అఖిల్ తన భుజస్కంధాలపై మోశాడు: హీరో సుమంత్

అక్కినేని కుటుంబ హీరోగా ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతున్నారు హీరో సుమంత్ ఇటీవల ఓ చిత్ర వేడుకలో పాల్గొని తన కెరీర్ విశేషాలతో పాటు క‌జిన్ అఖిల్ అక్కినేని సాధించిన విజయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-09-07 03:56 GMT

అక్కినేని కుటుంబ హీరోగా ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతున్నారు హీరో సుమంత్ ఇటీవల ఓ చిత్ర వేడుకలో పాల్గొని తన కెరీర్ విశేషాలతో పాటు క‌జిన్ అఖిల్ అక్కినేని సాధించిన విజయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఈవెంట్‌లో సిద్ధు జొన్నలగడ్డ, బ్రహ్మానందం, అలీ వంటి ప్రముఖ నటులతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూనే, తన ప్రియమైన తమ్ముడు అఖిల్ అక్కినేని `లెనిన్` మూవీ సాధించిన భారీ విజయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఈ సందర్భంగా అఖిల్‌ను సరదాగా ``అయ్యగారు`` అని నెటిజన్లు పిలవడంపై స్పందిస్తూ సుమంత్ నవ్వులు పూయించారు. ``నేను కుటుంబంలో పెద్ద మనవడిని.. అఖిల్ చిన్న మనవడు. కాబట్టి నిజంగా `అయ్యగారు`అని పిలవాలంటే నన్ను పిలవాలి కానీ వాడిని కాదు! అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. చిన్నప్పటి నుంచి తన చేతుల్లోనే పెరిగిన అఖిల్ తన సినిమా వేడుకకు వచ్చి సపోర్ట్ అందించడంపై ఎంతో సంతోషాన్ని, ఆత్మీయతను వ్యక్తం చేశారు.

ఇటీవల అఖిల్ నటించి విడుదలైన `లెనిన్` చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడాన్ని సుమంత్ ప్రత్యేకంగా కొనియాడారు. అఖిల్‌లో అద్భుతమైన నటుడు ఉన్నాడని...సరైన సినిమా పడితే తన సత్తా ఏంటో చూపిస్తాడని అందరికీ తెలుసని, 'లెనిన్' మూవీతో అది నిరూపితమైందని చెప్పారు. కేవలం సినిమా హిట్ అవ్వడమే కాకుండా తన నటనతో చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడని కొనియాడారు.

ముఖ్యంగా `లెనిన్` ద్వితీయార్థంలో వచ్చే చివరి 45 నిమిషాల సన్నివేశాలను అఖిల్ తన భుజస్కంధాలపై మోశారని సుమంత్ ప్రశంసించారు. సింగిల్ హ్యాండెడ్‌గా ఆ చివరి భాగంలో ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో సినిమా స్థాయిని మార్చి బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాడని విశ్లేషించారు. కథలోని ట్విస్ట్‌లు తెలిసిన తర్వాత రెండోసారి ఆ సినిమా చూసినప్పుడు, ఒక నటుడిగా అఖిల్ చూపించిన పరిణతి (ప్రిసిషన్) చూసి తాను ఎంతో గర్వపడ్డానని వ్యాఖ్యానించారు.

అఖిల్ సాధించిన ఈ ఘనవిజయానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులతో పాటు అత్యంత సంతోషపడిన వ్యక్తుల్లో తాను మొదటి వరుసలో ఉంటానని సుమంత్ భావోద్వేగంగా చెప్పారు. మరోవైపు సెప్టెంబర్ 11న విడుదల కాబోతున్న తన సొంత చిత్రం కోసం చిత్రబృందం ఎంతో కష్టపడి పనిచేసిందని..ఆ సినిమాపై కూడా తనకు పూర్తి నమ్మకం ఉందంటూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News