తాప్సి కామెంట్స్‌కి అందని ద్రాక్ష సామెతతో కౌంటర్
తాప్సి కెరీర్ ఆరంభం నుంచి కూడా లక్ మీదే ఆఫర్లు దక్కించుకుంటుంది అంటూ ట్రోల్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు కూడా అదే తరహాలో తాప్సి కెరీర్‌లో ముందుకు సాగుతుందని అనే వారు ఉన్నారు.
తాప్సి ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగు పెట్టి 15 ఏళ్లు దాటింది. ఇప్పటికీ తాప్సి వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. టాలీవుడ్‌లో కెరీర్‌ను ఆరంభించి బాలీవుడ్, కోలీవుడ్‌లతో పాటు మలయాళంలోనూ సినిమాలు చేసింది. అయితే ఇప్పటి వరకు తాప్సికి రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు దక్కించుకున్న మూవీ పడలేదు అనేది వాస్తవం. టాలీవుడ్‌లో వరుస ఫ్లాప్స్‌ను మూట కట్టుకున్న తాప్సికి లక్కీగా బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించినా ఎక్కువ సినిమాలు నిరాశను మిగిల్చాయి. తాప్సికి ఇప్పటి వరకు ఇది కమర్షియల్‌గా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది అనే సినిమా పడలేదు. అయినా కూడా లక్ బాగుండి సినిమా ఆఫర్లు వస్తున్నాయి. తాప్సి కెరీర్ ఆరంభం నుంచి కూడా లక్ మీదే ఆఫర్లు దక్కించుకుంటుంది అంటూ ట్రోల్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు కూడా అదే తరహాలో తాప్సి కెరీర్‌లో ముందుకు సాగుతుందని అనే వారు ఉన్నారు.
తాప్సి ఇంటర్వ్యూ వైరల్..
ఇండస్ట్రీకి వచ్చి ఇన్నాళ్లు అయినా ఇప్పటి వరకు కమర్షియల్‌గా బిగ్గెస్ట్ హిట్‌ను సొంతం చేసుకోలేక పోయింది అంటూ తాప్సిని గురించి విమర్శించే వారికి తనదైన శైలిలో సమాధానం ఇస్తూ ఉంటుంది. తాజాగా జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి తనకు కమర్షియల్ హిట్స్ పడక పోయినా మంచి సినిమాలు చేశాను అనే సంతృప్తి ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇప్పుడు కమర్షియల్‌గా హిట్ కాని సినిమాలు పదేళ్ల తర్వాత కల్ట్ సినిమాలుగా పేరు తెచ్చుకుంటాయనే నమ్మకం వ్యక్తం చేసింది. ఇప్పటికిప్పుడు డబ్బులు తెచ్చి పెట్టే సినిమాలు చేయకుండా భవిష్యత్తులోనూ తన సినిమాల గురించి మాట్లాడుకునేలా సినిమాలు చేస్తున్నాను అంటూ తాప్సి చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు. తాప్సి తనను తాను కవర్ చేసుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని కొందరు అంటున్నారు.
టాలీవుడ్ సినిమాలతో తాప్సి...
ఈ సందర్భంగా తెలుగులో ఉన్న ఒక సామెతను కొందరు గుర్తు చేస్తున్నారు. అందని ద్రాక్ష పుల్లన అనే సామెత ప్రకారం తనకు దక్కని కమర్షియల్ హిట్స్ గురించి తాప్సి తక్కువ చేసి మాట్లాడుతుంది. ఇప్పుడు డబ్బులు వచ్చినా ఆ సినిమాలను భవిష్యత్తులో ఎవరు గుర్తు పెట్టుకోరు, కానీ ఇప్పుడు డబ్బులు రాకున్నా కొన్ని సినిమాలు భవిష్యత్తులో అంటే పదేళ్ల తర్వాత కల్ట్ మూవీస్‌గా మాట్లాడుకుంటారు అంటూ తన ఫ్లాప్స్ సినిమాలను తానే పైకి లేపే ప్రయత్నాలు చేస్తుంది. ఇండస్ట్రీలో ఈమె అడుగు పెట్టిన కొత్తలో వచ్చిన ప్లాప్స్ ను ఇప్పుడు ఎంత వరకు కల్ట్ బొమ్మలు అంటున్నారు. వాటి గురించి ఇప్పుడు ఏమైనా పాజిటివ్‌గా మాట్లాడుతున్నారా అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా తాప్సిని ప్రశ్నిస్తున్నారు. కమర్షియల్‌గా హిట్ అయితే పదేళ్ల తర్వాత మాట్లాడుకోరా అని కూడా కొందరు వెటకారంగా తాప్సిని ప్రశ్నిస్తున్నారు.
బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో...
మొత్తానికి తాప్సి తనకు కమర్షియల్‌గా సూపర్ హిట్స్ దక్కకున్నా బాధ పడటం లేదని, తాను చేసిన సినిమాల గురించి పది.. ఇరవై ఏళ్ల తర్వాత కూడా మాట్లాడుకోబోతున్నారనే విశ్వాసం ను వ్యక్తం చేస్తుంది. ఇప్పటికిప్పుడు డబ్బులు తెచ్చి పెట్టే సినిమాలు చేసే ఆలోచన లేదని చెబుతున్న తాప్సి వ్యాఖ్యలను చాలా మంది తప్పుబడుతున్నారు. అలాంటి సినిమాలు చేయకుంటే ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఎలా నెగ్గుకు వచ్చావంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. సరైన బ్లాక్ బస్టర్ లేకుండా, కమర్షియల్‌గా బిగ్గెస్ట్ హిట్స్ లేకుండా ఇన్నాళ్లు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా తాప్సి కొనసాగడం ఆశ్చర్యంగా ఉందని, ఆమె కాకుండా మరే హీరోయిన్ అయినా ఇప్పటికే కనుమరుగు అయ్యేవారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తానికి తాప్సి అదృష్టంతో పాటు, పట్టుదలతో ఆఫర్లు దక్కించుకుంటూ ఇప్పటికీ బిజీగానే ఉంది. గత ఏడాది కొన్ని కారణాల వల్ల సినిమాలతో రాలేక పోయిన తాప్సి ఈ ఏడాదిలో కనీసం రెండు మూడు సినిమాలతో అయినా రావాలనే పట్టుదలతో ఉంది. టాలీవుడ్‌లో చాలా కాలం తర్వాత ఒక సినిమాతో తాప్సి రాబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది.