ప్రభుత్వంతోనే నటి వ్యాపారమా?
అంతేకాదు.. తన భర్త కూడా వ్యాపారాల్లో తీవ్రంగా నష్టపోయారు. సొంత ప్రొడక్షన్ హౌస్ దివాళా తీసిందంటూ ఇంతకుముందు వార్తలు రావడం కలవరపరిచింది.;
సౌత్ లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగి అటుపై బాలీవుడ్ కి వెళ్లిపోయిన ప్రముఖ నటి ఫిట్నెస్ వ్యాపారంలోను తెలివైన పెట్టుబడులతో ఆర్జించడంపై నెటిజనుల్లో నిరంతరం చర్చ సాగుతోంది. భారతదేశంలో పలు నగరాల్లో ఇప్పటికే మూడు బ్రాండెడ్ జిమ్ములను నిర్వహిస్తూ, వీటి ద్వారా బాగానే ఆర్జిస్తోంది. అయితే హిందీ సినిమాల్లో నటించి, బాలీవుడ్ నిర్మాత కం నటుడిని పెళ్లాడిన ఈ భామకు పెళ్లి తర్వాత ఏదీ కలిసి రావడం లేదు. నటనా కెరీర్ పరంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది.
అంతేకాదు.. తన భర్త కూడా వ్యాపారాల్లో తీవ్రంగా నష్టపోయారు. సొంత ప్రొడక్షన్ హౌస్ దివాళా తీసిందంటూ ఇంతకుముందు వార్తలు రావడం కలవరపరిచింది. అయితే ఇలాంటి కష్టనష్టాల్లోంచి బయటపడేందుకు ఈ భామ తనకు ఫిట్నెస్ బిజినెస్ లో ఉన్న అనుభవాన్ని ఉపయోగించి రీబూట్ అవ్వాలని ప్లాన్ చేస్తోందట. తన భర్తతో కలిసి ఇప్పుడు ఫిట్నెస్ జిమ్ లను విస్తరించే ప్రణాళికల్ని రచిస్తోందని సమాచారం. భారతదేశంలో ఆరోగ్యం, అందంపై యువత ఫోకస్ ఎక్కువగా ఉంది. అందువల్ల ప్రతి వీధికి ఒక జిమ్ అవసరం. ఇది ఫిట్నెస్ వ్యాపారాన్ని వృద్ధి వైపు తీసుకెళుతుంది.
సరిగ్గా ఇదే వ్యూహరచనతో ఈ జంట ముందుకు సాగుతోందట. అందుకే ఈ సమయంలో ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో సత్సంబంధాలను మెయింటెయిన్ చేస్తున్న ఈ జంట, తమ ఫిట్నెస్ వ్యాపారానికి వారిని ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తోందట. దీనికోసం ప్రభుత్వం తరపున ఫిట్నెస్ ఉద్యమానికి క్యాంపెయిన్ చేస్తూ, దానిని తమ ఫిట్నెస్ జిమ్ ల వ్యాపార వృద్ధికి ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు గుసగుస వినిపిస్తోంది. యోగా ఫిట్నెస్ అంటూ ప్రపంచ వేదికపై తమను తాము ప్రమోట్ చేసుకుంటోంది ఈ జంట. నటిగా అవకాశాల్లేవ్.. భర్త సినిమాల నిర్మాణం కలిసి రావడం లేదు. అందుకే ఇప్పుడు ఫిట్నెస్ రంగంలో ఎదగాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ జంట ఎవరో ఈ పాటికే మీరంతా గ్రహించి ఉండాలి. గెస్ హూ దట్ క్రేజీ కపుల్?