హాలీవుడ్ మూవీ.. టికెట్ రేట్ మరీ రూ.వేలల్లోనా?

ఇండియాలో హాలీవుడ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.. ఎందుకంటే ఇప్పటికే చాలా హాలీవుడ్ చిత్రాలు భారీ హిట్స్ గా నిలిచాయి.

Update: 2026-06-09 00:30 GMT

ఇండియాలో హాలీవుడ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.. ఎందుకంటే ఇప్పటికే చాలా హాలీవుడ్ చిత్రాలు భారీ హిట్స్ గా నిలిచాయి. రీసెంట్ గా వచ్చిన అబ్సెషన్ కూడా దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ది ఒడిస్సీ విడుదలకు ముందే భారీ చర్చకు దారితీస్తోంది. అయితే ఈసారి సినిమా కథ, క్యాస్టింగ్ కంటే ఎక్కువగా టికెట్ ధరలే హాట్ టాపిక్‌ గా మారాయి.

జూలై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ది ఒడిస్సీ మూవీకి సంబంధించిన ఐమ్యాక్స్ అడ్వాన్స్ బుకింగ్స్ జూన్ 8 నుంచి ప్రారంభమయ్యాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే పలు నగరాల్లో టికెట్ల కోసం ఫుల్ డిమాండ్ కనిపించింది. ముఖ్యంగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌ లో సినిమా ఎక్స్పీరియన్స్ ను ఎంజాయ్ చేయాలనుకున్న ప్రేక్షకులు ముందుగానే తమ సీట్లు రిజర్వ్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

అయితే ఆ బుకింగ్స్ సందర్భంగా బయటకు వచ్చిన టికెట్ ధరలు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. కొన్ని నగరాల్లో టికెట్ ధరలు నార్మల్ రేంజ్ ను దాటిపోయి వేల రూపాయలకు చేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పుణెలో కొన్ని ఐమ్యాక్స్ షోల కోసం టికెట్ ధరలు రూ.1,400 నుంచి ప్రారంభమై దాదాపు రూ.3,000 వరకు ఉండటం సినీ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

ఇక ముంబైలో కూడా ధరలు తక్కువేం లేవు. కొన్ని ప్రీమియం ఐమ్యాక్స్ స్క్రీన్లలో టికెట్ ధరలు రూ.1,000కు పైగా ఉండగా, కొన్ని స్పెషల్ షోల కోసం మరింత ఎక్కువ ధరలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. సాధారణంగా భారీ బడ్జెట్ ఇండియన్ సినిమాల విడుదల సమయంలో కూడా ఇలాంటి ధరలు అరుదుగా కనిపిస్తాయి. దీంతో ఫారిన్ సినిమాలకు ఇంతటి రేట్లు అవసరమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మరోవైపు, ది ఒడిస్సీ సాధారణ సినిమా కాదని అభిమానులు చెబుతున్నారు. హోమర్ రచించిన ఫేమస్ గ్రీక్ బుక్ ఆధారంగా తెరకెక్కుతున్న ఆ మూవీ, మోడ్రన్ ఐమాక్స్ టెక్నాలజీతో రూపొందుతోంది. సినిమా చరిత్రలోనే పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో తీసిన తొలి ఫీచర్ ఫిల్మ్‌ గా దీనిని ప్రమోట్ చేస్తున్నారు. అందుకే ఆడియన్స్ లో ఆసక్తి మరింత పెరిగిందని టాక్ వినిపిస్తోంది.

సినిమాలో ఒడిస్సియస్ పాత్రలో మ్యాట్ డామన్ నటిస్తుండగా, టామ్ హాలండ్, ఆన్ హాథవే, జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్, చార్లీజ్ థెరాన్ వంటి ప్రముఖ హాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆ క్యాస్టింగ్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. అయితే అసలు చర్చ మాత్రం టికెట్ ధరల గురించే కొనసాగుతోంది. సినిమా ఎక్స్పీరియన్స్ స్పెషల్ అయినప్పటికీ, ఒక టికెట్ కోసం వేల రూపాయలు ఖర్చు చేయడం ప్రతి ప్రేక్షకుడికి సాధ్యమయ్యే విషయం కాదు.

ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలనుకునే వారికి ఆ రేట్లు మరింత భారంగా మారే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ఒకే ప్రశ్న వినిపిస్తోంది. మోడ్రన్ టెక్నాలజీతో రూపొందిన సినిమాకు అధిక ధరలు సహజమేనా? లేక ఆడియన్స్ పై అదనపు భారం వేయడం సరైందా? అనే అంశంపై చర్చ కొనసాగుతోంది. ఏదేమైనా ఒడిస్సీ సినిమా విడుదల సమయానికి డిబేట్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Tags:    

Similar News