సూర్య రెగ్యులర్ ట్రాక్ మార్చింది తనేనంట!
విలక్షణమైన పాత్రలకు, విలక్షణ కథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన స్టార్ సూర్య. కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ఆడియన్స్‌ని సైతం తన సినిమాలతో ఆకట్టుకుంటూ రెండు భాషల్లోనూ ప్తర్యేక గుర్తింపుని, అశేష అభిమానుల్ని సొంతం చేసుకున్నారు.;
విలక్షణమైన పాత్రలకు, విలక్షణ కథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన స్టార్ సూర్య. కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ఆడియన్స్‌ని సైతం తన సినిమాలతో ఆకట్టుకుంటూ రెండు భాషల్లోనూ ప్తర్యేక గుర్తింపుని, అశేష అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. అయితే గత కొంత కాలంగా సూర్య తన మ్యాజిక్‌ని రిపీట్ చేయలేకపోతున్నారు. కొత్త కథలంటూ చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద పేలకపోవడంతో వరుప ఫ్లాపుల్ని ఎదుర్కొంటూ రేసులో వెనక బడ్డారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలిసి సినిమా చేస్తున్నారు.
వినూత్నమైన స్టోరీతో `విశ్వనాథ్ అండ్ సన్స్` పేరుతో రూపొందుతున్న ఈ మూవీని తెలుగు ప్రొడ్యూసర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మరో నిర్మాత సాయి సౌజన్యతో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. తనకంటే 20 ఏళ్ల వయసు చిన్నదైన అమ్మాయి ప్రేమిస్తున్నానంటూ వెంటపడితే హీరో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ..ఆ తరువాత ఎదురైన సవాళ్లేంటీ? అనే వినూత్నకథాంశంతో దీన్ని రూపొందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది.
అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్నఈ మూవీలో హీరో సూర్య తన ఏజ్‌కి తగ్గ క్యారెక్టర్‌లో నటించారు. జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. అయితే హీరో సూర్య గత కొన్నేళ్లుగా తెలుగులో మూవీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. `గజిని` టైమ్ నుంచే తెలుగు ప్రొడ్యూసర్స్ ప్రయత్నాలు చేస్తున్నా అది ఇప్పటికి కుదిరింది. అయితే ప్రముఖ నిర్మాణ సంస్థలు సూర్యతో సినిమా చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఫైనల్‌గా సూర్య ఈ మూవీ చేయడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ అంట.
ఈ విషయాన్ని స్వయంగా జీవి ప్రకాష్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించి షాక్ ఇచ్చాడు. వెంకీ అట్లూరితో సినిమా చేయమని హీరో సూర్యకు సలహా ఇచ్చింది జీవి ప్రకాష్ అంట. ఈ విషయాన్ని రీసెంట్‌గా బయటపెట్టి షాక్ ఇచ్చాడు. `లక్కీ భాస్కర్` చూసిన తరువాత సూర్యకు ఫోన్ చేసి వెంకీ అట్లూరితో సినిమా చేయమని చెప్పాడట. అంతే కాకుండా రీసెంట్‌గా విడుదల చేసిన టీజర్‌లో చూపించింది చాలా తక్కువేనని అసలు సర్ప్రైజ్‌లు చాలా వరకు దాచామని చెప్పుకొచ్చాడు.
ఔట్‌పుట్ చాలా అద్భుతంగా వచ్చిందని, 100 శాతం సూపర్ అన్నాడు. అంతే కాకుండా సినిమాలో మ్యూజిక్‌కు చాలా స్కోప్ ఉందని, మ్యూజిక్ వన్ ఆఫ్ ద హైలైట్‌గా నిలుస్తుందని వివరించాడు. నేను స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు సూర్యగారి గజిని మూవీని ఎంతగానో ఆస్వాదించాను. అప్పట్లో మేం సూర్యగారిని అలాగే చూసే వాళ్లం. ఇప్పటికీ ఆయనలో ఆకర్షణ అలాగే చెక్కు చెదరలేదు. మహిళా ప్రేక్షకులు ఈ సినిమాని ఎంతగానో ఇష్టపడతారు.. అంటూ సినిమా విజయంపై తనకున్న కాన్ఫడెన్స్‌ని బయటపెట్టే ప్రయత్నం చేశాడు.