సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ బిజీగా త్రిష.. సినిమాలు, ఓటీటీతో పాటు పాలిటిక్స్!
సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న త్రిష.. ఇప్పుడు కెరీర్‌లో మరో ఆసక్తికరమైన దశను కొనసాగిస్తున్నారు.
సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న త్రిష.. ఇప్పుడు కెరీర్‌లో మరో ఆసక్తికరమైన దశను కొనసాగిస్తున్నారు. సీనియర్ హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతున్నాయనే అంచనాలను తలకిందులు చేస్తూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నారు. ముఖ్యంగా కథ, పాత్రల ఎంపిక విషయంలో ఎంతో సెలెక్టివ్‌గా వ్యవహరిస్తూ సినిమాలతో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనా తన పరిధిని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో త్రిష పేరు వరుసగా భారీ ప్రాజెక్టులతో వినిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూనే.. హీరోయిన్‌గా తన ఇమేజ్‌కు భిన్నమైన కథలను ఎంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆమె కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్ మరింత స్ట్రాంగ్ గా సాగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు గ్లామర్, కమర్షియల్ సినిమాలకే పరిమితమైన ఇమేజ్ నుంచి బయటకు వచ్చి కంటెంట్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ల వైపు కూడా ఆమె దృష్టి పెట్టడం ఈ మార్పుకు మెయిన్ రీజన్‌గా కనిపిస్తోంది.
ఇదే సమయంలో ఓటీటీ కూడా త్రిష కెరీర్‌లో కీలకమైన వేదికగా మారుతోంది. ఇప్పటికే బ్రిందా వంటి వెబ్ కంటెంట్‌తో డిజిటల్ ఆడియన్స్ కు చేరువైన త్రిష.. ఇప్పుడు మరో వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రముఖ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందనుందని టాక్. ఇది సూపర్‌నేచురల్ థ్రిల్లర్ నేపథ్యంతో ఉండనుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు అఫీషియల్ గా అనౌన్స్ కావాల్సి ఉంది.
మరోవైపు త్రిష పర్సనల్ గా కూడా తమిళనాడులో చర్చనీయాంశంగా మారారు. ఆమె రాజకీయ రంగ ప్రవేశంపై గత కొంతకాలంగా సోషల్ మీడియాతో పాటు తమిళ రాజకీయ వర్గాల్లోనూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అఫీషియల్‌గా ఆమె పొలిటికల్ జర్నీపై ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పటికీ.. ఈ అంశం మాత్రం త్రిష పేరును తరచూ వార్తల్లో నిలుపుతోంది.
ఇలా చూస్తే ప్రస్తుతం త్రిష కెరీర్ ఒకే ట్రాక్‌లో సాగడం లేదు. థియేటర్లలో స్టార్ హీరోల సినిమాలు, ఓటీటీలో విభిన్నమైన కథలు, మరోవైపు పొలిటికల్ ఎంట్రీ పై డిస్కషన్స్.. ఇలా మూడు విభిన్న అంశాలతో ఆమె పేరు రెగ్యులర్ గా వార్తల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో త్రిష సెకండ్ ఇన్నింగ్స్‌లో ఓటీటీకి మరింత ప్రాధాన్యత పెరుగుతోందా? అనే డిస్కషన్ కూడా మొదలైంది. ఇక రాబోయే రోజుల్లో ఆమె సెలెక్ట్ చేసుకునే ప్రాజెక్టులు ఈ కొత్త ఇమేజ్‌ను మరింత బలపరుస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది.