ఏపీ కేబినెట్ ఛేంజ్: లోకేష్ మార్క్.. పవన్ ప్లాన్.. బాబు స్ట్రాటజీ.. !
ఏపీ కేబినెట్‌లో త్వరలో జరగబోయే మార్పులు కేవలం మంత్రుల మార్పిడి మాత్రమే కాదు.. 2029 ఎన్నికల కోసం చంద్రబాబు వేస్తున్న బలమైన పునాదిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.;
ఏపీ కేబినెట్‌లో త్వరలో జరగబోయే మార్పులు కేవలం మంత్రుల మార్పిడి మాత్రమే కాదు.. 2029 ఎన్నికల కోసం చంద్రబాబు వేస్తున్న బలమైన పునాదిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి ప్రక్షాళనలో సరికొత్త సమీకరణాలు తెరపైకి రానున్నాయి. ఈ సారి మార్పుల్లో నారా లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపించనుంది. సీనియర్లను పార్టీ బాధ్యతలకు పరిమితం చేసి, యువ రక్తాన్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని బాబు యోచిస్తున్నారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని జనసేన నేతలకు కూడా ప్రాధాన్యత పెంచే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఉన్న రాజకీయ అసమతుల్యతను సరిదిద్దడానికి, సామాజిక సమీకరణాల్లో ప్రాధాన్యత దక్కని వర్గాలకు ఈ ప్రక్షాళనలో పెద్దపీట వేయనున్నారు. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తోన్న, అధికారులపై పట్టు సాధించలేని కొందరు మంత్రులకు ఈ సారి నిర్మొహమాటంగా చెక్ పెట్టాలని బాబు డిసైడ్ అయ్యారు. మొత్తానికి చంద్రబాబు తన మార్క్ అడ్మినిస్ట్రేషన్‌తో ప్రభుత్వంలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని చూస్తున్నారు.
మంత్రుల పనితీరుపై చంద్రబాబు వద్ద ఇప్పటికే 1, 2, 3 రేటింగ్స్ ఉన్నట్లు సమాచారం. శాఖలపై పట్టు లేనివారు, వివాదాల్లో ఉన్నవారికి ఈసారి ఉద్వాసన తప్పేలా లేదు. రాబోయే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా, పార్టీని క్షేత్రస్థాయిలో ఉరకలెత్తించే చురుకైన నేతలకు కేబినెట్‌లో చోటు కల్పించడమే బాబు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ సారి మార్పుల్లో జనసేన పార్టీ వరకు పవన్ కూడా పార్టీకి ప్లస్ అయ్యేలా తన పార్టీ మంత్రుల కూర్పును సెట్ చేయనున్నారు. ఈ సారి జనసేనకు మరో కేబినెట్ బెర్త్ అదనంగా దక్కనుంది.
అలాగే టీడీపీ వైపు నుంచి నారా లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపించనుంది. యువతకు ప్రాధాన్యత పెంచే క్రమంలో కొందరు సీనియర్లను పక్కన పెట్టనున్నారు. వీరికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు. పైగా నియోజకవర్గాలు భారీగా పెరగనున్న నేపథ్యంలోనూ కొందరిని పక్కన పెట్టేయనున్నారు. ఏదేమైనా ఈ కేబినెట్ ప్రక్షాళన తర్వాత కూటమి ప్రభుత్వం మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది.