70 ఎయిర్ ఇండియా విమానాలు రద్దు... షాకింగ్ రీజన్!!

ప్రధానంగా క్యాబిన్ సిబ్బందికి చెందిన ఉద్యోగులు చివ‌రి నిమిషంలో సిక్ లీవ్ తీసుకోవడంతో ఈ ఇబ్బంది వచ్చిందని అంటున్నారు.

Update: 2024-05-08 05:03 GMT

ఎయిర్ ఇండియా ఎక్స్‌ ప్రెస్ విమాన సంస్థకు పెద్ద సమస్య వచ్చి పడింది! ఫలితంగా ఆ సంస్థ విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఊహించని కష్టాలు తెరపైకి వచ్చాయని తెలుస్తుంది. దీనికి కారణం ఆ విమానయాన సంస్థకు చెందిన ఉద్యోగులు భారీగా సెలవులు పెట్టడమే అని తెలుస్తుంది. ఇలా ఎక్కువమంది ఉద్యోగులు ఒకేసారి సెలవులు పెట్టారని అంటున్నారు. దీంతో... ఇది ఏమైనా స్ట్రైక్ ఆలోచనా అనే చర్చా తెరపైకి వచ్చింది!

అవును... ఎయిర్ ఇండియా ఎక్స్‌ ప్రెస్ విమాన సంస్థకు చెందిన సీనియ‌ర్ సిబ్బంది ఒకేసారి సిక్ లీవ్ పెట్టారు! దీంతో మంగ‌ళ‌వారం రాత్రి నుంచి బుధ‌వారం తెల్లవారుజాము వరకు సుమారు 70 విమానాల‌ను సంస్థ ర‌ద్దు చేసిందని తెలుస్తుంది. ఇలా రద్దైన విమానాల్లో దేశీయ విమానాలతో పాటు అంతర్జాతీయ విమానాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. దీంతో ప్రయాణికుల్లో గందరగోల పరిస్థితులు తలెత్తాయని అంటున్నారు.

ప్రధానంగా క్యాబిన్ సిబ్బందికి చెందిన ఉద్యోగులు చివ‌రి నిమిషంలో సిక్ లీవ్ తీసుకోవడంతో ఈ ఇబ్బంది వచ్చిందని అంటున్నారు. ఫలితంగా... గ‌త రాత్రి నుంచి విమానాల రాక‌పోక‌ల‌కు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు! ఇదే సమయంలో.. ఇలా ఉద్యోగులు అంతా ఒకేసారి సిక్ లీవ్‌ లో ఎందుకు వెళ్లారో తెలియ‌డం లేద‌ని.. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సదరు ప్రతినిధి తెలిపారు!

ఈ పరిస్థితుల్లో ఇబ్బందులు పడిన వారికి రిఫండ్ ఇస్తున్నామని సంస్థ చెబుతుందని సమాచారం! లేదంటే ప్రయాణ తేదీని మార్చుకోవడం చేయ‌డం జ‌రుగుతుంద‌ని ఎయిర్ ఇండియా వెల్లడించింది.

Read more!

కాగా... గతంలో కూడా ఒకసారి ఎయిరిండియా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సందర్భంగా.. ఇండిగోకు చెందిన మెజార్టీ సిబ్బంది సెలవు పెట్టి వెళ్లి ఆ డ్రైవ్ లో పాల్గొనడంతో ఇండిగోకు చెందిన సుమారు 45శాతం విమానాల రాకపోకల్లో ఇబ్బందులు ఎదురైనట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే!

Tags:    

Similar News