కేంద్ర మంత్రి పై అలిగిన దిగ్గ‌జ‌ రైట‌ర్!

మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దిగ్గజ గీత రచయిత, దర్శకుడు శ్రీకుమారన్ తంపి తాజాగా కేంద్ర మంత్రి, నటుడు సురేశ్ గోపిపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

Update: 2026-08-14 23:30 GMT

మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దిగ్గజ గీత రచయిత, దర్శకుడు శ్రీకుమారన్ తంపి తాజాగా కేంద్ర మంత్రి, నటుడు సురేశ్ గోపిపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంటు వేదికగా సురేశ్ గోపి తన పాటను ప్రస్తావించినా? దాని అసలు సృష్టికర్త అయిన తనకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వకపోవడం పట్ల శ్రీకుమార‌న్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ ఘటన కేరళ రాజకీయ - సినీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల పార్లమెంటు సమావేశాల సందర్భంగా సురేశ్ గోపి ప్రముఖ మలయాళ పాటను ఉదాహరణగా చూపుతూ ప్రసంగించారు.

అయితే ఆ పాటను రాసింది ఎవారనే? విషయాన్ని సురేష్ గోపీ ప్రస్తావించకపోవడం, కనీసం గీత రచయిత పేరును సభలో వెల్లడించకపోవడం శ్రీకుమారన్ తంపిని నిరాశపరిచింది. ఒక కళాకారుడికి దక్కాల్సిన కనీస గుర్తింపును ఇలాంటి పెద్ద వేదికలపై విస్మరించడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. సాధారణంగా ఏ రచయిత లేదా కళాకారుడైనా తమ సృష్టికి గుర్తింపు దక్కాలని ఆశించడం సహజం. అందునా దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటులో ఒక పాటను ప్రస్తావించినప్పుడు దాని వెనుక ఉన్న కృషిని గుర్తించి గౌరవిస్తారని భావిస్తారు.

కానీ సురేశ్ గోపి ప్రసంగంలో ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం వల్ల సీనియర్ సృష్టికర్తలను అవమా నించినట్లైందని పలువురు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామంపై శ్రీకుమారన్ తంపి సోషల్ మీడియా వేదికగా ..మీడియా ముఖంగా తన ఆవేదనను వెల్లడించారు. తానేమీ భారీ పురస్కారాలు ఆశించడం లేదని, కేవలం ఒక కళాకారుడిగా తన హక్కు అయిన క్రెడిట్ దక్కాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. తోటి కళాకారుడిగానే కాకుండా బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా ఉన్న సురేశ్ గోపి ఇలాంటి చిన్న విషయాలపై మరింత శ్రద్ధ పెట్టాల్సిందని హిత‌వు ప‌లికారు.

ఈ వివాదంపై సురేశ్ గోపి గానీ, ఆయన బృందం నుంచి కానీ ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అయిన ప్పటికీ మలయాళ సినీ పరిశ్రమకు దశాబ్దాలుగా ఎంతో సేవ చేసిన ఒక సీనియర్ వ్యక్తికి ఇలాంటి చేదు అనుభవం ఎదురు కావడం పట్ల పలువురు ప్రముఖులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులోనైనా ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా నాయకులు జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు. పార్లమెంటులో జరిగిన ఈ చిన్న పొరపాటు ఇప్పుడు పెద్ద చర్చకు తెరలేపింది. కళను, కళాకారులను గౌరవించడం ప్రజా ప్రతినిధుల బాధ్యత అని, సృజనాత్మకతకు తగిన గుర్తింపు ఇవ్వడం వల్లనే వారి శ్రమకు నిజమైన విలువ దక్కుతుందని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

Tags:    

Similar News