు. అన్ని వ్యాపారాలలలో కల్లా మద్యం వ్యాపారం భద్రం, సుఖం, లాభం అన్నది అందరి కంటే బిడ్డర్లకే బాగా తెలుసు. బార్లా బార్లు తెరిచేసి ఆపైన దర్జాగా బిజినెస్ లాగించే బాపతునే ఇప్పటి దాకా ఆంధ్ర జనాలు అంతా చూశారు. కానీ బార్లకు లైసెన్సులు కావాలా అంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నుంచి కనీసంగా కూడా బిడ్లు పడకపోవడం ఏమిటి అని అంతా చర్చించుకుంటున్నారు. అసలు దీని భావమేమిటి అన్నది కూడా కాస్తా లోతుగా వెళ్ళి మరీ ఆలోచిస్తున్నారు.

ఇదీ పరిస్థితి :

ఏపీలో బార్ల లైసెన్స్ దరఖాస్తు గడువు చూస్తే సరిగ్గా శుక్రవారం రాత్రి పది గంటలతో ముగిసింది. అంటే ఆగస్ట్ 29తో అన్న మాట. కొత్త బార్ పాలసీని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకుని వచ్చిన నేపథ్యంలో స్పందన ఈ విధంగా నీరసంగా ఉంది ఈ పాలసీ ప్రకారం ఒక్క బార్ కి కనీసం నాలుగు దరఖాస్తులు వచ్చినా కూడా లాటరీ తీసి సదరు వ్యక్తికి బార్ లైసెన్స్ ఇస్తారు అయితే ఏపీ వ్యాప్తంగా చూస్తే మొత్తం 840 బార్లు ఉంటే అందులో 367 బార్లకు మాత్రమే నాలుగు కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని చెబుతున్నారు. అంటే మెజారిటీ బార్లకు కనీసంగా కూడా దరఖాస్తులు రాలేదన్న మాట. సో వీటికే లాటరీ తీసి ఎవరికి వస్తే వారికి బార్ లైసెన్స్ ఇస్తారని అంటున్నారు.

ఎందుకలా జరిగింది :

అసలు ఎందుకు ఇలా జరిగింది బార్ల లైసెన్సుల మీద ఎందుకు ఇంత వైరాగ్యం వచ్చింది అన్నది కనుక తరచి ఆలోచిస్తే ఎన్నో విషయాలు విశ్లేషణలు ముందుకు వస్తున్నాయి. ఏకంగా 473 బార్లకు కనీస మాత్రంగా దరఖాస్తులు పడలేదు అంటే వెనక ఏమి జరిగి ఉంటుంది అన్నదే ఇపుడు అతి పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు పోటా పోటీగా ఈ బార్ల లైసెన్సుల కోసం వ్యవహారం ఉండేది. కానీ ఇపుడు చూస్తే చాలా దూరం పాటిస్తున్నారు.

ఎమ్మెల్యేలకు భయపడేనా:

బార్ల లైసెన్సులు తీసుకోవడానికి ఇపుడు కూడా చాలా మందికి ఉత్సాహం ఉంది అయితే ఇపుడు దాదాపుగా చాలా చోట్ల ఎమ్మెల్యేలదే రాజ్యంగా వ్యవహారం నడుస్తోంది. వారి కనుసన్నల్లో లిక్కర్ ల్యాండ్ సాండ్ వంటివి అన్నీ సాగుతున్నాయని అంటున్నారు. అలా యధేచ్చగా ఏకచత్రాధిపత్యంగా సాగిపోతున్న దందాలోకి ఎవరు డేరింగ్ గా ముందుకు వస్తారు అని అంటున్నారు. అంటే ఎమ్మెల్యేలకు భయపడి చాలా మంది వెనక్కి తగ్గిపోయారు అని ప్రచారం అయితే సాగుతోంది అలా వెనక్కి తగ్గిన చోట తమకు అనుకూలంగా వ్యవహారం చేసుకుని బార్లను దక్కించుకోవాలన్న ఎత్తుగడ పెద్దలలో ఉందని అంటున్నారు.

కొత్త సన్నివేశాలేనా :

ఒకప్పుడు బార్ల లైసెన్సులు అంటే ఎగబడి వచ్చేవారు. ఎవరికి తోచిన నంబర్ తో వారు బిడ్లు వేసుకునేవారు. ఆ మీదట వాటిని దక్కించుకునేవారు. అయితే ఇపుడు అంతా కొంతమంది పెద్దలు ఎమ్మెల్యేల పెత్తనంతోనే సాగుతోంది అని అంటున్నారు. అంతా వారు చెప్పినట్లుగానే సాగుతోంది అని అంటున్నారు. వారిని ప్రసన్నం చేసుకుని బిడ్లు వేయాల్సిన నేపథ్యం కూడా ఉంది అని అంటున్నారు. తీరా బిడ్లు వేసి లైసెన్సులు తెచ్చుకున్నా సుఖంగా వ్యాపారం చేయడానికి కూడా వీలు లేని వాతావరణం ఉంటుందని చాలా మంది భయపడుతున్నారు అని అంటున్నారు.

మొత్తంగా చూస్తే కనుక సామంతరాజులుగా కొందరు తమ ఏరియాలను శాసించడం వల్లనే బిడ్లకు దూరంగా అసలు సిసలు లిక్కర్ వ్యాపారులు కూడా ఉంటున్నారు అని అంటున్నారు. దీంతో తమ వారికి తాము చెప్పిన వారికి లైసెన్సులు దక్కించుకుని అనేక చోట్ల కధ సాగుతోందని అంటున్నారు. ఇవన్నీ ఎన్నడూ చూడని సన్నివేశాలుగా చెబుతున్నారు. అధినాయకత్వం ఎంత చెప్పినా కూడా కొందరు ఎమ్మెల్యేలు మాట వినే స్థితిలో లేరు అనడానికి నీరసంగా పడిన బిడ్లే ఉదాహరణ అని చెప్పుకుంటున్నారు. మరి దీని వల్ల సర్కార్ ఖజానాకు ఆదాయం పెరుగుతుందా లేక గండి పడుతుందా అంటే ఆ లెక్క వేరేగా చూడాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News