పాన్ ఇండియా స్టార్ నెక్స్ట్ లాక్ అయినట్లేనా!
ఇదొక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అని సమాచారం. స్టోరీ విని యశ్ ఎంతో ఎగ్జైట్ అయ్యాడని...మరో మాట లేకుండి సింగిల్ సిట్టింగ్ లోనే ఒకే చేసినట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.;
పాన్ ఇండియా స్టార్ యశ్ రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కన్నడలో గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో `టాక్సిక్` లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. చిత్రీకరణ ప్రారంభమై కొన్ని నెలలు గడుస్తున్నా? షూటింగ్ ఎంత వరకూ పూర్తయింది? అన్నది ఇంత వరకూ అప్ డేట్ లేదు. దీనిపై రకరకాల ప్రచారాలు జురుగుతున్నాయి. చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుందన్నది ఓ ప్రచారమైతే? సగం షూటింగ్ కూడా పూర్తి కాలేదన్నది మరో ప్రచారం. ఇలా `టాక్సిక్` అప్ డేట్ పై కొంత సందిగ్దత నెలకొంది.
ఆ రెండు సినిమాలతో యశ్ బిజీ:
అలాగే బాలీవుడ్ లో రామాయణంలోనూ యశ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అందులో రావణుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియాలో భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్నాయి. మరి వీటి తర్వాత యశ్ నటించబోయే చిత్రంపై కూడా ప్రచారం జరుగుతోంది. `కేజీఎఫ్` తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నేపథ్యంలో ఈ రెండు రిలీజ్ ల తర్వాత యశ్ మళ్లీ లాంగ్ గ్యాప్ తీసుకుంటాడా? అన్న వార్తలొస్తున్న నేపథ్యంలో కొత్త ప్రాజెక్ట్ వివరాలు తెరపైకి వస్తున్నాయి. తమిళ దర్శకుడు మిత్రన్ తో ఓ సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు వినిపిస్తోంది.
ఆ కాంబోలో 300 కోట్ల ప్రాజెక్ట్:
ఇదొక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అని సమాచారం. స్టోరీ విని యశ్ ఎంతో ఎగ్జైట్ అయ్యాడని...మరో మాట లేకుండి సింగిల్ సిట్టింగ్ లోనే ఒకే చేసినట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ప్రధమార్ధంలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని యశ్-మిత్రన్ ద్వయం ప్లాన్ చేస్తోందిట. ఈ చిత్రాన్ని ఓ అగ్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తుందిట. బడ్జెట్ కూడా భారీగా ఉంటుందని సమాచారం. దాదాపు 300 కోట్ల ప్రాజెక్ట్ గా తెరపైకి వస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజా నిజాలు తేలాల్సి ఉంది.
సర్దార్ 2 రిలీజ్ అనంతరమే:
ప్రస్తుతం మిత్రన్ కార్తీ హీరోగా `సర్దార్ 2` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అనంతరం యశ్ ప్రాజెక్ట్ కు సంబంధించి మిత్రన్ నుంచి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. వాస్తవానికి సర్దార్ 2 ఇప్పటికే రిలీజ్అ వ్వాలి. ఇదే ఏడాది రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా వాయిదా పడుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఆరంభంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని సన్నాహాలు చేస్తున్నారు.