• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమల్ హాసన్ బర్త్‌డే...

కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. 'థగ్‌ లైఫ్' రిలీజ్ డేట్ టీజర్!

| ఇక ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-11-07 06:34 GMT

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, లెజండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషనల్ లో ''థగ్‌ లైఫ్'' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు కీలక పాత్రలో నటిస్తున్నారు. త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్యలక్ష్మి, జోజు జార్జ్‌, అభిరామి, నాజర్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ, మేకర్స్ ఓ స్పెషల్ టీజర్ ను ఆవిష్కరించారు.


నేడు ఉలగనాయగన్ కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ 'థగ్‌ లైఫ్' రిలీజ్‌ డేట్‌ టీజర్‌ ను చిత్ర బృందం విడుదల చేసింది. 2025 జూన్ 5వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. బక్రీద్ సీజన్ లో నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ ఈ సినిమాకి కలిసొచ్చే అవకాశం ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో ఈ టీజర్ ను వదిలారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ఇందులో కమల్ హాసన్ రెండు భిన్నమైన లుక్స్ లో కనిపించి సర్ప్రైజ్ చేసారు.

ఇప్పటికే రిలీజైన 'థగ్‌ లైఫ్' ఫస్ట్ లుక్ లో కమల్ హాసన్ పొడవాటి జుట్టు, ఒత్తుగా పెరిగిన గడ్డం మీసాలతో కనిపించగా.. రిలీజ్ టీజర్ లో మీసాలు లేకుండా స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ వీడియోలో శింబు కూడా రెండు షాట్స్ లో తళుక్కున మెరిశాడు. అతను పోనీ టెయిల్ తో కొత్త లుక్ లో కనిపించాడు. ఇందులో యాక్షన్ పాళ్ళు ఎక్కువే అని 48 సెకెన్ల టీజర్ తోనే క్లారిటీ ఇచ్చారు. 70 ఏళ్ళ వయసులోనూ కమల్ యాక్షన్ సన్నివేశాల్లో ఎనెర్జిటిక్ గా పెరఫార్మ్ చేసారు.

'థగ్‌ లైఫ్' రిలీజ్‌ డేట్‌ టీజర్‌ లో విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. కొన్ని షాట్స్ లో మణిరత్నం మార్క్ కనిపించింది. దీనికి ఆస్కార్ విన్నర్ ఏఆర్‌ రెహమాన్ కంపోజ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ నెక్స్ట్ లెవల్ లో ఉందని చెప్పాలి. తమిళ్ టీజర్ చివర్లో 'నాయగన్' అంటూ కొన్ని లిరిక్స్ కూడా వినిపిస్తాయి కానీ, తెలుగులో మాత్రం కేవలం మ్యూజిక్ మాత్రమే వినిపిస్తుంది. ఓవరాల్ గా ఈ స్పెషల్ టీజర్ ఇంట్రెస్టింగ్ ఉంది. సినిమాపై అంచనాలను పెంచుతోంది.

టైటిల్ కు తగ్గట్టుగానే దొంగల నేపథ్యంలో హై ఇంటెన్స్ యాక్షన్‌ డ్రామాగా ‘థగ్‌ లైఫ్‌’ సినిమా రూపొందుతోంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, శివ అనంత్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఉదయనిధి స్టాలిన్ కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ ఈ సినిమాని సమర్పిస్తోంది. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. శర్మిష్ట రాయ్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. స్టంట్ మాస్టర్స్ ద్వయం అన్బరీవ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

1987లో కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో ‘నాయకుడు’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఎవర్ గ్రీన్ కల్ట్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా నిలిచిపోయింది. దాదాపు 37 ఏళ్ళ తర్వాత ఇద్దరు లెజెండ్స్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘థగ్‌ లైఫ్‌’ పై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి వీరిద్దరూ ఎలాంటి సినిమాతో రాబోతున్నారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'కల్కి 2898 AD' సినిమాలో సుప్రీం యాస్కిన్ గా అదరగొట్టిన కమల్.. ‘థగ్‌ లైఫ్‌’తో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Full View
Tags:    
  • Kollywood 
  • Tollywood 
  • Filmindustry 
  • Thuglife 
  • Teaser 
  • Kamlahaasan 
  • SilambarasanTR 
  • Trisha 
  • AshokSelvan 
  • AishwaryaLekshmi 
  • RaviKchandran 
  • ManiRatnam 

Similar News

తెలుగు హీరో 'సీన్' కోసం చర్చలు..?

2026-11-10 05:04 GMT

సూర్య@650+కోట్లు... అరుదైన రికార్డ్

2026-11-10 04:36 GMT

రామాయణ రెస్పాన్స్... జక్కన్న మహాభారతం టైమ్ వచ్చిందా?

2026-11-10 04:35 GMT

పదేళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యే టైం వచ్చిందా?

2026-11-10 04:35 GMT

'రంగ‌స్థ‌లం' చిట్టి బాబును..'పుష్ప‌' పుష్ప‌రాజ్‌ను మించేలా..!

2026-11-10 03:51 GMT

అత్త‌మ్మ‌తో అల్లు కోడ‌ళ్లు వెరీ స్పెష‌ల్ దీపావ‌ళి

2026-11-10 03:51 GMT

ఎందుకు ఇబ్బంది పెడతారు.. రేణు దేశాయ్ ఫైర్

2026-11-10 03:50 GMT

కోడ‌ళ్ల‌తో అక్కినేని స్పెష‌ల్ దీపావ‌ళి సంబ‌రాలు

2026-11-10 03:49 GMT

Bigg Boss Telugu: నామినేషన్స్ లో బిగ్‌ బాస్ అదిరిపోయే ట్విస్ట్!

2026-11-10 03:47 GMT

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

Copyright @2026

Powered by Blink CMS