సంక్రాంతి రేసులో రాజు గారు

టాలీవుడ్ లో త‌న కామెడీ టైమింగ్ తో స్పెష‌ల్ ఐడెంటిటీ సంపాదించుకున్న న‌వీన్ పోలిశెట్టి ఆఖ‌రిగా అనుష్క‌ తో క‌లిసి మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి సినిమాలో క‌నిపించి, సంద‌డి చేశాడు.;

Update: 2025-05-26 10:36 GMT
సంక్రాంతి రేసులో రాజు గారు

టాలీవుడ్ లో త‌న కామెడీ టైమింగ్ తో స్పెష‌ల్ ఐడెంటిటీ సంపాదించుకున్న న‌వీన్ పోలిశెట్టి ఆఖ‌రిగా అనుష్క‌ తో క‌లిసి మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి సినిమాలో క‌నిపించి, సంద‌డి చేశాడు. ఆ సినిమా త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు న‌వీన్ నుంచి మ‌రో సినిమా రాలేదు. ప్ర‌స్తుతం న‌వీన్ అన‌గ‌న‌గా ఒక రాజు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది కానీ మ‌ధ్య‌లో న‌వీన్ గాయ‌ప‌డ‌టం వ‌ల్ల షూటింగ్ ఆగిపోయింది.

మారి సెల్వ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమాను సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో సూర్య‌దేవ‌ర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మీనాక్షి చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్రీ వెడ్డింగ్ వీడియో రూపంలో గ్లింప్స్ ను రెడీ చేయ‌గా, అందులో న‌వీన్ కామెడీ టైమింగ్ మ‌రోసారి అంద‌రినీ ఆక‌ట్టుకుని సినిమాపై మంచి బ‌జ్ ను పెంచింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బ‌జ్ వినిపిస్తోంది. అన‌గ‌న‌గా ఒక రాజు రిలీజ్ డేట్ ను మేక‌ర్స్ వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావడానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. 2026, జ‌న‌వ‌రి 14న అన‌గ‌న‌గా ఒక రాజు రిలీజ్ కానుంద‌ని స‌మాచారం. సంక్రాంతికి సీజ‌న్ లో ఈ సినిమా వ‌స్తే అన‌గ‌న‌గా ఒక రాజుకు మంచి థియేట్రిక‌ల్ ర‌న్ ద‌క్కే ఛాన్సుంది.

టాలీవుడ్ లో సంక్రాంతి సీజ‌న్ కు చాలా మంచి బ‌జ్ ఉంటుంది. సంక్రాంతికి సెల‌వులుంటాయి కాబ‌ట్టి ఆ టైమ్ లో ఈ త‌ర‌హా ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ రిలీజై సినిమా ఓ మోస్త‌రు టాక్ తెచ్చుకున్నా ఆడియ‌న్స్ ఈ మూవీ కోసం థియేట‌ర్ల‌కు క్యూ క‌ట్ట‌డం ఖాయం. ఇదిలా ఉంటే వ‌చ్చే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మెగా157 కూడా రిలీజ‌వ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే అనౌన్స్ చేశారు. వీటితో పాటూ ఇంకా ఏయే సినిమాలు సంక్రాంతి రేసులో నిలుస్తాయో చూడాలి.

Tags:    

Similar News