94 ఏళ్ల వయసులో డైరెక్షన్.. 120 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేశారా?
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు సినిమా నిర్మాణం అంటే సంవత్సరాల పాటు సాగే ప్రక్రియగా మారిపోయింది.;
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు సినిమా నిర్మాణం అంటే సంవత్సరాల పాటు సాగే ప్రక్రియగా మారిపోయింది. భారీ బడ్జెట్ లు, పాన్ ఇండియా ప్లానింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. అన్నీ కలిసి ఒక ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం మూడు నుంచి నాలుగు నెలల్లో మొత్తాన్ని చిత్రాన్ని తెరకెక్కించడం నిజంగా విశేషం. ఈ నేపథ్యంలో లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
94 ఏళ్ల వయసులో కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన సింగీతం, క్రియేటివిటీకి వయస్సుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు. గతంలో పుష్పక్ వంటి ప్రయోగాత్మక మూకీ చిత్రం నుంచి ఆదిత్య 369 వంటి విజనరీ సైన్స్ ఫిక్షన్ సినిమాల వరకు విభిన్న జానర్లలో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సింగ్ గీతం అనే మ్యూజికల్ ఫాంటసీతో సినీ ప్రియులకు మరో కొత్త ఎక్స్పీరియన్స్ అందించేందుకు సిద్ధమయ్యారు.
రీసెంట్ గా విడుదలైన టైటిల్ టీజర్ చూస్తే, ఒక మిస్టీరియస్ గ్రామం నేపథ్యంలో కథ సాగుతుందని తెలుస్తోంది. ప్రతాప్ అనే యువకుడు కనిపించేదంతా నిజం కాని ప్రపంచంలోకి అడుగు పెట్టి , అభివృద్ధి- పరిరక్షణ మధ్య జరిగే సంఘర్షణలో చిక్కుకుంటాడు. తన నిర్ణయాలు, నమ్మకాలు, లక్ష్యాలను తిరిగి తనకు తానే క్వశ్చన్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఫాంటసీకి కామెడీ యాడ్ చేయడం సింగీతం స్టైల్ కాగా, ఈ చిత్రంలో కూడా అదే ఎలిమెంట్ క్లియర్ గా కనిపిస్తోంది.
అయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆ సినిమాలో బెనర్జీ, శివ నారాయణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతికంగా కూడా మూవీ మంచి రేంజ్ లో ఉండబోతుందనే టీజర్ ద్వారా అర్థమవుతోంది. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగీతం ఆ మ్యూజికల్ ఫాంటసీ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.
ఆ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మిస్తుండడం విశేషం. ప్రముఖ వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై గ్రాండ్ గా రూపొందుతున్న ఆ సినిమా జూన్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఫిబ్రవరిలోనే సినిమాను సింగీతం శ్రీనివాసరావు అనౌన్స్ చేయగా.. అప్పుడు అన్ని పనులు పూర్తి చేసుకుని సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవడం మామూలు విషయం కాదు.
ఏదేమైనా ప్రస్తుతం ఉన్న లాంగ్ ప్రొడక్షన్ ప్రాసెస్ ల మధ్య సింగ్ గీతం స్పీడ్ మేకింగ్ తో ప్రత్యేకంగా నిలుస్తోంది. ముఖ్యంగా సింగీతం చూపించిన ప్లానింగ్, డెడికేషన్ ఇతర దర్శకులు, నిర్మాతలకు ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తుందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. కొత్త ఆలోచనలు, కచ్చితమైన ప్లాన్ ఉంటే తక్కువ సమయంలో కూడా మంచి క్వాలిటీ సినిమా రూపొందించవచ్చని ఆయన మరోసారి నిరూపించారని ప్రేక్షకులు చెబుతున్నారు. మరి సింగ్ గీతం సినిమా ఎలాంటి హిట్ అవుతుందో అంతా వేచి చూడాలి.