ఫోటో క్లిక్‌: వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మే

ట‌బు లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. ఈ ఫోటోగ్రాఫ్ లో ట‌బు వ‌య‌సు స‌గానికి స‌గం త‌గ్గిపోయిన‌ట్టే క‌నిపిస్తోంది.

Update: 2024-05-09 01:30 GMT

అవును.. వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మే. కిల్ చేసే మ‌న‌సుండాలే కానీ, కిల్ల‌ర్ లుక్స్ తో క‌ట్టి ప‌డేయాలే కానీ.. ఎప్ప‌టికీ న‌వ‌య‌వ్వ‌నులే....!! ఈ జాబితాలో కొంద‌రు సీనియ‌ర్ తార‌లు ఉన్నారు. వీళ్లంద‌రిలో ది గ్రేట్ ట‌బు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇటీవ‌లే క్రూ చిత్రంలో ట‌బు గ్లామ‌ర‌స్ అవ‌తార్, అద్భుత న‌ట‌న‌కు మ‌తులు చెడిపోయాయి. జాతీయ ఉత్త‌మ న‌టి మ‌రోసారి తానేంటో చూపించించింది! అంటూ అభిమానులు కితాబిచ్చేసారు.

 

వేడెక్కించే ఎయిర్ హోస్టెస్ గా క్యాబిన్ క్రూ పాత్ర‌లో అద్భుతంగా న‌టించి మెప్పించింది ట‌బు. ఓవైపు క‌రీనా, కృతి స‌నోన్ లాంటి హాట్ గాళ్స్ పోటీబ‌రిలో ఉన్నా కానీ ట‌బు ముందు వారి ప‌ప్పులేవీ ఉడ‌క‌లేదు. థియేట‌ర్ల‌లో యూత్ క‌ళ్ల‌న్నీ టబుపైనే. బోల్డ్ లుక్స్ తో కొంటె త‌ల‌పుల్లోకి దించేసింది ట‌బు. అందుకే 50 ప్ల‌స్ లో ఉన్నా కానీ ట‌బులో ఆ ఎన‌ర్జీ అందం ఇసుమంత కూడా చెక్కు చెద‌ర‌లేద‌ని అభిమానులు కాంప్లిమెంట్లు ఇచ్చేసారు.

Read more!

నిజానికి ఒక లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్టును తెలుగు ద‌ర్శ‌కులు వండి వార్చ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నారు కానీ, ట‌బు లాంటి ఉత్త‌మ న‌టీమ‌ణుల‌తో కోట్లాది రూపాయ‌ల క‌న‌క‌వ‌ర్షం కురిపించ‌వ‌చ్చ‌ని నిరూప‌ణ అయింది. సిల్కు స్మిత డ‌ర్టీ పిక్చ‌ర్ తీసినా లేదా ట‌బు, బెబోల‌తో క్రూ సినిమా తీసినా బాలీవుడ్ క్రియేట‌ర్లు ఈ టైప్ రొమాంటిక్ కామెడీ జాన‌ర్ల‌లో ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌తో పోలిస్తే ఒక‌డుగు ముందున్నార‌నే చెప్పాలి.

ట‌బు లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. ఈ ఫోటోగ్రాఫ్ లో ట‌బు వ‌య‌సు స‌గానికి స‌గం త‌గ్గిపోయిన‌ట్టే క‌నిపిస్తోంది. చాకో బిస్కెట్ ని అలా పంటి కింద పెట్టి నిర్ధ‌య‌గా కొరికేస్తుంటే కుర్ర‌కారు గుండెలు ల‌య త‌ప్పుతున్నాయ్! ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది.

Tags:    

Similar News