కేన్స్ 2025లో ఊర్వ‌శి ఓవ‌రాక్ష‌న్

ప్ర‌తిష్ఠాత్మ‌క 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ మంగ‌ళ‌వారం నాడు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. రెండు వారాల పాటు ఈ ఉత్స‌వాలు నిరాటంకంగా జ‌ర‌గ‌నున్నాయి;

Update: 2025-05-14 03:36 GMT

ప్ర‌తిష్ఠాత్మ‌క 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ మంగ‌ళ‌వారం నాడు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. రెండు వారాల పాటు ఈ ఉత్స‌వాలు నిరాటంకంగా జ‌ర‌గ‌నున్నాయి. భార‌త‌దేశం నుంచి నాలుగు సినిమాల‌ను ఇక్క‌డ ప్రీమియ‌ర్లు వేస్తున్నారు. ఐశ్వ‌ర్యారాయ్, ఆలియా భ‌ట్, జాన్వీ లాంటి స్టార్ల రెడ్ కార్పెట్ ఈవెంట్లు కేన్స్ 2025 కి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మార‌నున్నాయి.

అయితే కేన్స్ లో రెండో సారి అడుగుపెడుతోంది ఊర్వ‌శి రౌతేలా. ఈ భామ అక్క‌డ అడుగు పెడుతూనే విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. దీనికి కార‌ణం ఊర్వ‌శి ఎంపిక చేసుకున్న భారీ డిజైన‌ర్ గౌన్. కేన్స్ పండ‌గ‌లో ఊర్వశి రౌతేలా లుక్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఎంపిక చేసుకున్న ముదురు రంగు దుస్తులు, ముదురు రంగు మేక‌ప్ స‌హా ప్ర‌తిదీ విమ‌ర్శ‌ల‌కు గుర‌య్యాయి. త‌న చేతిలో విచిత్రమైన, విలాసవంతమైన ప‌చ్చ‌ని చిలుక ఆకారపు క్లచ్ బ్యాగ్ ఆ క్షణంలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

కేన్స్ 2025లో డే 1 రెడ్-కార్పెట్ వాక్ కోసం ఊర్వశి రౌతేలా డిజైనర్ జుడిత్ లీబర్ డిజైన‌ర్ లుక్ ఉన్న రూ. 4,67,895 ఖరీదు చేసే విలాసవంతమైన అల్ట్రా-గ్లామరస్ ప్యారొట్ (చిలుక‌) బ్లింగ్ క్లచ్ బ్యాగ్ ను ధ‌రించింది. ర‌క‌ర‌కాల రంగుల‌తో ఇది మిరుమిట్లు గొలిపే స్ఫటికాలతో పొదిగిన బ్యాగ్. దీనికి పూర్తి బ్లింగ్ టచ్ ఇవ్వ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. ఈ లుక్ కి అద‌నంగా ఊర్వ‌శి ఒక కిరీటం కూడా ధ‌రించింది. తలపై మ‌ల్టీ క‌ల‌ర్ రత్నాలతో అలంకరించిన రాచరికపు కిరీటాన్ని కూడా ఎంపిక చేసుకుంది. అయితే కేన్స్ లో ఊర్వ‌శి రౌతేలా చాలా ఓవ‌రాక్ష‌న్ చేస్తోంది అంటూ నెటిజ‌నులు కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News